సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

మన్ కీ బాత్ కార్యక్రమం.. ప్రజల గొంతుక: డాక్టర్ సచ్చిదానంద్ జోషి


వ్యవస్థాపక దినోత్సవాన్ని నిర్వహించిన ఐజీఎన్ సీఏ సంరక్షణ, సాంస్కృతిక ఆర్కైవ్స్ విభాగం

Posted On: 17 SEP 2025 9:23PM by PIB Hyderabad

భారత ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఇందిరాగాంధీ జాతీయ కళా కేంద్రం (ఐజీఎన్ సీఏసంరక్షణసాంస్కృతిక ఆర్కైవ్స్ విభాగం వ్యవస్థాపక దినోత్సవాన్ని 17 సెప్టెంబర్ 2025, విశ్వకర్మ జయంతి సందర్భంగా నిర్వహించారుఈ వేడుకలకు ముఖ్య అతిధిగా ఐజీఎన్ సీఏ సభ్య కార్యదర్శి డాక్టర్ సచ్చిదానంద్ జోషిగౌరవ అతిథిగా సీనియర్ ఐపీఎస్ అధికారి శ్రీ అజయ్ భట్నాగర్ఉద్యోగులువిద్యార్థులుఇతరులు హాజరయ్యారుమరో కార్యక్రమంలో ఐజీఎన్ సీఏలో 'మన్ కీ బాత్చిత్రకళా ప్రదర్శనలో భాగంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రముఖ రేడియో కార్యక్రమం 'మన్ కీ బాత్ఆధారంగా రచించిన 'ఇగ్నైటింగ్ కలెక్టివ్ గుడ్ నెస్పుస్తకంపై చర్చా కార్యక్రమం జరిగింది.

 

'మన్ కీ బాత్కార్యక్రమం ప్రపంచంలోనే ప్రత్యేకమైనదిదీనిద్వారా ప్రధానమంత్రి నేరుగా దేశ ప్రజలతో మమేకం అవుతారుపౌరులను ప్రేరేపించిసామాజిక భాగస్వామ్యాన్ని పెంపొందిస్తారు.” అని డాక్టర్ జోషి వ్యాఖ్యానించారుఈ కార్యక్రమం మొదటి 100 ఎపిసోడ్లను 100 కోట్లకు పైగా ప్రజలు విన్నారనిప్రజలంతా ఒకచోట చేరి ఈ కార్యక్రమాన్ని వినటం ద్వారా సామాజిక స్ఫూర్తి పెరిగిందని తెలిపారుప్రధానమంత్రి గాంధేయ స్పూర్తిని ప్రతిబింబిస్తూ పిల్లలు కూడా పరిశుభ్రత గురించి ఇతరులకు నేర్పిస్తున్నారని ఆయన అన్నారు.

 

మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా ప్రధానమంత్రి శ్రీ మోదీ నేరుగా ప్రజలతో మమేకమవుతున్నారనిచాలా సులభంగా అందరికీ అందుబాటులో ఉండే రేడియో మాధ్యమాన్ని ఎంచుకున్నారని డాక్టర్ జోషి అన్నారుఈ కార్యక్రమం కేవలం ఒకవైపు నుంచే సాగే సంభాషణ మాత్రమే కాదనిదేశవ్యాప్తంగా ప్రజల క్రియాశీల భాగస్వామ్యంతో కూడిన కథనాలతోప్రజల గొంతుకగా నిలుస్తుందని పేర్కొన్నారు. 2014లో విజయదశమి రోజున ఈ కార్యక్రమం ప్రారంభం కాగాఇప్పటివరకు 100కు పైగా ఎపిసోడ్లు ప్రసారమయ్యాయిరేడియో శ్రవణ మాధ్యమం కావటం వల్ల ఒక ప్రత్యేకమైన ప్రభావాన్ని చూపిస్తుందిప్రతి ఎపిసోడ్ లో ప్రత్యేక సంఘటనలువిజయాల గురించి ప్రస్తావిస్తూ ఎందరికో స్ఫూర్తినిస్తుందని డాక్టర్ జోషి అన్నారుఈ కార్యక్రమం ప్రభావంతో స్వచ్ఛతకు ప్రాముఖ్యత ఏర్పడిందిప్రధానమంత్రి గాంధేయ స్ఫూర్తిని ప్రతిబింబిస్తూచిన్నపిల్లలు కూడా కుటుంబసభ్యులుఇతరులకు పరిశుభ్రత ఆవశ్యకతను తెలియజేస్తున్నారు. 'ఇగ్నైటింగ్ కలెక్టివ్ గుడ్ నెస్పుస్తకంపై చర్చలోప్రధానమంత్రి ప్రసంగాల అయిదు సంపుటాల గురించి ఆర్ట్స్ సెంటర్ డైరెక్టర్ (అడ్మినిస్ట్రేషన్డాక్టర్ ప్రియాంక మిశ్రా మాట్లాడారుఈ సంకలనాల కూర్పులో డాక్టర్ జోషి కీలక పాత్ర పోషించారని వెల్లడించారు.

