కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

నల్సార్ విశ్వవిద్యాలయం, భారత కంపెనీ కార్యదర్శుల సంస్థ (ఐసీఎస్ఐ) సంయుక్త ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో ‘కార్ప్ కాన్- 2025’ జాతీయ సదస్సు


ఈఎస్‌జీ ఏకీకరణ, ఐబీసీ 3.0లను వివరించిన ఐఐసీఏ డీజీ, సీఈవో శ్రీ జ్ఞానేశ్వర్ కుమార్ సింగ్

నాడు పోస్టు చేయడమైనది: 13 SEP 2025 11:24AM by PIB Hyderabad

2025 సెప్టెంబర్ 12న నల్సార్ విశ్వవిద్యాలయంభారత కంపెనీ సెక్రటరీల సంస్థ (ఐసీఎస్ఐసంయుక్తంగా హైదరాబాదులో ఓ జాతీయ సదస్సును నిర్వహించాయిభారత కార్పొరేట్ వ్యవహారాల సంస్థ డైరెక్టర్ జనరల్సీఈవో శ్రీ జ్ఞానేశ్వర్ కుమార్ సింగ్‌ను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు.

సార్క్ లా హాల్‌లో నిర్వహించిన పర్యావరణంసమాజంపరిపాలన (ఈఎస్‌జీఇతివృత్తంతో కార్ప్ కాన్- 2025 ప్రారంభ సదస్సుఅలాగే ఇన్‌సాల్వెన్సీదివాళా చట్టం (ఐబీసీ)పై సదస్సులకు నల్సార్ ఉప కులపతి ఆచార్య శ్రీ కృష్ణదేవరావు అధ్యక్షత వహించారు.

ఈఎస్‌జీని కార్పొరేట్ చట్టంలో అనుసంధానించడంభాగస్వామ్య సిద్ధాంత ఔచిత్యంఐబీసీ మధ్యవర్తిత్వ పాత్రరాబోయే ఐబీసీ 3.0 సవరణలపై శ్రీ జ్ఞానేశ్వర్ కుమార్ సింగ్ తన ప్రసంగంలో వివరించారువాటాదారులందరి మధ్య విశ్వాసాన్నిసమష్టి బాధ్యతను పెంపొందించడం అత్యావశ్యకమని ఆయన స్పష్టం చేశారు.

ప్రముఖులకుప్రతినిధులకు ఆత్మీయ ఆహ్వానంజ్యోతీ ప్రజ్వలనఐసీఎస్ఐ నినాద గీతం ‘సత్యం వర్మం చర’ ఆలాపనతతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.

స్వావలంబనపర్యావరణ సుస్థిరతఈఎస్‌జీ సూత్రాల అన్వయ ప్రాధాన్యాన్ని ఉప కులపతి తన ప్రారంభోపన్యాసంలో వివరించారుఎం.సిమెహతా (1985)టి.ఎన్గోదావర్మన్ వంటి కీలక కేసులను ప్రస్తావించారుఈఎస్‌జీఐబీఎల్ అధ్యయనాలను ముందుకు తీసుకెళ్లడంలో నల్సార్ ఐసీఎస్ఐ సహకారం అత్యావశ్యకమన్నారుఈ సదస్సు నుంచి ఎంపిక చేసిన పత్రాలను ప్రచురించాలని భావిస్తున్నట్టు తెలిపారు.

ఈ సదస్సులో ప్రముఖ వక్తలు ఆలోచనాత్మక ప్రసంగాలు చేశారుస్వాయత్తం చేసుకోవడంవిలీనందివాలాపునర్నిర్మాణం వంటి అంశాల్లో తన అనుభవాలను సీఎస్ పి.ఎస్రావు వివరించారుకార్పొరేట్ వ్యవహారాల్లో ఈఎస్‌జీ తీరుతెన్నులుఆచరణాత్మక సవాళ్లపై విలువైన సమాచారాన్ని వెల్లడించారు.

రోజువారీ జీవితంలో సుస్థిరతఈఎస్‌జీ పాఠ్యాంశాలుసమష్టి భాగస్వామ్యం ఆవశ్యకమని శ్రీ ఇందర్‌జిత్ షా అన్నారుటాటాఇన్ఫోసిస్మహీంద్రా వంటి కంపెనీలు అవలంబిస్తున్న ఉత్తమ పద్ధతులను వివరించారుఈఎస్‌జీని ఓ ఎంపికగా కాకుండా అత్యావశ్యకంగా చూడాలన్న సీఎస్ రంజిత్ పాండే.. సీఎస్ఆర్‌తో పోలిస్తే అది భిన్నమైనదన్నారుసంస్థాగతచట్టపరమైన సహాయక ఏర్పాట్లపై చర్చించారు.

కార్యక్రమ నిర్వాహకులుభాగస్వాములుసహాయకులను ప్రొఫెసర్ పిశ్రీనివాస సుబ్బారావు అభినందించారుజ్ఞాపికలను అందజేయడంధన్యవాదాలతో సదస్సు ముగిసింది


(రిలీజ్ ఐడి: 2166905) సందర్శకుల సూచీ సంఖ్య : : 23
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Tamil