గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పరిశుభ్రతకు ప్రోత్సాహం.. పెండింగ్‌ అంశాల పరిష్కారం దిశగా గ్రామీణాభివృద్ధి విభాగం ‘ప్రత్యేక ప్రక్షాళన కార్యక్రమం 5.0’


పరిశుభ్రత సంస్థాగతీకరణకు మరింత ఉత్తేజం... పెండింగ్‌ అంశాల తగ్గింపు దిశగా అక్టోబరు 2 నుంచి 31 దాకా వివిధ కార్యకలాపాల నిర్వహణకు ప్రణాళిక సిద్ధం

Posted On: 15 SEP 2025 1:02PM by PIB Hyderabad

దేశవ్యాప్తంగా పరిశుభ్రతకు మరింత ప్రోత్సాహం, పెండింగ్‌ అంశాల పరిష్కారం దిశగా కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ పరిధిలోని గ్రామీణాభివృద్ధి విభాగం ‘ప్రత్యేక ప్రక్షాళన కార్యక్రమం 5.0’ చేపడుతుంది. దీనిపై పరిపాలన సంస్కరణలు-ప్రజా ఫిర్యాదుల విభాగం (డీఏఆర్‌పీజీ) జారీచేసిన మార్గదర్శకాల మేరకు అక్టోబరు 2 నుంచి 31 వరకూ ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ విభాగం పరిధిలోని స్వతంత్ర సంస్థలు/సంఘాలు కూడా ఇందులో పాలుపంచుకుంటాయి. పరిశుభ్రతను మరింత సంస్థాగతీకరించడంతోపాటు అపరిష్కృత అంశాల సంఖ్య తగ్గించడం దీని లక్ష్యం.

గ్రామీణాభివృద్ధి శాఖ గత సంవత్సరం (2024 అక్టోబరు 2 నుంచి 31 దాకా) చేపట్టిన ‘ప్రత్యేక ప్రక్షాళన కార్యక్రమం 4.0’ కింద వివిధ కార్యకలాపాలను నిర్వహించింది. ముఖ్యంగా సమస్యల పరిష్కారంపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. తదనుగుణంగా ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ), ఎంపీల, రాష్ట్రాలు సూచించినవి సహా ప్రజా ఫిర్యాదులు-అప్పీళ్లు, అంతర-మంత్రిత్వ కమిటీ (ఐఎంసీ) నివేదించిన అంశాలపై ప్రధానంగా శ్రద్ధ పెట్టింది. ఈ కార్యక్రమం ముగిసే సమయానికి ‘పీఎంఓ’, రాష్ట్రాల, ‘ఐఎంసీ’ సంబంధిత సూచనలతోపాటు ప్రజా ఫిర్యాదుల అప్పీళ్లను 100 శాతం పరిష్కరించింది. అయితే, ఎంపీల సూచనల్లో 96 శాతం, ప్రజా ఫిర్యాదులలో 93 శాతం వంతున మాత్రమే పరిష్కరించగలిగింది. ఈ సందర్భంగా కార్యాలయాల్లో చెత్తాచెదారం తొలగింపు, సార్వత్రిక ప్రదేశాల శుభ్రతతోపాటు కార్యాలయ గదుల నిర్వహణను గ్రామీణాభివృద్ధి విభాగం సరిదిద్దింది. ఈ కార్యక్రమం సాధించిన విజయాలను  ‘డీఏఆర్‌పీజీ’ పరిధిలోని ‘ఎస్‌సీడీపీఎం’ పోర్టల్‌లో అప్‌లోడ్ చేసింది. అలాగే కార్యక్రమంపై అవగాహన పెంపు దిశగా దీనికింద చేపట్టిన కార్యకలాపాలను సామాజిక మాధ్యమాల్లో ఎప్పటికప్పుడు అధికారులు పోస్ట్ చేశారు.

అయితే, ‘ప్రత్యేక ప్రక్షాళన కార్యక్రమం 4.0’కు నిర్దేశించిన వ్యవధి తర్వాత కూడా దాని  కార్యకలాపాలను 2024 నవంబరు నుంచి 2025 ఆగస్టు వరకూ కొనసాగించడం గమనార్హం. ఈ కొనసాగింపు కాలంలో పరిష్కరించిన వివిధ అంశాల సంబంధిత కీలక విజయాలిలా ఉన్నాయి:

ఎంపీల సూచనలు - 123

పార్లమెంటు హామీలు - 3

‘ఐఎంసీ’ సూచనలు - 48

రాష్ట్రాల సూచనలు - 15

ప్రజా ఫిర్యాదులు - 17,489

‘పీఎంఓ’ సూచనలు - 13

ప్రజా ఫిర్యాదులు-అప్పీళ్లు - 1984

 

***


(Release ID: 2166987) Visitor Counter : 2