ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ట్రినిడాడ్, టొబాగో దేశంలోని ప్రవాస భారతీయులనుద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగం

Posted On: 04 JUL 2025 6:43AM by PIB Hyderabad

 ప్రధానమంత్రి కమ్లా ప్రెసాద్ బిసెసా గారు,

మంత్రివర్గ సభ్యులు,  
కార్యక్రమానికి విచ్చేసిన ప్రముఖులు,
ప్రవాస భారతీయులు,


 

సోదర సోదరీమణులారా
నమస్కారం  !
సీతారామ్!
జై శ్రీరామ్!

మిత్రులారాఒక విషయాన్ని మీరు గమనించాచారా... ఎంత కాకతాళీయమో కదూ...

ఈ సాయంత్రం వేళ ఇలా మీ అందరినీ కలవడం గర్వాన్నీ, అమితానందాన్నీ ఇస్తోందిచక్కని ఆతిథ్యమిచ్చినా గురించి ఆత్మీయంగా మాట్లాడిన ప్రధానమంత్రి కమ్లా గారికి హృదయపూర్వక ధన్యవాదాలు!

కొద్ది సేపటి కిందటే... హమ్మింగ్ బర్డ్స్ కి పేరెన్నికగన్న ఈ అందమైన దేశాన్ని చేరుకున్నానురావడం రావడమే ఇక్కడి ప్రవాస భారతీయులైన మిమ్మల్ని కలుసుకుంటున్నాను.. మనమంతా ఒకే కుటుంబానికి చెందిన వారం కాబట్టి ఇది ఎంతో సహజంగా అనిపిస్తోంది నాకు.  మీరు నా పట్ల చూపుతున్న ఆదరణకు కృతజ్ఞుడిని.

మిత్రులారా!

ట్రినిడాడ్ అండ్ టొబాగో దేశంలో భారతీయుల గాథ ధైర్య సాహసాలకి సంబంధించింది అని నాకు ఎరుకేమీ పూర్వీకులు ఎదుర్కొన్న దుర్భర పరిస్థితులు ఎంతటి ధీమంతులనైనా కుంగదీసేవేఅయినప్పటికీ వారు ఆ కష్టాలని చెక్కుచెదరని ఆశావాదంతోపట్టుదలతో జయించారు!  

వీరు గంగా యమునా నదులను విడిచి వెళ్ళి ఉండవచ్చు కానీరామాయణాన్ని మాత్రం తమ హృదయాలలో పదిలంగా దాచుకునిమోసుకుని వెళ్ళారువారు వదిలిపెట్టింది పుట్టిన నేలనేగానీఆత్మని మాత్రం కాదు. వారు కేవలం కాందిశీకులు కాదు.. శాశ్వతమైన నాగరికతకు దూతలువారి భాగస్వామ్యంతోడ్పాటుఈ దేశ సంస్కృతిఆర్థిక వ్యవస్థఆధ్యాత్మికతను పరిపుష్టం చేశాయిఈ గొప్ప దేశంపై  మీరంతా చూపిన ప్రభావాన్ని ఒక్కసారి తలుచుకుని చూడండి!  


కమ్లా ప్రెసాద్ బిసేసా గారు.. ఈ దేశ తొలి మహిళా ప్రధానమంత్రిగౌరవ క్రిస్టీన్ కార్లా కంగాలూ గారు.. మహిళా రాష్ట్రపతిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కీర్తిశేషులు శ్రీ బస్ దేవ్ పాండే గారు .. రైతు బిడ్డగా జన్మించిప్రధానమంత్రి స్థాయికి ఎదిగిప్రపంచ నేతగా గుర్తింపు తెచ్చుకున్నారుఇక విఖ్యాత గణిత శాస్త్రజ్ఞుడు రుద్రనాథ్ కపిల్ దేవ్ గారుసంగీతజ్ఞుడు సుందర్ పోపోమేటి క్రికెట్ ఆటగాడు డారెన్ గంగతన అచంచల భక్తితో సముద్రంలో మందిరాన్ని నిర్మించిన సేవదాస్ సాధు.. ఈ దేశంలో విజయాలని అందుకున్న భారతీయ మూలాలు గలవారి జాబితా ఎంతో పెద్దది!

