కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఆంధ్రప్రదేశ్ లైసెన్స్డ్ సర్వీస్ ఏరియా పరిధిలోని విశాఖపట్నం, కోస్టల్ కారిడార్, పరిసర ప్రాంతాల్లో నెట్వర్క్ నాణ్యతను పరీక్షించిన ట్రాయ్

Posted On: 31 JUL 2025 12:37PM by PIB Hyderabad

ఆంధ్రప్రదేశ్ లైసెన్స్డ్ సర్వీస్ ఏరియా (ఎల్ఎస్ఏ) పరిధిలోని విశాఖపట్నం నగర రహదారులు, కోస్టల్ కారిడార్ ప్రాంతాల్లో 2025 జూన్‌లో నిర్వహించిన ఇండిపెండెంట్ డ్రైవ్ టెస్ట్ (ఐడీటీ) ఫలితాలను టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) విడుదల చేసింది. నగర ప్రాంతాలు, సంస్థాగత కేంద్రాలు, కోస్తా, గ్రామీణ నివాస ప్రాంతాలు లాంటి వైవిధ్యమైన వినియోగ వాతావరణంలో మొబైల్ నెట్వర్క్‌ల వాస్తవ పనితీరు ఎలా ఉంటుందో తెలుసుకొనేందుకు ఈ పరీక్షలను నిర్వహించారు. వీటిని హైదరాబాద్‌లోని ట్రాయ్ ప్రాంతీయ కార్యాలయం ఆధ్వర్యంలో చేపట్టారు.

2025 జూన్ 10 నుంచి 2025 జూన్ 13 వరకు ట్రాయ్ బృందాలు 342.9 కి.మీ.ల సిటీ డ్రైవ్ టెస్ట్, 3.6 కి.మీ.ల వాక్ టెస్ట్, 19 కి.మీ.ల కోస్టల్ కారిడార్ డ్రైవ్ టెస్ట్‌తో పాటు 8 హాట్ స్పాట్ ప్రాంతాల్లో సమగ్ర పరీక్షలు చేపట్టాయి. పరీక్షించిన సాంకేతికతల్లో 2జీ, 3జీ, 4జీ, 5జీ ఉన్నాయి. ఇవి వివిధ రకాల హ్యాండ్ సెట్ల సామర్థ్యాల వారీగా సేవా అనుభవాన్ని ప్రతిబింబిస్తాయి. సంబంధిత టీఎస్‌పీలకు ఐడీటీ ఫలితాలను తెలియజేశారు.

అంచనా వేసిన ప్రధాన అంశాలు:

ఎ) వాయిస్ సేవలు: కాల్ సెటప్ సక్సెస్ రేట్ (సీఎస్ఎస్ఆర్), డ్రాప్ కాల్ రేట్ (డీసీఆర్), కాల్ సెటప్ టైం, కాల్ సైలెన్స్ రేటు, స్పీచ్ క్వాలిటీ (ఎంవోఎస్), కవరేజీ.

బి) డేటా సేవలు: డౌన్లోడ్/అప్లోడ్ సామర్థ్యం, నెట్వర్క్ సేవల్లో జాప్యం, డేటా ప్రసారంలో ఆలస్యం, ప్యాకెట్ డ్రాప్ రేటు, వీడియో ప్రసారంలో ఆలస్యం.

విశాఖపట్నంలో మొత్తం మొబైల్ నెట్వర్క్ పనితీరు దిగువన పేర్కొన్న విధంగా ఉంది:

కాల్ సెటప్ సక్సెస్ రేటు: ఆటో సెలక్షన్ మోడ్‌ (5G/4G/3G/2G)లో ఎయిర్‌టెల్, బీఎస్ఎన్ఎల్, ఆర్‌జేఐఎల్, వీఐల్ వరుసగా 99.15 శాతం, 95.55 శాతం, 99.83 శాతం, 96.83 శాతం కాల్ సెటప్ సక్సెస్ రేటు కలిగి ఉన్నాయి.

