ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

అనేక నగరాలకు చెందిన డీఆర్ఐ అధికారుల దాడి.. ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో ఒక ఫ్యాక్టరీ నుంచి 119.8 కిలోల అల్ఫ్రాజోలం స్వాధీనం.. దీని విలువ రూ.23.88 కోట్లు.. 8 మంది అరెస్టు

Posted On: 18 AUG 2025 9:41PM by PIB Hyderabad

హైదరాబాద్విశాఖపట్నంవిజయవాడకాకినాడలలోని డైరెక్టరేట్ ఆఫ్ రెవిన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు చక్కని సమన్వయంతో చేపట్టిన దాడిలో 119.4 కిలోల అల్ప్రాజోలాన్ని ఒకే చోట జప్తు చేశారు. దీని విలువ చట్టవిరుద్ధ మార్కెటులో సుమారు రూ.23.88 కోట్లు ఉంటుంది. అలాగే, అల్ప్రాజోలంగా మార్చడానికి సిద్ధం చేసిన 87.8 కిలోల పదార్థాన్ని కూడా అధికారులు జప్తు చేశారు.

అల్ప్రాజోలాన్ని అక్రమంగా తయారు చేయడంతో పాటు పంపిణీ చేయడంలో ప్రమేయం ఉన్న ఎనిమిది మందిని కూడా డీఆర్ఐ అధికారులు అరెస్టు చేశారు. అధికారులు ఒకే చోట పట్టుకున్న వారిలో సూత్రధారే కాక మందును అమ్మే వాళ్లుఆ మందును కొంటున్న వాళ్లుమందును తయారు చేయడానికి డబ్బు సమకూరుస్తున్న వాళ్లు కూడా ఉన్నారు.

 

 

కొంత మంది ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో అల్ప్రాజోలాన్ని అక్రమంగా తయారు చేస్తున్నట్లుగా నిర్దిష్ట  రహస్య సమాచారం అందడంతోడీఆర్ఐ అధికారులు పక్కా ప్రణాళిక వేసుకొని ముందుకు కదిలారు. అల్ప్రాజోలం.. ఎన్‌డీపీఎస్ చట్టం-1985లో పేర్కొన్న ప్రకారం.. మనిషి కేంద్రీయ నాడీ మండల వ్యవస్థపై దుష్ప్రభావాన్ని చూపే ఒక పదార్థం. ఈ మత్తుమందును తయారు చేయడంతో పాటు పంపిణీ చేయడంలో కూడా ప్రమేయం ఉన్న ముఠా సభ్యులందరినీ డీఆర్ఐ అధికారులు అరెస్టు చేశారు.

దీనికి అదనంగాఅల్ప్రాజోలాన్ని తయారు చేయడానికి ఉపయోగించే 3,600 లీటర్ల ద్రవపదార్థంతో పాటు చట్టవిరుద్ధంగా సేకరించిన 311.6 కిలోల ఘన రూప ముడిపదార్థాలుసామగ్రిని (వీటిలో రెండు రియాక్టర్లుఒక సెంట్రిఫ్యూజ్ఒక డ్రయ్యరు ఉన్నాయి)నేరం జరిగిందని నిరూపించే కొన్ని పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇవి దర్యాప్తును ఇక ముందూ కొనసాగించడంలో తోడ్పడతాయని భావిస్తున్నారు.

 

    

నిందితులైన మొత్తం ఎనిమిది మందినీ అరెస్టు చేసిజ్యుడీషియల్ కస్టడీకి రిమాండ్ చేశారు. అరెస్టయిన వారిలో అనేక మందికి ఇదివరకు దొంగతనంగా మత్తుమందులనుమనిషి కేంద్రీయ నాడీ మండల వ్యవస్థపై దుష్ప్రభావాన్ని కలిగించే పదార్థాలను తయారు చేయడానికి సంబంధించిన కేసులతో పాటు ఇతరత్రా నేరపరమైన కార్యకలాపాల్లోనూ (హత్యసైబర్ నేరాలుఆర్థిక నేరాల వంటివి) పాత్ర ఉండటం గమనించదగ్గది.

 ఈ చట్టవిరుద్ధ పనిని చేపట్టడానికి వీరు జైలులో ఉన్నప్పుడే పథకం వేసుకొనిఅందుకు ఒక నెట్‌వర్కును కూడా ఏర్పాటు చేసుకున్నారని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఇది ఈ ముఠా వేళ్లు లోతుగా పాతుకుపోయి వ్యవస్థీకృతం అయ్యాయని చెప్పకనే చెబుతోంది. ఈ అల్ప్రాజోలాన్ని కల్లులో కలపడానికి తెలంగాణకు రవాణా చేయాలనుకున్నారు.

ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది.‌

 

***


(Release ID: 2157855)
Read this release in: English , Urdu , Hindi