ర్మితీయుల పిల్లలైన మీరు ఇప్పుడు సంఘర్షణను ఎదుర్కొంటున్న వారిగా కాకమీరు అందుకుంటున్న విజయాలుమీ సేవమీ విలువల ఆధారంగా గుర్తింపు తెచ్చుకుంటున్నారుఆలోచిస్తేమీరు ఇష్టంగా తినే డబల్స్దాల్-పూరీ లో ఏదో మహత్తు ఉంది... ఉండాలిఅవే ఈ గొప్ప దేశంలో మీ విజయాన్ని రెండింతలు చేసి ఉంటాయి కదూ!  

మిత్రులారా!
25 
ఏళ్ళ కిందట వచ్చినప్పుడుఅందరం లారా కవర్ డ్రైవ్ లుపుల్ షాట్లనీ ఆస్వాదించేవాళ్ళం.. ఇప్పటి యువ హృదయాలని సునీల్ నారాయిన్నికోలాస్ పూరణ్ అదే తరహా ఉత్సాహంతో నింపుతున్నారు!  అప్పటినుంచి ఇప్పటివరుకూ మన స్నేహం ఇంకా చిక్కబడింది!


 

బెనారస్పాట్నాకోల్ కత్తా,  ఢిల్లీఇవన్నీ భారతదేశ నగరాల పేర్లే కావచ్చు కానీఇక్కడ మాత్రం ఆత్మీయంగా వీధులకు పెట్టుకున్న పేర్లునవరాత్రులుమహాశివరాత్రిజన్మాష్టమి పండుగలని ఇక్కడ అత్యంత భక్తిశ్రద్ధలతోప్రేమతో జరుపుకుంటారుచౌతాల్బైఠక్ గానా ఇంకా ఇక్కడ మార్మోగుతూనే ఉన్నాయి

పరిచయం ఉన్న ముఖాలలో తొంగి చూస్తున్న ఆత్మీయత నన్ను పలకరిస్తోంది... ఈ యువత కళ్ళలో... కలిసి ఎదగాలన్న ఉత్సాహంతపనని చూస్తున్నాను.. మన ఈ బంధం సరిహద్దులుతరాల అంతరాలను అధిగమించినది!

మిత్రులారా!

ప్రభు శ్రీరాముల వారి పై మీకు గల అచంచల భక్తిని నేనెరుగుదును!   

ఏక్ సౌ అస్సీ సాల్  బీతల్ హోమన్ న భూలల్ హోభజన్ రామ్ కేహర్ దిల్ మే గూంజల్ హో..” – “నూట ఎనభై ఏళ్ళు గడిచినా మనసు రాముని భజనను మరువలేదుప్రతి హృదయంలో ఆ పేరు ప్రతిధ్వనిస్తూనే ఉంది!”
సాంగ్రే గ్రాండేడౌ గ్రామంలో రామ్ లీలా ఉత్సవాలు ఎంతో అద్భుతంగా జరుగుతాయని విన్నాను.

రామ్ ధామ్ దా పురీ సుహావ్నీ..
లోక్ సమస్త్ బిదిత్ అతి పావని..” అని శ్రీరామ్  చరిత్ మానస్ పేర్కొంటుంది.. అంటే,  “రాముని సన్నిధి ఎంతో మధురంఎంతో పవిత్రం అన్న విషయం లోకప్రసిద్ధం” రాముని క్షేత్రం మనోహరమైనదిఆ నగర ప్రభావం ప్రపంచమంతటా ప్రసరించింది అని అర్ధం.


 

500 ఏళ్ళ తరువాత అయోధ్యకి బాల రాముని పునరాగమనం మీ అందరికీ సంతోషాన్ని కలిగించింది కదా!
రామ మందిర నిర్మాణానికి మీరు పవిత్ర జలాలనుశిలలను పంపారని మాకు గుర్తుందిఅదే భక్తి భావంతో నేను మీ కోసం అయోధ్య రామ మందిరాన్ని పోలిన మందిరాన్నిసరయూ నది పవిత్ర జలాలనూ తీసుకొని వచ్చాను!

