శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
భవిష్యత్తు ఎలక్ట్రానిక్స్‌ను శక్తిమంతం చేయనున్న కొలెస్ట్రాల్
Posted On:
08 SEP 2025 5:41PM by PIB Hyderabad
అదృశ్య రూపంలోని క్వాంటం లక్షణమైన ఎలక్ట్రాన్ల భ్రమణాన్ని నియంత్రించేందుకు కొలెస్ట్రాల్‌ను ఉపయోగించవచ్చు. తర్వాతి తరం స్పింట్రోనిక్ పరికరాల శక్తి సామర్థ్యాన్ని అభివృద్ధి చేయడంలో సహకరిస్తుంది.
సాధారణంగా గుండె జబ్బులకు కారణమయ్యే కొవ్వులాంటి పదార్థమైన కొలెస్ట్రాల్.. సూప్రామాలిక్యులర్ ఆధారిత స్పింట్రోనిక్ పదార్థాలను తయారు చేయడానికి అనువైన వేదికగా పనికొస్తుంది.
ఎందుకంటే దాని అంతర్గత సమీకరణం (అసమరూపత), సరళత కారణంగా అణు లక్షణాలపై ఖచ్చితమైన నియంత్రణను సాధించడం వల్లే ఇది సాధ్యమవుతుంది.
సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగానికి చెందిన స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ- మొహాలీలోని నానో సైన్స్ అండ్ టెక్నాలజీ (ఐఎన్ఎస్‌టీ)కి చెందిన శాస్త్రవేత్తలు... కొలెస్ట్రాల్ ఆధారిత నానో పదార్థాలను పరిచయం చేశారు. ఇవి భవిష్యత్తు తరం క్వాంటం టెక్నాలజీలు, స్పిన్ట్రోనిక్ అప్లికేషన్లకు నూతన వేదికగా ఉపకరిస్తాయి.
భవిష్యత్తు తరం ఎలక్ట్రానిక్స్‌కు కీలకమైన క్వాంటం స్థాయుల్లో ఎలక్ట్రాన్ల భ్రమణాన్ని ఈ పదార్థాలు మార్చగలవు. లోహ అయాన్లను సహజమైన విధాన ప్రక్రియలతో కలపడం, లోహ అయాన్ల రకాన్ని, గాఢతను సర్దుబాటు చేయడం ద్వారా అయస్కాంత శక్తి ఆధారంగా పదార్థం నుంచి ఎలక్ట్రాన్లను ఎంత బాగా వేరు చేయవచ్చో డాక్టర్ అమిత్ కుమార్ మోండల్ నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం చూపించింది.

డాక్టర్ అమిత్ కుమార్ మోండల్ బృందం
వివిధ రకాల లోహ అయాన్లను కొలెస్ట్రాల్‌తో కలపడం ద్వారా ఎంపిక చేసిన ఎలక్ట్రాన్ భ్రమణాలను కలిగిన నానో పదార్థాలను పరిశోధకులు రూపొందించారు. ఆసక్తికరంగా, రెండు భ్రమణ దిశలను ఒకే వ్యవస్థలో నియంత్రించవచ్చు. అంటే సాధారణ రసాయన మార్పు లేదా సమరూప రసాయన ఉద్దీపన ద్వారా శాస్త్రవేత్తలు భ్రమణ సమాచార ప్రవాహాన్ని సర్దుబాటు చేయవచ్చని దీని అర్థం. వాటి ఫలితాలు ఇటీవలే కెమిస్ట్రీ ఆఫ్ మెటీరియల్స్‌లో ప్రచురితమయ్యాయి.
రసాయన లక్షణాలను సర్దుబాటు చేయగల ఈ సామర్థ్యం.. అధిక కచ్చితత్వంతో భ్రమణ సమాచారాన్ని మార్చేందుకు అత్యంత శక్తిమంతమైన ప్రక్రియను అందిస్తుంది. ఇది అధునాతన క్వాంటం, భ్రమణ సాంకేతికతల కోసం బయోమెటీరియల్ అభివృద్ధికి గణనీయంగా దోహదపడుతుంది.
అత్యంత కచ్చితత్వంతో అణువులను వేరు చేయడానికి భ్రమణ ఆధారిత పదార్థాలు సహకరించడం వల్ల హరిత సాంకేతికత, బయో ఎలక్ట్రానిక్ పరికరాల కోసం ఇంధన సామర్థ్యం కలిగిన మొమరీ చిప్‌ల తయారీకి మార్గం ఏర్పాటు చేస్తుంది.
***
(Release ID: 2164917)
Visitor Counter : 2