రక్షణ మంత్రిత్వ శాఖ
త్రివిధ దళాల ప్రధానాధికారి (సీడీఎస్), మిలిటరీ కార్యకలాపాల విభాగ కార్యదర్శిగా జనరల్ అనిల్ చౌహన్ పదవీ కాలాన్ని పొడిగించిన ప్రభుత్వం
प्रविष्टि तिथि:
24 SEP 2025 9:34PM by PIB Hyderabad
త్రివిధ దళాల ప్రధానాధికారి (సీడీఎస్), భారత ప్రభుత్వ మిలిటరీ కార్యకలాపాల విభాగ కార్యదర్శిగా జనరల్ అనిల్ చౌహన్ పదవీ కాలాన్ని పొడిగిస్తూ క్యాబినెట్ నియామకాల కమిటీ (ఏసీసీ) సెప్టెంబర్ 24, 2025న నిర్ణయం తీసుకుంది. ఈ పదవీ కాలం మే 30, 2026 వరకూ లేదా తదుపరి ఆదేశాలు వచ్చే వరకూ కొనసాగుతుంది. సెప్టెంబర్ 28, 2022న జనరల్ అనిల్ చౌహన్ సీడీఎస్ గా నియమితులయ్యారు.
జనరల్ చౌహన్ 1981లో భారత ఆర్మీలో చేరి, కీలకమైన కమాండ్, స్టాఫ్ విభాగంలో విశేషమైన సేవలందించారు. భారత సైన్యానికి ఆయన చేసిన అత్యుత్తమ సేవలకుగానూ పరమ విశిష్ట సేవా పతకం, ఉత్తమ యుద్ధ సేవా పతకం, అతి విశిష్ట సేవా పతకం, సేనా పతకం, విశిష్ట సేవా పతకాలతో ఆయన్ని సత్కరించారు.
***
(रिलीज़ आईडी: 2171112)
आगंतुक पटल : 30