జన్మభూమి మమ పురీ సుహావ్నీ
ఉత్తర్ దిశీ బహ్ సరయూ పావనీ।।
జా మజ్జన్ తే బినహి ప్రయాసా
మమ సమీప్ నర్ పావహి బాసా।।


అయోధ్య వైభవం పవిత్ర సరయూ నుంచే ఉద్భవించిందని శ్రీరాముల వారు అంటారుఆ నదిలో మునక వేసిన వారు శ్రీరామునితో ఐక్యం కాగలరు!

 

సరయూ నదిసంగమ జలాలు కలిసిన ఆ తావున భక్తి విశ్వాసాల అమృతం దొరుకుతుందిఈ ప్రవాహధార మన విలువలనిసంస్కారాన్ని ఎప్పటికీ సజీవంగా ఉంచుతుంది!

ఈ ఏడాది మొదట్లో ప్రపంచ అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమమైన మహాకుంభ్ జరిగిందని మీకు తెలుసు.. ఆ మహా కుంభ్ పవిత్ర జలాలను మీ కోసం తీసుకుని వచ్చానుఇక్కడి గంగా ధారకు సరయూ-మహాకుంభ్ పవిత్ర జలాలను అర్పించవలసిందిగా ప్రధానమంత్రి కమ్లా గారిని అభ్యర్థిస్తున్నానుఈ పుణ్య జలాలు ట్రినిడాడ్టొబాగో వాసులకు ఆశీస్సులు అందించు గాక!  

మిత్రులారా!

ఇక్కడి భారతీయ సమాజం బలాన్నిసహకారాన్ని మేమెంతో గౌరవిస్తాంప్రపంచవ్యాప్తంగా గల 35 మిలియన్ల ప్రవాస భారతీయులు మాకు గర్వకారణం. గతంలో నేను చెప్పినట్టుమీలో ఒక్కొక్కరూ ఒక్కో దేశానికి దూతలు – భారతీయ విలువలుసంస్కృతివారసత్వాన్ని ప్రపంచానికి పరిచయం చేసే దూతలు!

ఈ ఏడాది ప్రవాసీ భారతీయ దివస్ ను భువనేశ్వర్ లో ఏర్పాటు చేసినప్పుడు గౌరవ రాష్ట్రపతి క్రిస్టీన్ కార్లా కంగాలూ ముఖ్య అతిథిగా హాజరయ్యారుగతంలో ప్రధానమంత్రి కమ్లా ప్రెసాద్ బిసెసా భారత్ సందర్శనను కూడా మేం గౌరవంగా భావించాం.   


 

ప్రవాసీ భారతీయ దివస్ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా గల ర్మితియా సమూహాలను ఏకం చేసేందుకు,  గౌరవించేందుకు నేను అనేక పథకాలను ప్రకటించానుఉజ్జ్వలమైన భవిష్యత్తు లక్ష్యంగా గతాన్ని గ్రంథస్థం చేసిప్రజల మధ్య వారధులు నిర్మించే ప్రయత్నం చేస్తున్నాంర్మితియా ్రజల సమగ్ర వివరాలతో కూడిన సమగ్ర సమాచారాన్ని తయారు చేసే ప్రయత్నాల్లో ఉన్నాం.

ర్మితియాకు చెందిన వారి పూర్వీకులు భారతదేశంలోని ఏ గ్రామంలేదా పట్టణం నుంచి వలస వెళ్ళినదీవారు నివాసం ఏర్పరుచుకున్న ప్రాంతాల వివరాలువారి ఆచార్య వ్యవహారాల అధ్యయనంప్రపంచ స్థాయి ర్మితియా సదస్సుల ఏర్పాటు – ఈ దిశగా మేం కృషి చేస్తున్నాంఈ ప్రయత్నాలు ట్రినిడాడ్టొబాగోల్లోని మా సోదర సోదరీమణులకు కూడా ప్రయోజనం కలిగిస్తుంది.    

