ఆర్థిక మంత్రిత్వ శాఖ
అన్ని ఖాతాల అనుబంధ విస్తారిత వ్యవస్థ.. భారత ‘డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్’ (డీపీఐ)ని ప్రారంభించి విజయవంతంగా నాలుగేళ్లు పూర్తి
ఆర్థిక సేవా ప్రదాత సంస్థ (ఎఫ్ఐపీ) లుగాను, ఆర్థిక సమాచార వినియోగదారు సంస్థ (ఎఫ్ఐయూ)లు గాను రెండు రకాల సేవలనూ అందిస్తున్న 112 ఆర్థిక సంస్థలు.. ఎఫ్ఐపీలుగా మాత్రమే సేవలందిస్తున్న సంస్థలు 56, కేవలం ఎఫ్ఐయూలుగా సేవలందిస్తున్న సంస్థలు 410
అన్ని ఖాతాల వ్యవస్థ ద్వారా సురక్షిత, అంగీకార ఆధారిత సమాచార పంపిణీకి వీలున్న ఫైనాన్షియల్ అకౌంట్లు 2.2 బిలియన్‌కు పైనే.. వీటిలో ఇప్పటికే తమ ఖాతాలను లింక్ చేసుకున్న వినియోగదారులు 112.34 మిలియన్ మంది
Posted On:
02 SEP 2025 9:14AM by PIB Hyderabad
ఖాతాల ఉమ్మడి వ్యవస్థ (అకౌంట్ అగ్రిగేటర్.. ‘ఏఏ’ ఫ్రేంవర్క్)ను 2021 సెప్టెంబరు 2న అధికారికంగా ప్రారంభించారు. దీంతో ఆర్థిక సమాచారాన్ని పంచుకొనేందుకు ఒక సురక్షిత, అంగీకార ఆధారిత వ్యవస్థను అమల్లోకి తీసుకువచ్చినట్లయింది. ఖాతాలన్నిటికి సంబంధించిన అనుబంధ విస్తారిత వ్యవస్థకు విపుల ఆదేశాలను భారతీయ రిజర్వు బ్యాంకు 2016లో జారీ చేసింది.

యూజర్లు తమ బ్యాంకు ఖాతాలు, పెట్టుబడులు, రుణాలకు సంబంధించిన ఆర్థిక సమాచారాన్నంతటినీ వేర్వేరు మార్గాల్లో నుంచి ఒక చోటుకు తెచ్చుకోవడంతో పాటు ఆ సమాచారాన్ని అప్పులిచ్చే సంస్థలు, వెల్త్ మేనేజర్ సేవలను అందించే సంస్థల దృష్టికి తీసుకువెళ్లి రుణ దరఖాస్తుల దాఖలు లేదా ఇతరత్రా ఆర్థిక సహాయ సంబంధిత ప్రణాళికను సిద్ధం చేయడానికి అకౌంట్ అగ్రిగేటర్ (ఏఏ) ఫ్రేంవర్కు సాయపడుతుంది. ఈ అకౌంట్ అగ్రిగేటర్ర్లు మధ్యవర్తుల పాత్రను పోషిస్తాయి. ఇవి డేటాను గోప్యంగా ఉంచడంతో పాటు ఆ డేటాను అందరికీ అందుబాటులో ఉండని విధంగా ఒక ప్రత్యేక కోడ్ లోకి మార్చి, ముందస్తు అనుమతిని తీసుకొంటేనే గాని ఆ డేటాను పొందడం సాధ్యపడని విధంగా జాగ్రత్త చర్యలను తీసుకొనే అవకాశాన్ని యూజరుకు కల్పిస్తున్నాయి.
