రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ప్రారంభించిన నాలుగు రోజుల్లోనే వినియోగదారుల సంఖ్యలో అయిదు లక్షలు దాటిన ఫాస్ట్ ట్యాగ్ వార్షిక పాస్


ప్రభుత్వ యాప్‌లలో అగ్రస్థానానికి చేరుకున్న రాజమార్గ్‌యాత్ర యాప్

Posted On: 18 AUG 2025 8:23PM by PIB Hyderabad

టోల్ వసూలుకు సంబంధించి ప్రయాణికులకు సౌకర్యవంతమైనసమర్థవంతమైన అనుభవాన్ని అందించేందుకు ఇటీవల ప్రవేశపెట్టిన ఫాస్టాగ్ వార్షిక పాస్ వినియోగదారుల సంఖ్య ఐదు లక్షలను దాటిందిఫాస్టాగ్ వార్షిక పాస్ సౌకర్యాన్ని 2025 ఆగస్టు 15న ప్రారంభించారుజాతీయ రహదారులపై ప్రయాణించే వారి నుంచి దీనికి మంచి స్పందన వచ్చిందిగత నాలుగు రోజుల్లో ఈ వార్షిక పాస్‌లు కోనుగోలు చేసిన రాష్ట్రాల్లో తమిళనాడు అన్నింటికంటే ముందుందితదనంతర స్థానాల్లో కర్ణాటకహర్యానా ఉన్నాయిటోల్ ప్లాజాలలో ఫాస్టాగ్ వార్షిక పాస్‌ల ద్వారా గరిష్ట లావాదేవీలు తమిళనాడుకర్ణాటకఆంధ్రప్రదేశ్‌లలో జరిగాయి

రాజ్‌మార్గ్‌యాత్ర యాప్ గూగుల్ ప్లేస్టోర్ ర్యాంకుల్లో 23వ స్థానానికి చేరుకుంది. 15 లక్షలకు‌ పైగా డౌన్‌లోడ్‌లతో ప్రయాణ విభాగంలో రెండో స్థానంలో ఉందిదీనికి 4.5 స్టార్ రేటింగ్‌ను ఉందిఫాస్టాగ్ వార్షిక పాస్‌ల‌ను ప్రారంభించిన నాలుగు రోజుల్లోనే ఈ యాప్ ప్రభుత్వ యాప్‌లలో అగ్రస్థానంలో నిలవటం అనేది ఒక ముఖ్యమైన పరిణామం

జాతీయ రహదారులపై ప్రయాణించే వారికి ఎలాంటి ఆటంకం లేని ఆర్థికంగా అందుబాటులో ఉండే విధంగా ప్రయాణ అనుభవాన్ని అందించేందుకు ఫాస్టాగ్‌ వార్షిక పాస్ సౌకర్యాన్ని 2-25 ఆగస్టు 15న ఆవిష్కరించారుజాతీయ రహదారులుజాతీయ ఎక్స్‌ప్రెస్‌వేలలోని దాదాపు 1150 టోల్ ప్లాజాలలో ఈ పాస్ పనిచేస్తుందిఒక సంవత్సరం చెల్లుబాటు అవుతుంది లేదా 200 టోల్ ప్లాజాలకు వర్తిస్తుందిదీనికి ఒకసారి రూ. 3000ల ఫీజు చెల్లించాలిఇది ఫాస్టాగ్‌ను తరచుగా రీఛార్జ్ చేయాల్సిన అవసరాన్ని తొలగిస్తుందిచెల్లుబాటులో ఉన్న ఫాస్టాగ్ ‌ఉన్న అన్ని వాణిజ్యేతర వాహనాలకు ఈ పాస్ వర్తిస్తుందిరాజ్‌మార్గయాత్ర యాప్ లేదా ఎన్‌హెచ్ఏఐ వెబ్‌సైట్ ద్వారా ఫీజు చెల్లించిన తర్వాత రెండు గంటల్లోపు ఇది యాక్టివేట్ అవుతుందిఇది దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై ఆటంకం లేని ప్రయాణ అనుభవాన్ని వాహదారులకు అందించనుంది

 

***


(Release ID: 2157759) Visitor Counter : 5