గనుల మంత్రిత్వ శాఖ
జాతీయ కీలక ఖనిజ మిషన్ కింద సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ పై సదస్సును నిర్వహించనున్న గనుల మంత్రిత్వ శాఖ
Posted On:
15 SEP 2025 4:43PM by PIB Hyderabad
భారత ప్రభుత్వ జాతీయ కీలక ఖనిజ మిషన్ (నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ - ఎన్సీఎంఎం) కింద సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈ) పై కేంద్ర గనుల మంత్రిత్వ శాఖ 16 సెప్టెంబర్ 2025న హైదరాబాద్ లో సదస్సును నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో కీలకమైన ఖనిజ బ్లాకుల వేలం ఆరో విడత ప్రారంభోత్సవం కూడా జరుగుతుంది.
కీలకమైన ఖనిజాలలో పరిశోధన, అభివృద్ధి, ఆవిష్కరణలను వేగవంతం చేయడానికి, భారతదేశ ఇంధనం, సాంకేతికత, వ్యూహాత్మక రంగాలను బలోపేతం చేయడానికి ప్రభుత్వం చేపట్టిన ఈ సదస్సు ప్రముఖంగా వివరిస్తుంది. ఇది స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక, బలమైన భాగస్వామ్యాలు, మొత్తం ప్రభుత్వ విధానం ద్వారా ఎన్సీఎంఎం కు పునాది వేస్తుంది.
కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తారు. స్వావలంబనను పెంపొందించడం, పెట్టుబడులను ప్రోత్సహించడం, కీలకమైన ఖనిజాలలో సాంకేతికతను అభివృద్ధి చేయడం కోసం ఈ సదస్సులో కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తారు.
కీలకమైన ఖనిజాల రంగంలో పరిశోధన, అభివృద్ధిని ముందుకు తీసుకెళ్ళే సమగ్ర ప్రణాళికను రూపొందించడానికి పరిశ్రమ, ఆర్ అండ్ డి, విద్యాసంస్థలతో కలిసి గుర్తింపు పొందిన సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ (హబ్స్) ను ఈ సదస్సు ఒకే వేదికపైకి తెస్తుంది.
భారత్ ను కీలక ఖనిజాల శుద్ధికి ప్రధాన కేంద్రంగా మార్చడంపై గనుల మంత్రిత్వ శాఖ-సీఈఈడబ్ల్యూ నివేదికను ఈ సదస్సులో విడుదల చేస్తుంది. భారతదేశ వ్యూహాత్మక ఖనిజ లక్ష్యాలకు అనుగుణంగా దేశీయ మైనింగ్, సరఫరా వ్యవస్థలను బలోపేతం చేయడానికి ప్రభుత్వ నిబద్ధతకు ప్రతీకగా ఎన్సీఎంఎం కింద గుర్తింపు పొందిన సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ కు అవార్డులు కూడా ప్రదానం చేస్తారు.
***
(Release ID: 2166998)
Visitor Counter : 2