వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
‘హెచ్ఎస్ఎన్ కోడ్‌ల మ్యాపింగ్ గైడ్‌బుక్’ను విడుదల చేసిన కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి
విధాన రూపకల్పన, వాణిజ్య చర్చలకు సహయపడనున్న గైడ్ బుక్
12,167 హెచ్ఎస్ఎన్ కోడ్‌ల వివరాలతో తయారైన గైడ్‌బుక్
Posted On:
20 SEP 2025 6:53PM by PIB Hyderabad
భారత్‌లో తయారీ కార్యక్రమం దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పియూష్ గోయల్ ఈ రోజు ఢిల్లీలో పరిశ్రమలు, అంతర్గర వాణిజ్య ప్రోత్సాహక విభాగం (డీపీఐఐటీ) తయారుచేసిన ‘హెచ్‌ఎస్‌ఎన్ కోడ్‌ల మ్యాపింగ్ గైడ్‌బుక్’ను విడుదల చేశారు.
ఈ గైడ్‌బుక్ 12,167 హెచ్‌ఎస్ఎన్ సంకేతాలను 31 మంత్రిత్వ శాఖలు, విభాగాలకు కేటాయించింది. లక్ష్యాలను ఆధారంగా చేసుకునే విధాన రూపకల్పనకు వీలు కల్పిస్తుందని, ప్రభావవంతమైన వాణిజ్య చర్చలకు ఇది మద్దతిస్తుందన్న అంచనా ఉంది. ప్రపంచ వాణిజ్య కార్యకలాపాల్లో భారతదేశం పాత్రను బలోపేతం అవుతున్న దృష్ట్యా.. సంబంధిత రంగాల్లోని నిపుణుల మార్గదర్శకత్వంలో ఆయా రంగాలు వృద్ధి సాధించేలా చూసుకునేందుకు ఉత్పత్తులను సంబంధిత విభాగాలతో అనుసంధానించటం అనేది ప్రాధాన్యమైన అంశంగా మారిందని కేంద్ర మంత్రి శ్రీ పియూష్ గోయల్ అన్నారు.
ఈ గైడ్‌బుక్.. హెచ్ఎస్ఎన్ సంకేతాల విషయంలో స్పష్టతను తీసుకొస్తుందని, దీని ఫలితాలను 'భారత్‌లో తయారీ', 'బ్రాండ్ ఇండియాను పెంపొందించటం', 'ప్రపంచం కోసం తయారీ' అనే మార్గదర్శక సూత్రాలకు అనుగుణంగా ఉపయోగించుకునేందుకు ఒక స్పష్టమైన ప్రణాళికను అందిస్తుందని పీయూష్ గోయల్ తెలిపారు. ప్రతి హెచ్‌ఎస్ఎన్ సంకేతాన్ని సంబంధిత మంత్రిత్వ శాఖకు అనుసంధానించటం వల్ల ఇది.. ఆయా రంగాలకు సంబంధించిన ప్రక్రియలను అర్థం చేసుకోవటం, వ్యాపార సమన్వయాన్ని సులభతరం చేయటం, వాణిజ్య చర్చలలో భారత్ స్థానాన్ని బలోపేతం చేయటానికి ఉపయోగపడనుంది. హెచ్ఎస్ఎన్ వ్యవస్థపై అవగాహన వల్ల సామర్థ్యం పెరిగి చట్టపరమైన భారం తగ్గుతుంది.. వికసిత్ భారత్-2047 లక్ష్యానికి దోహదపడేలా రవాణా, వాణిజ్య రంగాలను మరింత పోటీపడేలా చేస్తుంది.
***
(Release ID: 2169364)