డ్రాప్ కాల్ రేటు - ఆటో సెలక్షన్ మోడ్‌ (5G/4G/3G/2G)లో ఎయిర్‌టెల్, బీఎస్ఎన్ఎల్, ఆర్‌జేఐఎల్, వీఐల్ వరుసగా 0.00 శాతం, 4.66 శాతం, 0.00 శాతం, 0.34 శాతం డ్రాప్ కాల్ రేటు కలిగి ఉన్నాయి.

5జీ డేటా సేవలు: గరిష్ట సగటు డౌన్లోడ్ సామర్థ్యం 204.91 ఎంబీపీఎస్, అప్లోడ్ సామర్థ్యం 20.49 ఎంబీపీఎస్.

క్యూఓఎస్ పరామితులకు అనుగుణంగా పనితీరు:

సీఎస్ఎస్ఆర్: కాల్ సెటప్ సక్సెస్ రేటు (శాతంలో), సీఎస్‌టీ: కాల్ సెటప్ టైం (సెకండ్లలో), డీసీఆర్: డ్రాప్ కాల్ రేటు (శాతాల్లో), ఎంఓఎస్: మీన్ ఒపీనియన్ స్కోర్

విశాఖపట్నంలో పూర్ణా మార్కెట్, పోర్ట్ మెయిన్ రోడ్డు, జైల్ రోడ్డు, సిరిపురం జంక్షన్, ఎంవీపీ కాలనీ, పెదవాల్తేరు, చినవాల్తేరు, మద్దిలపాలెం, కైలాస గిరి, వైజాగ్ వ్యూ పాయింట్, సాగర్ నగర్ బీచ్, రుషికొండ బీచ్, ఐటీ పార్క్ బీచ్, బీచ్ రోడ్, భీమునిపట్నం, గొల్లలపాలెం, బంగాలామెట్ట, గుర్రంపాలెం, రామపురం, సూరెడ్డివానిపాలెం, పరవాడ, యెండాడ, మధురవాడ, పెందుర్తి, సింహాచలం, గాజువాక, స్టీల్ ప్లాంట్, ఎన్టీపీసీ, ఎన్ఏడీ జంక్షన్, ఎయిర్పోర్టు, నావల్ డాక్‌యార్డ్ రోడ్డు, తదితరమైన ప్రాంతాల్లో ఈ పరీక్షలు నిర్వహించారు. గాజువాక బస్ డిపో, వైజాగ్ ఆర్టీసీ బస్ కాంప్లెక్స్, రుషి కొండ బీచ్, శ్రీరాం గుడి, ఏసీఏ వైజాగ్ క్రికెట్ స్టేడియం, వైజాగ్ రైల్వే స్టేషన్, వైజాగ్ స్టీల్ ప్లాంట్, వీఎంఆర్‌డీఏ కైలాస గిరి ప్రాంతాల్లో స్థిరమైన వినియోగ అనుభవాన్ని ప్రతిబింబించేలా వాస్తవ పరిస్థితులను ట్రాయ్ అంచనా వేసింది.

 



ట్రాయ్ సూచించిన పరికరాలు, నిర్దేశిత ప్రొటోకాల్ ఆధారంగా వాస్తవ పరిస్థితుల్లో ఈ పరీక్షలను నిర్వహించారు. సమగ్ర నివేదిక ట్రాయ్ వెబ్‌సైట్ www.trai.gov.in లో అందుబాటులో ఉంది. ఏవైనా సందేహాలు/సమాచారం కోసం ట్రాయ్ అడ్వైజర్ (ప్రాంతీయ కార్యాలయం, హైదరాబాద్) శ్రీ బీ ప్రవీణ్ కుమార్‌ను ఈ-మెయిల్ ఐడీ adv.hyderabad@trai.gov.in లేదా +91-40-23000761 ఫోన్ నెంబరులో సంప్రదించవచ్చు.

 

***


(Release ID: 2150922)
Read this release in: English , Urdu , Hindi , Tamil