ప్రధాన మంత్రి కార్యాలయం
‘స్వచ్ఛతా హీ సేవా’ ఉద్యమంలో చేరాల్సిందిగా పౌరులను కోరిన ప్రధానమంత్రి
Posted On:
23 SEP 2025 12:54PM by PIB Hyderabad
‘స్వచ్ఛతా హీ సేవా’ ప్రచార ఉద్యమంలో చురుకుగా పాలు పంచుకోవాల్సిందిగా పౌరులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు పిలుపునిచ్చారు. ఈ ఉద్యమం సమష్టి బాధ్యతతో పాటు దేశాభిమానానికి అద్దం పట్టే ఒక స్ఫూర్తిదాయక కార్యక్రమంగా ఆయన అభివర్ణించారు.
సామాజిక మాధ్యమం ‘‘ఎక్స్’’లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:
‘‘స్వచ్ఛతతో ముడిపడ్డ ఈ కార్యక్రమం ఎంతో ఉత్సాహాన్ని అందిస్తుంది. ఈ ఉద్యమంలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని, దీనిని విజయవంతం చేయాల్సిందిగా నేను కోరుతున్నాను’’
*****
MJPS/SR/SKS
(Release ID: 2170117)
Read this release in:
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Bengali-TR
,
Punjabi
,
Gujarati