 

సంరక్షణ విభాగం 150 మందికి పైగా సంరక్షకులతో ఒక శక్తిగా ఎదిగిందని వ్యవస్థాపక దినోత్సవ వేడుకల సందర్భంగా ఐజీఎన్ సీఏ సభ్య కార్యదర్శి డాక్టర్ సచ్చిదానంద్ జోషి అన్నారులద్దాఖ్ నుంచి వార్ధా వరకు ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్లిందనివాటిల్లో మహాత్మ గాంధీ గ్రామీణ పరిశ్రమల సంస్థభారత్ మండపంలో ప్రపంచంలోనే అతిపెద్ద నటరాజ విగ్రహ స్థాపన ఉన్నాయని చెప్పారులద్దాఖ్ వంటి ప్రాంతాల్లో మహిళా బృందాలతో ఈ విభాగం చేపట్టిన కార్యక్రమాలు సంస్థ స్థాయినిఅన్ని వర్గాల ప్రజల భాగస్వామ్యాన్ని పెంచాయిసాయుధ దళాల వలే అహర్నిశలు పనిచేస్తున్న ఈ బృందం.. అంకితభావంనిబద్ధతకు కొత్త ప్రమాణాలను నెలకొల్పిందని అన్నారుజ్ఞాన భారతం సదస్సును గుర్తు చేసుకుంటూ, "వారసత్వాన్ని కాపాడేందుకు సంరక్షకులు చేసిన కృషిని ప్రధానమంత్రి అభినందించారుఈ గొప్ప వృత్తిని స్వీకరించాలని యువతను ప్రోత్సహించారుఅని డాక్టర్ జోషి అన్నారుఈ విభాగం జాతీయంగాఅంతర్జాతీయంగా గుర్తింపు పొందిందనిదీని నిరంతర కృషి భావితరాలకు ప్రయోజనకరమని స్పష్టం చేశారుభారతదేశ సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించటంలో విశేష కృషి చేస్తున్న ప్రొఫెసర్ అచల్ పాండ్యఆయన బృందానికినైపుణ్యం కలిగిన సంరక్షకులుగా సంసిద్ధవుతున్న విద్యార్థులకు ఆయన అభినందనలు తెలిపారు.

 

సంరక్షణ, సాంస్కృతిక ఆర్కైవ్స్ విభాగ అసాధారణ ప్రయాణంజాతీయఅంతర్జాతీయ స్థాయిలో దానికి పెరుగుతున్న ఆదరణ గురించి విభాగాధిపతి ఫ్రొఫెసర్ అచల్ పాండ్య వివరించారుఓర్చావడోదరలాల్ బాగ్(ఇండోర్), పాట్నా మ్యూజియంఆల్బర్ట్ హాల్ మ్యూజియం (జైపూర్), భరత్ పూర్లద్ధాఖ్భారత సర్వోన్నత న్యాయస్థానం వంటి ప్రాంతాల్లో చేపట్టిన సాంస్కృతిక వారసత్వ సంపద పరిరక్షణ ప్రాజెక్టుల ద్వారా సంరక్షణ ప్రాముఖ్యతను ఈ విభాగం స్పష్టం చేసిందని ఆయన అన్నారు. 150 మందికి పైగా సంరక్షకులున్న ఈ విభాగంపరిరక్షణతోపాటు సామర్థ్య నిర్మాణంపై దృష్టి పెడుతుందని లద్దాఖ్ లోని మహిళల బృందం స్పష్టం చేస్తోందిభారత్ మండపంలో ప్రపంచంలోనే అతిపెద్ద నటరాజ విగ్రహ ఏర్పాటు వంటి కీలక ప్రాజెక్టులో ఈ విభాగం పాత్రను గుర్తించిన ప్రొఫెసర్ పాండ్యభారత సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించటంలో సంరక్షణ పాత్రను తెలియజేస్తూబృందం ప్రదర్శించిన అంకితభావంక్రమశిక్షణఅద్భుతమైన సామర్థాన్ని ఆయన ప్రశంసించారు.

 

భారతదేశ సాంస్కృతిక సంపదను పరిరక్షించటంలో ఈ విభాగం చేస్తున్న నిరంతర కృషిని శ్రీ అజయ్ భట్నాగర్ అభినందించారుసంరక్షణపై అవగాహనా ప్రాముఖ్యతను స్పష్టం చేశారుఈ వేడుకలకు సాంస్కృతిక శోభను జోడిస్తూజపనీస్ పూల అలంకరణ కళ ఇకేబానా ప్రదర్శనను కువాహార సెంకే పాఠశాలకు చెందిన మాస్టర్ తకాహా అసోనుమా బృందంతో కలిసి ప్రదర్శించారుఇది ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది.

ప్రొఫెసర్ అచల్ పాండ్య బృందంనైపుణ్యం గల సంరక్షకులుగా సిద్ధమవుతున్న విద్యార్థులకు అభినందనలు తెలుపుతూదేశపు అమూల్యమైన సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించటంలో వారు చేస్తున్న నిరంతర కృషిని కొనియాడారు.

 

***


(Release ID: 2168264)
Read this release in: Hindi , Urdu , English