రైల్వే మంత్రిత్వ శాఖ
గణేష్ ఉత్సవాల సందర్భంగా రికార్డు స్థాయిలో 380 ప్రత్యేక రైళ్లను నడుపుతున్న భారతీయ రైల్వే
జోన్ల వారీగా ప్రత్యేక రైళ్లు: సెంట్రల్ 296, వెస్ట్రన్ 56, కేఆర్సీఎల్ 6, సౌత్ వెస్ట్రన్ 22.
ఆగస్టు 11 నుంచి ప్రారంభమైన గణేశ ఉత్సవాల ప్రత్యేక రైళ్లకు పండుగ సమీపిస్తున్న కొద్దీ మరిన్ని ట్రిప్పుల జోడింపు
Posted On:
21 AUG 2025 8:43PM by PIB Hyderabad
భారతీయ రైల్వే 2025 గణేశ ఉత్సవాల కోసం 380 ప్రత్యేక రైళ్ళను ప్రకటించింది. ఇవి పండుగ సమయంలో భక్తులు, ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తాయి. 2023లో 305, 2024లో 358 గణేశ ఉత్సవాల ప్రత్యేక రైళ్లు నడపగా ఈసారి ఆ సంఖ్యను మరింత పెంచారు.
మహారాష్ట్ర, కొంకణ్ ప్రాంతంలో భారీగా ఉండే పండగ ప్రయాణికుల రద్దీని పరిష్కరించడానికి సెంట్రల్ రైల్వే అత్యధికంగా 296 సర్వీసులను నడపనుంది. పశ్చిమ రైల్వే 56, కొంకణ్ రైల్వే (కేఆర్సీఎల్) 6, సౌత్ వెస్ట్రన్ రైల్వే 22 ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేశాయి.
కొంకణ్ రైల్వే మీదుగా నడిచే గణేశ ఉత్సవాల ప్రత్యేక రైళ్లను కోలాడ్, ఇందాపూర్, మన్గావ్, గోరేగావ్ రోడ్, వీర్, సాపే వార్మ్నే, కరంజాడి, విన్హేర్, దివాంఖావతి, కలంబానీ బుద్రుక్, ఖేడ్, అంజని, చిప్లున్, కమాతే, సవార్దా, అరవలి రోడ్, సంగమేశ్వర్ రోడ్, రత్నగిరి, అడవాలి, విలావడే, రాజాపూర్ రోడ్, వైభవ్వాడి రోడ్, నంద్గావ్ రోడ్, నంద్గావ్ రోడ్, నంద్గావ్ రోడ్, కంకవలి వద్ద నిలిపివేశారు. కార్వార్, గోకామా రోడ్, కుమ్టా, ముర్దేశ్వర్, మూకాంబికా రోడ్, కుందాపుర, ఉడిపి, ముల్కీ, సూరత్కల్ స్టేషన్లలో ఆపుతారు.
గణపతి పూజ ఈనెల 27 నుంచి సెప్టెంబర్ 6 వరకు జరుగుతుంది. అంచనా ప్రకారం పండుగ రద్దీని తీర్చడానికి ప్రత్యేక రైళ్లను ఈనెల 11 నుంచి ప్రారంభించారు. పండుగ సమీపిస్తున్న కొద్దీ వీటి ట్రిప్పులను క్రమంగా పెంచుతున్నారు.
ప్రత్యేక రైళ్ల సవివర షెడ్యూల్ ను ఐఆర్సీటీసీ వెబ్ సైట్, రైల్ వన్ యాప్, కంప్యూటరైజ్డ్ పీఆర్ఎస్ లో అందుబాటులో ఉంచారు.
భారతీయ రైల్వే నిరంతరం, ముఖ్యంగా డిమాండ్ ఎక్కువగా ఉండే పండగ సమయాల్లో ప్రజలకు సురక్షితమైన, నమ్మదగిన, సౌకర్యవంతమైన ప్రయాణ అనుభవాలను అందించడానికి కట్టుబడి ఉంది.
***
(Release ID: 2159599)