వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
స్పైస్డ్ పథకం ద్వారా పసుపు ఎగుమతులకు ప్రభుత్వ ప్రోత్సాహం
* నాణ్యత, మార్కెట్ అనుసంధాన కార్యక్రమాలతో పసుపునకు అంతర్జాతీయ ప్రాచుర్యం కల్పిస్తోన్న సుగంధ ద్రవ్యాల బోర్డు
Posted On:
12 AUG 2025 3:57PM by PIB Hyderabad
సుగంధ ద్రవ్యాల బోర్డు ద్వారా భారత ప్రభుత్వం ‘‘సుగంధ ద్రవ్యాల రంగ ఎగుమతుల్లో ప్రగతిశీల, వినూత్న, సహకార చర్యల ద్వారా సుస్థిరత (స్పైస్డ్)’’ పథకాన్ని అమలు చేస్తోంది. దీని ద్వారా పసుపుతో సహా ఇతర సుగంధ ద్రవ్యాల ఎగుమతులను ప్రోత్సహించేందుకు వివిధ కార్యక్రమాలను చేపడుతోంది. దీనిలో ఆహార భద్రత, నాణ్యతకు హామీ ఇచ్చే వ్యవస్థలు/ధ్రువీకరణల అమలు, దిగుబడి అనంతరం నాణ్యతను పెంపొందించడం, శుద్ధి చేయడానికి, విలువను జోడించేందుకు తోడ్పాటు, నాణ్యతను పెంపొందించడం, ఔత్సాహిక పారిశ్రామిక రంగాన్ని ప్రోత్సహించే దిశగా పసుపు రంగంలో ఉన్న వారికి శిక్షణా కార్యక్రమాలు నిర్వహించడం, దిగుమతి చేసుకొనే దేశాల ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా ఎగుమతి చేసే పసుపు నాణ్యతను ప్రయోగశాలల్లో అంచనా వేయడం, రైతులు/రైతు సంఘాలు, ఎగుమతిదారులు/శుద్ధిచేసేవారు, అంతర్జాతీయ కొనుగోలు దారుల మధ్య నేరుగా మార్కెట్ అనుసంధానాన్ని ఏర్పాటు చేయడానికి కొనుగోలుదారులు, విక్రేతల సంఘాలు (దేశీయ/అంతర్జాతీయ)తో సమావేశాలను నిర్వహించడం తదితరమైనవి ఉన్నాయి.
అలాగే, పసుపు, పసుపు ఉత్పత్తుల సామర్థ్యాన్ని ఉపయోగించుకొనేందుకు 04.10.2023న జారీ చేసిన నోటిఫికేషన్ ద్వారా ‘‘జాతీయ పసుపు బోర్డు’’ కింది లక్ష్యాలతో ఏర్పాటయింది.
i. పసుపులో కొత్త ఉత్పత్తి అభివృద్ధి, విలువ జోడింపును ప్రోత్సహించడం.
ii. అంతర్జాతీయ మార్కెట్లో పసుపు, పసుపు ఉత్పత్తులపై అవగాహన, వినియోగాన్ని పెంపొందించడం.
iii. విలువ జోడించిన పసుపు ఉత్పత్తులను అభివృద్ధి చేయడానికి అంతర్జాతీయ మార్కెట్ సామర్థ్యాన్ని గుర్తించేందుకు పరిశోధనను సులభతరం చేయడం.
iv. పసుపు, పసుపు ఉత్పత్తుల ఎగుమతుల కోసం మౌలికవసతులు, రవాణా సదుపాయాల కల్పించడం, మెరుగుపరచడం.
v. పరస్పర అనుసంధానాన్ని బలోపేతం చేయడం ద్వారా పసుపు, పసుపు ఉత్పత్తులకు స్థిరంగా కొనసాగే సరఫరా వ్యవస్థల ఏర్పాటును ప్రోత్సహించడం.
vi. పసుపు సరఫరా వ్యవస్థలో నాణ్యత, భద్రతా ప్రమాణాలను పాటించేలా ప్రోత్సహించడం.
vii. విలువ జోడింపు కార్యకలాపాల దిశగా పసుపు సాగు చేసే వారిలో సామర్థ్య నిర్మాణాన్ని, నైపుణ్యాభివృద్దిని పెంపొందించడం.
viii. పసుపు, దాని ఉత్పత్తుల వినియోగానికి సంబంధించి సంప్రదాయ విజ్ఞాన ప్రతులను బలోపేతం చేయడం.
ix. పసుపు అందించే వైద్య, ఆరోగ్య ప్రయోజనాలపై అధ్యయనాలు, క్లినికల్ పరీక్షలు, పరిశోధనలను ప్రోత్సహించడం.
x. పసుపు రంగాన్ని ప్రోత్సహించడానికి, అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించే ఏదైనా ఇతర లక్ష్యం.
2020 నుంచి అంతర్జాతీయ పసుపు ఎగుమతుల్లో భారత్ వాటా వివరాలు అనుబంధం-1లో ఉన్నాయి.
2020 నుంచి భారత్ ఎగుమతి చేసిన పసుపు ఎగుమతులు పరిమాణం అనుబంధం-IIలో ఉంది.
2020-21 నుంచి 2024-25 ఆర్థిక సంవత్సరం వరకు పసుపు ఎగుమతుల ద్వారా రాష్ట్రాల వారీగా సమకూరిన ఆదాయం వివరాలు అనుబంధం-IIIలో ఉన్నాయి.
2020 నుంచి భారత పసుపును అత్యధికంగా దిగుమతి చేసుకుంటున్న అయిదు దేశాలు బంగ్లాదేశ్, యూఏఈ, యూఎస్ఏ, మలేషియా, మొరాకో. 2020-21 నుంచి 2024-25 వరకు ఎగుమతి చేసిన పసుపు పరిమాణం వివరాలు అనుబంధం-IVలో ఉన్నాయి.
ఈ సమాచారాన్ని వాణిజ్యం, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శ్రీ జితిన్ ప్రసాద లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానంగా అందించారు.
YEAR WISE EXPORTS OF TURMERIC TO TOP FIVE IMPORTERS OF INDIAN TURMERIC
|
|
2020-21
|
2021-22
|
2022-23
|
2023-24
|
2024-25
|
Country
|
Qty
|
Qty
|
Qty
|
Qty
|
Qty
|
BANGLADESH
|
51308.20
|
25256.46
|
34523.90
|
37577.13
|
34073.12
|
U.A.E
|
13795.79
|
22500.41
|
18980.25
|
17316.11
|
25135.96
|
U.S.A
|
10693.83
|
8266.66
|
7009.43
|
8602.79
|
8536.35
|
MALAYSIA
|
7987.70
|
8058.84
|
6829.46
|
8465.90
|
8825.86
|
MOROCCO
|
8906.01
|
9505.43
|
10663.63
|
7826.43
|
9390.32
|
Source: Spices Board
***
(Release ID: 2155935)