ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

స్వచ్ఛతను ప్రోత్సహించడానికీ, పరిష్కారం కాకుండా మిగిలి ఉన్న వ్యవహారాలను చక్కబెట్టడానికీ 2025 అక్టోబరు 2 నుంచి 31 వరకు ఆరోగ్య పరిశోధన విభాగం (డీహెచ్‌ఆర్) ఆధ్వర్యంలో ‘స్పెషల్ క్యాంపెయిన్‌ 5.0’


డీహెచ్‌ఆర్, ఐసీఎంఆర్ ప్రధాన కేంద్రంతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ఐసీఎంఆర్ 27 సంస్థల్లో ఈ ప్రచార ఉద్యమం
ఎలక్ట్రానిక్ వ్యర్థాల ఏరివేత, కార్యాలయాల్లో స్వచ్ఛత పరిరక్షణతో పాటు రికార్డుల సక్రమ నిర్వహణ

Posted On: 16 SEP 2025 12:27PM by PIB Hyderabad

ఆరోగ్య పరిశోధన విభాగం (డీహెచ్‌ఆర్స్వచ్ఛత విషయంలో తన నిబద్ధతను పునరుద్ఘాటిస్తోంది.. డీహెచ్‌ఆర్ తన స్వచ్ఛత పద్దతులకు సంస్థాగత రూపునివ్వడానికీఐసీఎంఆర్ ప్రధాన కేంద్రంతో పాటు దేశమంతటా ఉన్న 27 సంస్థల్లోనూ పరిష్కారం కాకుండా మిగిలిపోయిన వ్యవహారాలను చక్కబెట్టడానికీ ఒక ‘స్పెషల్ క్యాంపెయిన్‌ 5.0’ను నిర్వహించనుంది.

 

డిపార్ట్‌మెంటు ఈ సంవత్సర ప్రచార ఉద్యమంలో ప్రధానంగా ఎలక్ట్రానిక్ వ్యర్థాల (-వేస్ట్)ను తొలగించడంపై శ్రద్ధ తీసుకొంటూ సన్నాహక దశలోనూఅమలు దశలోనూ అవసరమైన చర్యలను చేపడుతుందిక్యాంపెయిన్ అమలు దశలోఅంటే వచ్చేనెల (అక్టోబరు) 2 మొదలు 31 తేదీ మధ్య కాలంలో ఈ-వేస్ట్‌ను గుర్తించితొలగించాలంటూ ఆదేశాలను ఇప్పటికే జారీ చేశారు.

ఆరోగ్య పరిశోధన విభాగం ఐసీఎంఆర్‌దేశం నలుమూలలా విస్తరించిన దాని 27 సంస్థల సహకారంతో కార్యాలయాలలో సమగ్ర స్వచ్ఛతను మెరుగుపరిచే దిశగా శ్రద్ధ తీసుకొంటుందిపీఎంఓలోనుఎంపీలకు సంబంధించి కొలిక్కిరాకుండా ఉన్న వ్యవహారాలను పరిష్కరించడంతో పాటు రికార్డుల నిర్వహణ వ్యవస్థలను పటిష్ఠపరడంపై దృష్టిపెడుతుందిడిపార్ట్‌మెంటు ఈ  విషయంలో ఒక ఆఫీస్ మెమొరాండాన్ని నిన్న (ఈ నెల 15జారీ చేసింది.

ప్రత్యేక ప్రచార ఉద్యమం-5.0’లో భాగంగాసన్నాహక దశలో గుర్తించిన లక్ష్యాలను సాధించడానికి ముమ్మర ప్రయత్నాలు చేస్తారుఆరోగ్య పరిశోధన విభాగానికి సంబంధించిన అన్ని కార్యాలయాల్లో పూర్తి స్వచ్ఛతను సాధించే దిశగా కృషి చేస్తారుప్రచార ఉద్యమ ప్రగతిని నోడల్ అధికారి పర్యవేక్షిస్తుంటారు.‌

 

***


(Release ID: 2167382) Visitor Counter : 2