గనుల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

రాంచీలో ఐబీఎమ్ ప్రాంతీయ కార్యాలయాన్ని ప్రారంభించిన కేంద్ర మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి

Posted On: 12 SEP 2025 4:28PM by PIB Hyderabad

రాంచీలో కొత్తగా నిర్మించిన ఇండియా బ్యూరో ఆఫ్ మైన్స్ (ఐబీఎమ్)  ప్రాంతీయ కార్యాలయాన్ని  బొగ్గుగనుల శాఖ కేంద్ర మంత్రి శ్రీ  జికిషన్ రెడ్డి ఈ రోజు ప్రారంభించారు.

ఏక్ పేడ్ మా కే నామ్’ కార్యక్రమంలో భాగంగా ఒక  మొక్కను శ్రీ జికిషన్ రెడ్డి కొత్త భవనం ఆవరణలో నాటిదానికి నీరు పోశారుపర్యావరణ పరిరక్షణ బాధ్యతనూఈ భూమి నాలుగు కాలాల పాటు మనుగడ సాగించడాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనూ ఈ మొక్కల పెంపకం కార్యక్రమాన్ని చేపట్టారుఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రితో పాటు గనుల శాఖ అదనపు కార్యదర్శి శ్రీ సంజయ్ లోహియాఐబీఎమ్ కంట్రోలర్ జనరల్ (స్వతంత్రశ్రీ పంకజ్ కులశ్రేష్ఠ కూడా పాల్గొన్నారు.

ప్రబంధన్ నగర్ముర్మానయాసరాయిఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్రాంచీజార్ఖండ్ - 835303 చిరునామాలో ఏర్పాటు చేసిన ఐబీఎమ్ ప్రాంతీయ కార్యాలయంలో విధులను నిర్వహించే ఉద్యోగులు నియంత్రణ పూర్వక పర్యవేక్షణను పటిష్ఠపరచనున్నారుగనుల తవ్వకానికి సంబంధించిన సమస్యలను పరిష్కరించడంతో పాటు ‘వికసిత్ భారత్’ దృష్టికోణానికి అనుగుణంగా గనుల తవ్వకం రంగంలో మన దేశం అభివృద్ధిని సాధించడానికి వారి వంతు తోడ్పాటును అందించనున్నారుఈ సందర్భంగా కేంద్ర మంత్రి  శ్రీ జికిషన్ రెడ్డి ఉద్యోగులనుశ్రామికులను ఉద్దేశించి ప్రసంగించారు.‌

 

***


(Release ID: 2166169) Visitor Counter : 2
Read this release in: English , Urdu , Hindi