ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

పసల కృష్ణ భారతి మరణం పట్ల సంతాపం వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి

Posted On: 23 MAR 2025 11:55PM by PIB Hyderabad


 పసల కృష్ణ భారతి మృతి పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. మహాత్మా గాంధీ సిద్ధాంతాల ద్వారా దేశ నిర్మాణానికి తన జీవితాన్ని అంకితం చేసిన నిబద్ధత కలిగిన గాంధేయవాది ఆమె అని పేర్కొన్నారు.

ఎక్స్ లో ప్రధాన మంత్రి ఇలా పేర్కొన్నారు:

పసల కృష్ణ భారతి జీ మరణం బాధాకరం. మహాత్మా గాంధీ సిద్ధాంతాల ద్వారా దేశ నిర్మాణానికి తన జీవితాన్ని అంకితం చేసిన నిబద్ధత కలిగిన గాంధేయవాది ఆమె. స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న తన తల్లిదండ్రుల వారసత్వాన్ని ఆమె అద్భుతంగా కొనసాగించారు. భీమవరంలో జరిగిన కార్యక్రమంలో ఆమెను కలిసిన సందర్భం గుర్తుకొస్తోంది. ఆమె కుటుంబసభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి. ఓం శాంతి: పీఎం @narendramodi"


(Release ID: 2158929) Visitor Counter : 4