మత్స్య పరిశ్రమ, పశు పోషణ మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ప్రపంచస్థాయి బ్లూ పోర్టుల నిర్మాణానికి భారత్ అండ్ ఎఫ్ఏఓ ఒప్పందం; సామర్థ్యం పెంపుదలపై మొదటి వెబినార్


"ఏఐ, 5జీ వంటి స్మార్ట్ టెక్నాలజీలు ఫిషింగ్ పోర్టులను మారుస్తాయి": డాక్టర్ అభిలక్ష్ లిఖి

గుజరాత్, డామన్ అండ్ డయ్యూ, పుదుచ్చేరిల్లో

రూ.369కి పైగా కోట్లతో స్మార్ట్, ఇంటిగ్రేటెడ్ ఫిషింగ్ హార్బర్ల అభివృద్ధి

Posted On: 18 SEP 2025 3:18PM by PIB Hyderabad

మత్స్యపశుసంవర్ధకపాడిపరిశ్రమల మంత్రిత్వ శాఖ(ఎంఎఫ్ఏహెచ్ డీపరిధిలోని మత్స్య శాఖ(డీఓఎఫ్భారత్ లో బ్లూ పోర్ట్ మౌలిక సదుపాయాలను బలోపేతం చేసేందుకు ఐక్యరాజ్యసమితి ఆహారవ్యవసాయ సంస్థ (ఎఫ్ఏఓ)తో సాంకేతిక సహకార కార్యక్రమం (టీసీపీఒప్పందంపై సంతకం చేసిందిసామర్థాన్ని పెంపొందించుకోవటానికిప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉత్తమ పద్ధతులను పంచుకోవటానికి మూడు వెబినార్లువర్క్ షాపుల నిర్వహణలో భాగంగాఎఫ్ఏఓ కింద టీసీపీ కార్యక్రమం మొదటి వెబినార్ ఇవాళ నిర్వహించారువెబినార్ సందర్భంగా “బ్లూ పోర్టులకు పునాదులుమత్స్యకార పోర్టుల్లో ఆర్థిక విలువ పెంపుఅనే అంశంపై మత్స్యకార కార్యదర్శి డాక్టర్ అభిలక్ష్ లిఖి ప్రసంగించారుఈ కార్యక్రమంలో భారత ఎఫ్ఏఓ ప్రతినిధి శ్రీ తకయుకి హగివారా కూడా పాల్గొన్నారు.

 

ఫిషింగ్ పోర్టులు కేవలం మౌలిక సదుపాయాలు మాత్రమే కాదనిఆర్థిక శ్రేయస్సుకుపర్యావరణ సుస్థిరతకుసామాజిక సమైక్యతకు వ్యూహాత్మక పరిష్కారాలని డాక్టర్ అభిలక్ష్ లిఖి స్పష్టం చేశారుజాతీయఆహార పోషకాహార భద్రతను బలోపేతం చేయటానికి పర్యావరణహితమైనలాభదాయకమైనసామాజికంగా సమ్మిళితమైన మత్స్య వ్యవస్థలను అభివృద్ధి చేయాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని ఆయన పునరుద్ఘాటించారుఫిషింగ్ పోర్టుల సామర్థ్యంసేవల నాణ్యత మెరుగుదలకు ఆధునిక సాంకేతికతలు 5జీకృత్రిమ మేధస్సుఆటోమేషన్డిజిటల్ వేదికలు ఉపయోగపడతాయన్నారుపోర్టు కార్యకలాపాల్లో వాతావరణ మార్పులను తట్టుకునే సామర్థ్యంఅన్వేషణశక్తి పరివర్తన వంటి సవాళ్లను ఎదుర్కొనేందుకు ప్రభుత్వప్రైవేటు భాగస్వాముల మధ్య సహకార ప్రయత్నాలు అవసరమని పిలుపునిచ్చిన ఆయన.. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన (పీఎంఎంఎస్ వై), మత్స్య మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధి (ఎఫ్ఐడీఎఫ్వంటి పథకాలు ఆధునీకరణవాటాదారుల సాధికారతకు దోహదపడుతున్నాయని స్పష్టం చేశారుపీఎంఎంఎస్ వై కింద గుజరాత్డామన్ అండ్ డయ్యూపుదుచ్చేరిల్లో మొత్తం రూ.369.80 కోట్లతో మూడు స్మార్ట్ఇంటిగ్రేటెడ్ ఫిషింగ్ హార్బర్లను అభివృద్ధి చేస్తున్నామనివనక్ బరా (డయ్యూ), జఖౌ (గుజరాత్పోర్టుల్లో వ్యూహాత్మక ఆధునీకరణకు మద్దతిస్తున్న ఎఫ్ఏఓ సహకారాన్ని స్వాగతిస్తున్నట్లు డాక్టర్ అభిలక్ష్ లిఖి తెలిపారు.

