మత్స్య పరిశ్రమ, పశు పోషణ మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఒంగోలు జాతి పశువుల సంరక్షణలో ప్రస్తుత స్థితి

Posted On: 23 JUL 2025 3:22PM by PIB Hyderabad

అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారంఒంగోలు జాతి పశువుల సంఖ్య 6.34 లక్షల నుంచి 7.03 లక్షలకు పెరిగిందిపశుగణన 2012 (జాతి సర్వే నివేదిక 2013) - 2019 (జాతి సర్వే నివేదిక 2022) గణాంకాల ప్రకారం.. వీటి సంఖ్య 10.88 శాతం పెరిగిందిఆంధ్రప్రదేశ్‌లో ఒంగోలు జాతితో సహా దేశీయ జాతులను అభివృద్ధిసంరక్షణ కోసం రాష్ట్రీయ గోకుల్ మిషన్ ద్వారా దిగువ పేర్కొన్న చర్యలు తీసుకుంటున్నారు.

(i) బొవైన్ ఐవీఎఫ్ సాంకేతికత అమలుఈ విభాగం కింద గుంటూరులోని లాంఫామ్‌తిరుపతిలోని వెటర్నరీ సైన్సెస్ కళాశాలనెల్లూరులోని చింతలదేవి వద్ద ఉన్న జాతీయ కామధేను బ్రీడింగ్ సెంటర్‌లో ఐవీఎఫ్ ప్రయోగశాలల్ని నిర్వహిస్తున్నారుఐవీఎఫ్ సాంకేతికత ద్వారా ఒంగోలుపుంగనూరు పశువులతో సహా దేశీయ జాతుల అభివృద్ధికి ఈ ప్రయోగశాలలు పనిచేస్తున్నాయి.

(ii) దక్షిణ ప్రాంతానికి జాతీయ కామధేను బ్రీడింగ్ సెంటర్‌ను నెల్లూరు జిల్లాలోని చింతలదేవి వద్ద ఏర్పాటు చేశారుఒంగోలు జాతితో సహా దేశీయ జాతులను శాస్త్రీయమైనసమగ్రమైన విధానంలో అభివృద్ధి చేసిసంరక్షించడమే దీని లక్ష్యం.

(iii) ఒంగోలు జాతి పశువుల అభివృద్ధిపరిరక్షణకు ప్రకాశం జిల్లాలోని చదలవాడలో ఏర్పాటు చేసిన గోకుల్ గ్రామ్‌కు అవసరమైన తోడ్పాటును ఈ విభాగం అందించిందిేలురకపు జన్యువులను కలిగిన ఎద్దుల సంతానోత్పత్తిసరఫరా విషయంలో గోకుల్ గ్రామ్ కీలకపాత్ర పోషిస్తుంది.

(iv) ఒంగోలు జాతి ఎద్దుల వృద్ధి కోసం చింతలదేవిలో నిర్వహిస్తున్న మాతృపశుశాలను బలోపేతం చేసే దిశగా రాష్ట్రానికి సహాయం అందించారు.

(v) ఒంగోలు జాతితో సహా దేశీయ జాతి పశువులను గుర్తించిప్రవర్ధనం చేయడానికి పశు సంవర్థకపాడి పరిశ్రమ విభాగం కేంద్రీయ పశువుల రిజిస్ట్రేషన్ పథకాన్ని ఒంగోలులో అమలు చేస్తున్నది.

(vi) బనవాసినంద్యాలవిశాఖల్లో ఉన్న వీర్య కేంద్రాలను బలోపేతం చేయడానికి అవసరమైన సాయం రాష్ట్రానికి లభించిందిప్రస్తుతం 25 హై జెనెటిక్ మెరిట్ (హెచ్‌జీఎంకలిగిన ఒంగోలు జాతి ఎద్దులు ఈ వీర్య కేంద్రాల వద్ద ఉన్నాయి. 2024-25లో మొత్తం 5.07 లక్షల డోసుల ఒంగోలు వీర్యం రాష్ట్రంలో ఉత్పత్తి అయింది.

రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ సమాచారాన్ని కేంద్ర మత్స్యపశుసంవర్ధకపాడి పరిశ్రమ శాఖ సహాయ మంత్రి ప్రొఫెసర్ ఎస్పీ సింగ్ బఘేల్ లిఖిత పూర్వకంగా అందించారు.

 

***


(Release ID: 2147573)
Read this release in: English , Urdu , Hindi