గనుల మంత్రిత్వ శాఖ
భారత్- జపాన్ మధ్య ఖనిజ వనరుల సహకార ఒప్పందంపై కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జీ కిషన్ రెడ్డి ప్రకటన
प्रविष्टि तिथि:
29 AUG 2025 7:22PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రస్తుతం జపాన్‌లో ఆ దేశ ప్రధాన మంత్రి షిగేరు ఇషిబాతో కలిసి 15వ భారత్-జపాన్ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొననున్నారు. ఆర్థిక రంగం, ఆరోగ్యం, మొబిలిటీ భాగస్వామ్యం, కృత్రిమ మేధ (ఏఐ), శాస్త్ర సాంకేతిక, కీలక, అరుదైన ఖనిజాలు వంటి బహుళ రంగాలలో సహకారానికి రెండు దేశాల ప్రధానులు అంగీకరించారు.
ఖనిజ వనరుల రంగానికి సంబంధించి జపాన్ ఆర్థిక, వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖతో భారత ఖనిజ శాఖ సహకార ఒప్పందం కుదుర్చుకుంది. కీలక ఖనిజాల సరఫరా వ్యవస్థను ఏర్పాటు చేసుకునేందుకు, విస్తరించేందుకు భారత్ చేస్తున్న నిరంతర ప్రయత్నాల్లో భాగమైన ఈ ఒప్పందం.. దేశ ఇంధన భద్రత, జాతీయ భద్రత, ఆహార భద్రతా లక్ష్యాలను చేరుకోవడంతోపాటు నికర శూన్య ఉద్గార లక్ష్యాలను సాధించడానికి కూడా సహాయపడుతుంది.
సన్నిహిత సహకారం కోసం ఈకింది రంగాలను ఎంపిక చేసుకున్నారు.
. ఖనిజ వనరులపై సమాచార మార్పిడి, విధానాలు, నిబంధనలు, కీలక ఖనిజ ప్రాజెక్టుల ఉమ్మడి అభివృద్ధి, మైనింగ్ వేలం, స్థిరమైన సముద్ర గర్భ మైనింగ్, ఖనిజా వెలికితీత, పరిశీలన, కీలకమైన ఖనిజాల నిల్వ ప్రయత్నాలు మొదలైన అంశాలపై సమాచారాన్నిపంచుకోవడం
. భారత్‌తో సహా వనరులు అధికంగా ఉన్న దేశాలలో కీలక ఖనిజాల కోసం అన్వేషణ, మైనింగ్, ప్రాసెసింగ్‌లో ఉమ్మడి పెట్టుబడులను ప్రోత్సహించడం.
***
(रिलीज़ आईडी: 2162102)
आगंतुक पटल : 23