సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

అగ్రనటుడు, దర్శకుడు, నిర్మాత శ్రీ మోహన్‌లాల్‌కు 2023 సంవత్సరానికి దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం


71వ జాతీయ పురస్కారాల ప్రకటన

నటుడిగా మోహన్‌లాల్ కృషి కేరళ నుంచి ప్రపంచ ప్రేక్షకుల వరకు

మన సంస్కృతిని పరిచయం చేసింది.. మన ఆకాంక్షలను విస్తృతం చేసింది..

ఆయన వారసత్వం భారత సృజనాత్మక రంగానికి స్ఫూర్తినిస్తూనే ఉంటుంది: శ్రీ అశ్వినీ వైష్ణవ్

Posted On: 20 SEP 2025 7:52PM by PIB Hyderabad

దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాల ఎంపిక కమిటీ సిఫార్సు మేరకు 2023 సంవత్సరానికి ప్రతిష్ఠాత్మక దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని శ్రీ మోహన్‌లాల్‌కు ప్రదానం చేస్తున్నట్లు భారత ప్రభుత్వం ఈ రోజు ప్రకటించిందిదిగ్గజ నటుడుగాదర్శకుడుగానిర్మాతగా భారతీయ సినిమాకు చేసిన సేవలకు గాను ఆయనకు ఈ పురస్కారాన్ని ప్రకటించారుఈ నెల 23న నిర్వహించే 71వ జాతీయ చలనచిత్ర పురస్కారాల ప్రదానోత్సవంలో ఆయనకు ఈ పురస్కారాన్ని అందిస్తారు.

భారతీయ సినిమాకు మోహన్‌లాల్ చేసిన అసాధారణ కృషికి గుర్తింపుగా ఆయనకు ఈ పురస్కారాన్ని ప్రకటించడం పట్ల కేంద్ర సమాచార-ప్రసారరైల్వేలుఎలక్ట్రానిక్స్-సమాచార సాంకేతిక శాఖల మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్ హర్షం వ్యక్తం చేశారు.

మోహన్‌లాల్ అద్భుత సినీ ప్రయాణం తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటుందిఆయన అసమాన ప్రతిభబహుముఖ ప్రజ్ఞఅవిశ్రాంత కృషి భారతీయ చలనచిత్ర చరిత్రలో ఒక సువర్ణాధ్యాయం.

శ్రీ మోహన్‌లాల్ గురించి

శ్రీ మోహన్‌లాల్ విశ్వనాథన్ నాయర్.. కేరళలో 1960మే 21వ తేదీన జన్మించారు. నటుడుగానిర్మాతగానేపథ్య గాయకుడుగా- మలయాళ సినిమాల్లో పేరు తెచ్చుకున్నారు. పరిపూర్ణమైన నటుడుగా ఆయన్ను అభివర్ణిస్తారుదాదాపు అయిదు దశాబ్దాల తన కెరీర్‌లో 360కి పైగా చిత్రాల్లో నటించారుకిరీడంభారతంవానప్రస్థందృశ్యం వంటి అనేక చిత్రాల్లో తన అద్భుతమైన నటనతో అందరినీ ఆకట్టుకున్నారు.

మోహన్‌లాల్ అయిదు జాతీయ చలనచిత్ర పురస్కారాలుపలుసార్లు కేరళ రాష్ట్ర చలనచిత్ర పురస్కారాలనూ అందుకున్నారుదేశవిదేశాల్లో అనేక గౌరవాలతో పాటు కేన్స్ చలనచిత్రోత్సవంలో శ్రీ మోహన్ లాల్ నటించిన ‘‘వానప్రస్థం’’ (1991) చిత్రాన్ని ప్రదర్శించారుఇది ఆయనకు అంతర్జాతీయ గుర్తింపును తెచ్చిపెట్టింది.

సినిమా రంగం కాకుండా.. ఆయన 2009లో ఇండియన్ టెరిటోరియల్ ఆర్మీలో గౌరవ లెఫ్టినెంట్ కల్నల్‌గా నియమితులయ్యారుఆయనను భారత ప్రభుత్వం 2001లో పద్మశ్రీ, 2019లో పద్మభూషణ్‌ పురస్కారంతో సత్కరించిందిబహుముఖ ప్రజ్ఞవినయంతోపాటు ప్రపంచ సినిమా కోసం చేసిన నిరంతర కృషితో మోహన్‌లాల్.. భారత సాంస్కృతిక గౌరవానికి ప్రతీకగా నిలిచే ప్రముఖుల్లో ఒకరిగా స్థానం సంపాదించుకున్నారు.

దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం గురించి

1913లో భారత మొదటి పూర్తి నిడివి చలనచిత్రం రాజా హరిశ్చంద్రకు దర్శకత్వం వహించిన దాదాసాహెబ్ ఫాల్కే భారతీయ సినీ రంగానికి చేసిన కృషికి గుర్తింపుగా భారత ప్రభుత్వం ఆయన పేరుతో పురస్కారాన్ని ప్రవేశపెట్టిందితొలిసారిగా 1969లో దేవికా రాణికి దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని భారత ప్రభుత్వం ప్రకటించిందిసినిమా రంగంలో అత్యున్నతమైన ఈ పురస్కారానికి అర్హులను 'భారతీయ సినీరంగ వృద్ధిఅభివృద్ధి కోసం చేసిన విశిష్ట కృషిధారంగా ఎంపిక చేస్తారుఈ పురస్కార గ్రహీతలకు స్వర్ణ కమల పతకంఒక శాలువారూ. 10 లక్షల నగదు బహుమతిని అందజేస్తారు.

దాదాసాహెబ్ ఫాల్కే పురస్కార గ్రహీతల ఎంపిక కమిటీ సభ్యులు:

1.     శ్రీ మిథున్ చక్రవర్తి

2.    శ్రీ శంకర్ మహదేవన్

3.    శ్రీ అశుతోష్ గోవారికర్

 

***


(Release ID: 2169290) Visitor Counter : 3