బ్లూ పోర్ట్ సిద్ధాంతంసామర్థ్యం పెంపుదలకుపర్యావరణ ప్రభావం తగ్గించేందుకుసామాజిక ఆర్థిక ప్రయోజనాలను సృష్టించటానికి సుస్థిరమైనసమ్మిళితమైనవినూత్న పద్ధతులను ప్రోత్సహించటంలో బ్లూ పోర్టుల పాత్ర గురించి ఎఫ్ఏఓ అధికారులు మిస్టర్ జోస్ ఎస్టోర్స్మిస్ యోలండా మొలారెస్మిస్ లూసియా లోపెజ్ డి అరగాన్ వెబినార్ లో వివరించారుపోర్టులను సుస్థిరత వైపు మళ్లించటానికి రోడ్ మ్యాప్వాటాదారుల మధ్య బలమైన సహకారాన్ని పెంపొందించటంవిజయవంతంగా అమలైన విగో పోర్ట్ (స్పెయిన్పై కేస్ స్టడీభారత్ లో బ్లూ పోర్ట్స్ విధానాన్ని అనుసరించేందుకు ఎదురయ్యే ప్రధాన సవాళ్లువాటిని అధిగమించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఈ సెషన్ లో చర్చలు జరిగాయిప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉత్తమ పద్ధతులను పంచుకోవటానికివాటాదారుల మధ్య సహకారాన్ని పెంపొందించటానికి ముఖ్యమైన వేదికగా ఈ వెబినార్ ఉపయోగపడిందిఈ కార్యక్రమంలో జరిగిన చర్చలు భారత్ లో బ్లూపోర్ట్స్ అభివృద్ధి చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలకు సహకరిస్తాయనిదీని ద్వారా జీవనోపాధిని బలోపేతం చేయటంఎగుమతులను ప్రోత్సహించటంమత్స్యరంగం పోటీతత్వాన్ని పెంచటం వంటి లక్ష్యాలను చేరుకోవచ్చని ఆశిస్తున్నారుఈ కార్యక్రమంలో ఎఫ్ఏఓ ప్రధాన కార్యాలయ సీనియర్ అధికారులువిగో పోర్ట్ (స్పెయిన్ప్రతినిధులుతీరప్రాంత రాష్ట్రాలుకేంద్రపాలిత ప్రాంత ప్రభుత్వాల సీనియర్ అధికారులుమారిటైమ్ బోర్డులుప్రధాన పోర్టుల అధికారులుమత్స్య సహకార సంఘాలుఇతర కీలక వాటాదారులు పాల్గొన్నారు.

ఎఫ్ఏఓ సాంకేతిక సహకార కార్యక్రమం (టీసీపీగురించి:

మత్స్యశాఖ ఉత్పత్తుల సరఫరా శ్రేణిని ప్రభావితం చేసే పర్యావరణసామాజికఆర్థిక సవాళ్లను పరిష్కరించటానికిమత్స్యకార పోర్టుల సాంకేతిక సామర్థ్యాలను బలోపేతం చేయటంలో భారత ప్రభుత్వానికి సహకరించేందుకుబ్లూ పోర్టులపై దృష్టి సారించటం ఎఫ్ఏఓ సాంకేతిక సహకార కార్యక్రమం(టీపీసీఉద్దేశంటీపీసీ కింద రెండు పైలట్ ఫిషింగ్ పోర్టులు వనక్ బరా (డయ్యూ), గుజరాత్ లోని జఖౌకు అవసరమైన వ్యూహాత్మకకార్యకలాపాల సాధనాలను అందించిపెట్టుబడి ప్రాజెక్టులను గుర్తించి రూపకల్పన చేసుకునే అవకాశం కల్పించటం ద్వారా ప్రధాన సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చుఅంతేకాకమత్స్యకార పోర్టుల సుస్థిరతకు సంబంధించిన సవాళ్లనుపరిష్కార మార్గాలను అర్థం చేసుకోవటానికి ప్రభుత్వప్రైవేటు వాటాదారులకు అభివృద్ధి శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.

బ్లూ పోర్ట్స్ ఫ్రేమ్ వర్క్:

బ్లూ పోర్ట్స్ విధానం కింద సాంకేతిక ఆవిష్కరణలను పర్యావరణ పరిరక్షణతో కలిపి స్మార్ట్ఇంటిగ్రేటెడ్ ఫిషింగ్ హార్బర్ల అభివృద్ధిని డీఓఎఫ్ నడిపిస్తుందిమూడు పైలట్ హార్బర్లు వనక్ బరా (డయ్యూ), కారైకల్ (పుదుచ్చేరి), జఖౌ (గుజరాత్)కు రూ.369.8 కోట్ల పెట్టుబడితో ఆమోదం లభించిందిభారత మత్స్యకారులకు సురక్షితమైనపరిశుభ్రమైనసమర్థవంతమైన కార్యకలాపాల కోసం మత్స్యకార పరిశ్రమల మౌలిక సదుపాయాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకురావటమే ఈ ఆధునిక హార్బర్ల లక్ష్యంపీఎంఎంఎస్ వై మద్దతుతోఐఓటీ పరికరాలుసెన్సార్ వ్యవస్థశాటిలైట్ కమ్యూనికేషన్డేటా అనలిటిక్స్ వంటి ఆధునిక సాంకేతికతలను అనుసంధానించటం ద్వారా హార్బర్ కార్యకలాపాలను సులభతరం చేయటంతో పాటుతక్షణ నిర్ణయాలు తీసుకోవటానికి ఈ కార్యక్రమం వీలు కల్పిస్తుందివర్షపు నీటిని సేకరించటంతక్కువ విద్యుత్ వినియోగ లైటింగ్విద్యుత్ ఆధారిత యంత్రాలువ్యర్థాల నిర్వహణమురుగునీటి శుద్ధి ప్లాంట్లుసముద్ర వ్యర్థాల తొలగింపు వంటివి సుస్థిరత పట్ల నిబద్ధతను తెలియజేసే పర్యావరణహిత చర్యలు ఆర్థిక పనితీరునుసామాజిక సమ్మిళితత్వాన్నిపర్యావరణ వ్యవస్థల రక్షణను మెరుగుపరుస్తాయి.

 

***


(Release ID: 2168781) Visitor Counter : 10