భారత్ 2023లో జీ20కి అధ్యక్ష బాధ్యతలను స్వీకరించిన సమయంలో, అకౌంట్ అగ్రిగేటర్ ఫ్రేంవర్కును ఒక మౌలిక డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (డీపీఐ) సేవా వ్యవస్థగా గుర్తింపునిచ్చారు. ఇది డేటాను ఇచ్చి పుచ్చుకొనే మాధ్యమంలా పనిచేస్తూ, గుర్తింపు (ఆధార్), చెల్లింపు (యూపీఐ ఆధారిత) సేవలను అందిస్తోంది. అకౌంట్ అగ్రిగేటర్ ఫ్రేంవర్క్ పాత్ర, ఇది ప్రసరిస్తున్న ప్రభావాన్ని జీ20 కి చెందిన ప్రధాన పత్రాల్లో ప్రస్తావించారు. ఈ పత్రాల్లో ‘‘పాలిసీ రెకమండేషన్స్ ఫర్ అడ్వాన్సింగ్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అండ్ ప్రొడక్టివిటీ గెయిన్స్ త్రూ డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్’’ (2023) ఒకటి. ఏఏ ఫ్రేంవర్క్ ప్రాధాన్యాన్ని ‘‘రిపోర్ట్ ఆఫ్ ఇండియాస్ జీ20 టాస్క్ ఫోర్స్ ఆన్ డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్’’ (2024 జులై) లో కూడా సమగ్రంగా వివరించారు.
ఇది జరిగాక ఈ అనుబంధ విస్తారిత వ్యవస్థ శరవేగంగా విస్తరించింది. దీనిని బ్యాంకింగ్, హామీపత్రాలు (సెక్యూరిటీస్), బీమా, పింఛను రంగాల్లో పెద్ద ఎత్తున ఉపయోగిస్తున్నారు. ఫలితంగా భారత్‌లో డీపీఐ రోజురోజుకూ బలపడుతోంది. ఇప్పటివరకు చూస్తే, 112 ఆర్థిక సహాయ సంస్థలు ఆర్థిక సహాయ సమాచార సేవాప్రదాత సంస్థలు (ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడర్స్.. ఎఫ్ఐపీ) గానే కాకుండా ఆర్థిక సహాయ సమాచార ఉపయోగ సంస్థలు (ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ యూజర్స్.. ఎఫ్ఐయూ) గా కూడా తమ కార్యకలాపాలను చురుగ్గా కొనసాగిస్తున్నాయి. 56 సంస్థలు ఒక్క ఎఫ్ఐపీలుగా మాత్రమే పనిచేస్తున్నాయి. 410 సంస్థలు కేవలం ఎఫ్ఐయూలుగానే పనిచేస్తున్నాయి. అకౌంట్ అగ్రిగేటర్ ఫ్రేంవర్క్ ద్వారా ప్రస్తుతం కట్టుదిట్టమైన, అనుమతి ఆధారిత డేటా షేరింగ్ సదుపాయం కలిగివున్న ఫైనాన్షియల్ అకౌంట్లు ప్రస్తుతం 220 కోట్లకు పైనే ఉన్నాయి. వీటిలో భాగమైన 11 కోట్ల 23 లక్షల 40 వేల యూజర్లు ఇప్పటికే తమ ఖాతాలను లింక్ చేసే ప్రక్రియను ముగించారు. ఇది ఈ పరివర్తన ప్రధాన కార్యక్రమం స్థాయి, దీనిపై విశ్వాసం నానాటికీ పెరుగుతున్నాయని సూచిస్తోంది.
సంఘటిత రంగంలో రుణ లభ్యతకు, ప్రత్యేకించి సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ)తో పాటు వ్యక్తిగత రుణ అవసరాలను తీర్చే లోన్ల లభ్యతలో సరికొత్త అవకాశాలను అందించడానికి ‘ఏఏ’ (అకౌంట్ అగ్రిగేటర్ ) అనుబంధ విస్తారిత వ్యవస్థ సర్వసన్నద్ధంగా ఉంది. మన దేశం 2047 కల్లా ‘వికసిత్ భారత్’ గమ్యాన్ని చేరుకొనే దిశగా సాగిస్తున్న ప్రయాణంలో ఈ ‘ఏఏ’ ఇకోసిస్టమ్ తన వంతుగా ప్రయోజనకర సేవలను అందిస్తోంది.
ఈ అంశంపై మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి ఈ కింది లింకులను సందర్శించగలరు..
Launch & Timeline: RBI Master Directions (2016):
https://www.rbi.org.in/scripts/BS_ViewMasDirections.aspx?id=10598
Ecosystem Reach & Participants: Accounts, FIU and FIP (October 2024):
https://financialservices.gov.in/beta/en/account-aggregator-framework
***
(Release ID: 2163080)
Visitor Counter : 6