ప్రపంచంలో ఎక్కడైనా అణు భద్రతకు సంబంధించి ఏదైనా పెద్ద సంఘటన జరిగినప్పుడు భద్రతను మరింత బలోపేతం చేసేందుకు భద్రతా అంశాలను పరిశీలిస్తుంటారు. జపాన్‌లో రిక్టర్ స్కేల్‌పై 9.0 తీవ్రతతో భూకంపం (గ్రేట్ ఈస్ట్ జపాన్ భూకంపం), 2011లో ఫుకుషిమా దైచి అణు ప్రమాదం తర్వాత భూకంపాలు, వరదలు, ప్రభావాలను ఎదుర్కొనే సామర్థ్యాన్ని పెంపొందించటానికి భారత ఎన్ పీపీల కోసం ఏఈఆర్బీ స్వతంత్రంగా ఇటువంటి పునః సమీక్ష నిర్వహించింది. ఈ భద్రతా అంచనాలు, చేపట్టిన చర్యలు ఇటీవల రష్యా, జపాన్ లో రిక్టర్ స్కేలుపై 8.6 తీవ్రతతో సంభవించిన భూకంపానికి కూడా వర్తిస్తాయి. ఈ భూకంపాల ప్రభావం భారత అణు విద్యుత్ ప్లాంట్లపై లేదు. అయినప్పటికీ నియంత్రణ మార్గదర్శకాలకు అనుగుణంగా భద్రతపై అంచనా వేయాల్సి ఉంటుంది.
తీరప్రాంతాల్లోని అణు విద్యుత్ కేంద్రాలను ఆయా ప్రాంతాల్లో సంభవించే భూకంపాలు, సునామీలు, తుఫాన్లు, వరదలు వంటి వాటికి సంబంధించిన సాంకేతిక అంశాలను పరిగణనలోకి తీసుకుని రూపొందించారు. వాటి భద్రతను మెరుగుపరచడానికి క్రమం తప్పకుండా పర్యవేక్షణ, కాలానుగుణంగా సమీక్షలు, నవీకరణలు (అవసరమైతే) కూడా చేపడతారు. భద్రతా వ్యవస్థల నిర్మాణాలు, వ్యవస్థలు, విపత్కర పరిస్థితులను తట్టుకుని సమర్థవంతంగా పనిచేసేలా రూపొందించారు. అంతేకాకుండా, ఇలాంటి విపత్తులకు సంబంధించి ప్రామాణిక కార్యాచరణ విధానాలు అమల్లో ఉన్నాయి. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో తీసుకోవాల్సిన చర్యలపై సిబ్బందికి శిక్షణ ఇస్తారు.
కూడంకుళం ప్రాజెక్టులో ఒక్కొక్కటి 1000 మెగావాట్ల సామర్థ్యం గల మొత్తం ఆరు అణు విద్యుత్ రియాక్టర్లు ఉన్నాయి. దీని మొత్తం సామర్థ్యం 6000 మెగావాట్లు. ఇందులో రెండు రియాక్టర్లు (కేకేఎన్పీపీ1, 2- 2X1000 మెగావాట్లు) ప్రస్తుతం పనిచేస్తున్నాయి. మిగిలిన నాలుగు రియాక్టర్లు (కేకేఎన్పీపీ-3 నుండి 6 వరకు, 4 x 1000 మెగావాట్లు) నిర్మాణంలో/ ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి.
ఈ సమాచారాన్ని కేంద్ర సైన్స్, సాంకేతిక, ఎర్త్ సైన్సెస్, సహాయ మంత్రి (స్వతంత్ర), పీఎంఓ, సిబ్బంది సహాయ మంత్రి, ప్రజా ఫిర్యాదులు, పింఛన్లు, అణుశక్తి శాఖ, అంతరిక్ష శాఖల సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఇవాళ లోక్ సభలో లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.