ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ
‘పీఎంకేఎస్‌వై’ కింద దేశవ్యాప్తంగా 1601 ప్రాజెక్టుల కోసం రూ.8,853 కోట్ల నిధుల మంజూరుకు ఆమోదం
· ఆహార భద్రత మౌలిక సదుపాయాలపై దృష్టి: ‘పీఎంకేఎస్‌వై’ కింద 2024 నుంచి 52 కొత్త ప్రాజెక్టులు మంజూరు
· ‘నాబ్‌కాన్స్ (ఎన్‌ఏబీసీవోఎన్‌ఎస్) అధ్యయనం: పండ్లు.. పాడి.. మత్స్య పరిశ్రమలో వృథాను గణనీయంగా తగ్గించేలా శీతల గిడ్డంగుల నిర్మాణం
· పీఎంకేఎస్‌వై కింద నిధుల కేటాయింపు
Posted On:
01 AUG 2025 4:44PM by PIB Hyderabad
కేంద్ర ఆహార తయారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ “ప్రధాన మంత్రి కిసాన్ సంపద యోజన” (పీఎంకేఎస్‌వై) పేరిట ఒక సాముదాయక పథకాన్ని అమలు చేస్తోంది. దీనికింద ఈ ఏడాది జూన్ 30 నాటికి రూ.30,656.57 కోట్ల అంచనా వ్యయంతో 1601 ప్రాజెక్టులకు ఆమోదం ఇవ్వగా, రూ.8,853.38 కోట్ల మేర ఆర్థిక సహాయం మంజూరుకు ఆమోదం తెలిపింది.
‘పీఎంకేఎస్‌వై’లో అంతర్భాగమైన ఇతర పథకాల కింద జనవరి 2024 నుంచి జూన్ 2025 వరకూ 52 ప్రాజెక్టులకు ఆమోదముద్ర వేయగా, వాటిలో 1 ఆహార భద్రత-నాణ్యత మౌలిక సదుపాయాలకు భరోసా పథకం కింద మంజూరైంది. వీటి వివరాలను అనుబంధంలోని పట్టికలో చూడవచ్చు.
పంటకోత అనంతర మౌలిక సదుపాయాల కల్పన, ఆహార తయారీ సౌకర్యాల సృష్టి వల్ల ఫలసాయం అందిన తర్వాత సంభవించే నష్టాల తగ్గింపునకు తోడ్పడుతుంది. తదనుగుణంగా ‘పీఎంకేఎస్‌వై’ పరిధిలోని పథకాల ద్వారా ఆహార తయారీ/సంరక్షణ మౌలిక సదుపాయాల కల్పన కోసం ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఆర్థిక సహాయం రూపంలో ప్రభుత్వం చేయూతనిస్తుంది. వీటిలో ఇతరత్రా అంశాలతోపాటు పంటకోత తర్వాత నష్టాలను తగ్గించే శీతల గిడ్డంగులు, శీతల సదుపాయ వాహనాలు ఉంటాయి.
నాబార్డ్ పరిధిలోని కన్సల్టెన్సీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ (నాబ్‌కాన్స్) 2020లో నిర్వహించిన మూల్యాంకన అధ్యయనం అనంతరం మంత్రిత్వ శాఖకు నివేదిక సమర్పించింది. “ఆహార తయారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ సహాయంతో సమీకృత శీతల గిడ్డంగుల సముదాయాల నిర్మాణం, విలువ జోడింపు మౌలిక సదుపాయాల పథకం కింద నిర్మించిన యూనిట్ల ప్రభావం”పై ‘నాబ్‌కాన్స్’ ఈ అధ్యయనం నిర్వహించింది. ఈ చర్యలన్నిటి ఫలితంగా అన్ని రంగాల్లో వృథా కొంత తగ్గినట్లు తేలింది. అయితే, పండ్లు-కూరగాయలు, పాడి-మత్స్య రంగాల్లో వృథా గణనీయంగా తగ్గిందని నివేదిక స్పష్టం చేసింది.
కేంద్ర ఆహార తయారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శ్రీ రవ్‌నీత్ సింగ్ ఈ రోజు రాజ్యసభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక జవాబిస్తూ ఈ సమాచారం వెల్లడించారు.
ANNEXURE
Details of 01 operational project out of 52 Projects approved in the country from January, 2024 to June, 2025
|
Schemes
|
State
|
Project Name
|
Sector
|
District
|
Date of Approval
|
Project Cost
|
Approved Grant-in-aid (Rs. in Cr)
|
Released Grant-in-aid (Rs. in Cr)
|
Status
|
Employment
|
Farmers Benefited
|
Processing & Preservation capacity LMT/Annum
|
Food Safety & Quality Assurance Infrastructure
|
Telangana
|
Vimta Labs Limited
|
Pvt
|
Hyderabad
|
01-03-2024
|
10.82
|
4.09
|
4.0949
|
Operational
|
37
|
Nil
|
Nil
|
***
(Release ID: 2151658)