ప్రధాన మంత్రి కార్యాలయం
మహాత్మ అయ్యంకాళి జయంతి సందర్భంగా నివాళి అర్పించిన ప్రధానమంత్రి
Posted On:
28 AUG 2025 3:45PM by PIB Hyderabad
మహాత్మా అయ్యంకాళిని న్యాయం, సాధికారతకు చిరస్మరణీయ రూపంగా స్మరించుకుంటూ ఆయన జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు. విద్య, సమానత్వం పట్ల మహాత్మ అయ్యంకాళి ప్రదర్శించిన అచంచలమైన నిబద్ధతను శ్రీ మోదీ గుర్తు చేసుకున్నారు. ఆయన అందించిన వారసత్వం సమ్మిళిత అభివృద్ధి దిశగా దేశం సాధిస్తున్న సమష్టి ప్రయాణంలో స్ఫూర్తినిస్తూనే ఉంటుందన్నారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో వేర్వేరు పోస్టుల్లో ప్రధాని ఇలా రాశారు.
‘‘మహాత్మా అయ్యంకాళి జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పిస్తున్నాను. ఆయన సామాజిక న్యాయం, సాధికారతకు ప్రతీకగా ఆయన ఎల్లప్పటికీ గుర్తుండిపోతారు. ఆయనకు విజ్ఞానం, అభ్యాసం అంటే మక్కువ ఎక్కువ. ఆయన చేసిన కృషి న్యాయమైన, సమానత్వం సాధించిన సమాజం దిశగా తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటుంది.’’
(Release ID: 2161537)
Visitor Counter : 15
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam