కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
హైదరాబాద్‌లో మూడు నివేశక్ సేవా కేంద్రాలను ప్రారంభించిన ఐఈపీఎఫ్‌ఏ
త్వరలో మరో రెండు కేంద్రాల ప్రారంభం
పెట్టుబడిదారుల రక్షణను పెంచటం, సేవలను క్రమపద్ధతిలో అందించటం, డివిడెండ్ క్లెయిమ్‌ల విషయంలో మరింత అందుబాటు సౌకర్యాలు అందించటమే లక్ష్యంగా సేవా కేంద్రాల విస్తరణ
Posted On:
20 AUG 2025 6:38PM by PIB Hyderabad
కేంద్ర ప్రభుత్వ కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలోని ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొటెక్షన్ ఫండ్ అథారిటీ (ఐఈపీఎఫ్‌ఏ) హైదరాబాద్‌లో మూడు నివేశక్ సేవా కేంద్రాలను ప్రారంభించింది. సెబీ, సీడీఎస్ఎల్, ఎన్ఎస్డీఎల్, బీఎస్ఈ, ఎన్ఎస్ఈ సహకారంతో ఏర్పాటు చేసిన ఈ కేంద్రాలు 2025 ఆగస్టు 16 నుంచి కార్యకలాపాలు ప్రారంభించాయి. పెట్టుబడిదారుల రక్షణను బలోపేతం చేయడం.. పెట్టుబడిదారులకు వేగవంతమైన, ఎలాంటి ఇబ్బందులు లేని సేవలను అందించేలా చూసుకోవటంలో ఈ కేంద్రాల ఏర్పాటు అనేది ఒక కీలక పరిణామం.
ముఖ్యంగా క్లెయిమ్ చేసుకోని డివిడెండ్లు, కేవైసీ లేదా నామినేషన్ అప్‌డేట్ చేయటానికి సంబంధించిన విషయాలలో పెట్టుబడిదారులకు వేగవంతమైన, సులభమైన, మరింత అందుబాటులో ఉండే విధంగా సేవలను అందించేందుకు ఈ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
ఈ కేంద్రాలు అందించే కీలక సేవలు:
* 6-7 సంవత్సరాల నుంచి పెండింగ్‌లో ఉండి చెల్లింపు కాని డివిడెండ్‌లను ప్రత్యక్షంగా బదిలీ చేసుకునే సదుపాయం
* కేవైసీ, నామినేషన్ వివరాలను ఎలాంటి ఇబ్బందులు లేకుండా అప్‌డేట్ చేసుకోవటం
* భౌతికమైన ఫోలియోల కోసం: కేవైసీ అప్‌డేట్ కోసం ఐఎస్ఆర్-1/ ఐఎస్ఆర్-2/ఐఎస్ఆర్-3 ఫారమ్‌లను సమర్పించటం.. అప్‌డేట్ చేసిన తర్వాత పెండింగ్‌లో ఉన్న అన్ని డివిడెండ్‌లను చెల్లించటం.
* డీమ్యాట్ ఖాతాల కోసం: చెల్లింపు కాని డివిడెండ్‌లను పొందేందుకు డిపాజిటరీ పార్టిసిపెంట్ (డీపీ) వద్ద బ్యాంకు వివరాలను అప్‌డేట్ చేసుకోవటం
ప్రస్తుతం హైదరాబాద్‌లో మూడు కేంద్రాలు ప్రారంభమయ్యాయి. పెట్టుబడిదారుల సేవలను మరింత బలోపేతం చేయడానికి మరో రెండు కేంద్రాలు త్వరలో ప్రారంభంకానున్నాయి.
ఈ కేంద్రాలు 2025 ఆగస్టు 16 నుంచి రోజూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ సేవల్ని అందిస్తాయి. హైదరాబాద్‌లోని ప్రాంతాలు:
1. కేఫిన్ టెక్నాలజీస్ లిమిటెడ్
ప్లాట్ నెం. 31 & 32, సెలీనియం, టవర్-బీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నానక్‌రామ్‌గూడ, సెరిలింగంపల్లి, హైదరాబాద్, తెలంగాణ, 500032
2. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్ఈ) హైదరాబాద్ కార్యాలయం
103, 1వ అంతస్తు, ఇంపీరియల్ టవర్స్, అమీర్‌పేట్, హైదరాబాద్ – 500016
ఎస్పీఓసీ: కే. నాగభూషణ్, ఫోన్ నం. 9949902111
3. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ) ఆఫ్ ఇండియా లిమిటెడ్
5వ అంతస్తు, ఆవ్‌ఫిస్ స్పేస్ సొల్యూషన్స్, ప్రెస్టీజ్ ఫీనిక్స్ 1405, ఉమా నగర్, మెట్రో స్టేషన్ పక్కన, బేగంపేట, హైదరాబాద్, తెలంగాణ, 500016
ఏపీపీఎఫ్ఏ:
భారత ప్రభుత్వ కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 2016 సెప్టెంబర్ 7న ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొటెక్షన్ ఫండ్ అథారిటీని (ఏపీపీఎఫ్ఏ) స్థాపించారు. షేర్లు, క్లెయిమ్ చేసుకోని డివిడెండ్లు, మెచ్యూర్డ్ డిపాజిట్లు, డిబెంచర్ల వాపసు ప్రక్రియను సులభతరం చేయడం ద్వారా పెట్టుబడిదారుల ప్రయోజనాలను కాపాడటంపై దృష్టి సారించే ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొటెక్షన్ ఫండ్‌ను ఏపీపీఎఫ్ఏ నిర్వహిస్తోంది. పారదర్శకత ఉండేలా చూసుకోవటం, పెట్టుబడిదారుల హక్కుల పరిరక్షణ, దేశవ్యాప్తంగా ఆర్థిక అక్షరాస్యతను ప్రోత్సహించేందుకు పలు రకాల కార్యక్రమాలను నిర్వహిస్తోంది.
(Release ID: 2158730)