ట్రినిడాడ్టొబాగోలోని ఆరో తరం ప్రవాస భారతీయులకు ఓసీఐ కార్డులను ఇవ్వగలమని తెలియజేయడం నాకెంతో సంతోషాన్ని కలిగిస్తోందిభారత్ తో మీ సంబంధం రక్తబంధానికీపేర్లుఇంటిపేర్లకు  మాత్రమే పరిమితం కాదు – మీరు నేరుగా దేశంతో అనుబంధం కలవారుభారత్ మీవంక చూస్తోంది.. మిమ్మల్ని ఆహ్వానిస్తోందిమిమ్మల్ని సొంత మనుషులను చేసుకోవాలని ఆకాంక్షిస్తోంది.

మిత్రులారా!
ప్రధానమంత్రి కమ్లా గారి పూర్వీకులు బీహార్ లోని బక్సర్ కు చెందిన వారు.. ఆమె స్వయంగా ఆ ప్రాంతాన్ని సందర్శించారుస్థానికులు ఆమెని బీహార్ కీ బేటీ అని భావిస్తారు.
ఇక్కడ ఉన్న అనేకుల పూర్వీకులు కూడా బీహార్ కి చెందినవారేబీహార్ ఘన వారసత్వం భారత్ కే కాకప్రపంచానికి కూడా గర్వకారణమే.  ప్రజాస్వామ్యంరాజనీతికుటిలనీతిఉన్నత విద్య – అంశం ఏదైనాబీహార్ అనేక శతాబ్దాల కిందటే ప్రపంచానికి నూతన మార్గాన్ని చూపింది. 21వ శతాబ్దపు ప్రపంచానికి కూడా బీహార్ నేల నుంచి తగిన ప్రేరణకొత్త అవకాశాలు లభిస్తాయని నాకు విశ్వాసం ఉంది.

మిత్రులారా!
భారతదేశం అభివృద్ధి చెందుతోందని తెలిసి మీరంతా సంతోషిస్తారని నాకు తెలుసునవీన భారతావనికి ఆకాశమే హద్దుమేం పంపిన చంద్రయాన్ చంద్రుడిపైకి చేరుకుందని తెలిసినప్పుడు మీరంతా హర్షధ్వానాలు చేసి ఉంటారు కదావ్యోమనౌక ల్యాండ్ అయిన ప్రాంతానికి శివశక్తి పాయింట్ అని నామకరణం చేశాం!    

ఈ రంగంలో తాజా వార్త మీ చెవిన పడి ఉంటుంది కదామనం సంభాషించుకునే ఇదే సమయానికి ఒక భారతీయ వ్యోమగామి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో నిర్దేశిత కార్యకలాపాల్లో మునిగి ఉన్నారుతదుపరిగగన్ యాన్ పేరిట మానవ-సహిత మిషన్ అంతరిక్షంలోనికి ప్రయోగించాలని తలపెడుతున్నాంచంద్రుడిపై భారతీయ వ్యోమగామి నడిచే రోజు
... భారత్ సొంత అంతరిక్ష కేంద్రాన్ని కలిగి ఉండటంమరెంతో దూరం లేవు!

ఇప్పుడు మేము తారలని లెక్కించడంతో సంతృప్తి పడటం లేదు. ఆదిత్య మిషన్ రూపంలో చుక్కలకు చేరువగా వెళుతున్నాంఇప్పుడు మేం ‘చందామామా దూర్ కే..’ అని పాడుకోవడంతో సరిపుచ్చుకోవడం లేదుమేము ఆయనకు చేరువవుతున్నాం మరిమా కృషిదీక్షతో అసంభావాలను సంభవాలుగా మార్చివేస్తున్నాం.


 

అయితేఅంతరిక్ష రంగంలో మేం సాధిస్తున్న విజయాలు కేవలం మావే అనుకోకవిజయ ఫలాలను  ప్రపంచమంతటితో పంచుకుంటున్నాం

మిత్రులారా!
అతి వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత్... అతి త్వరలో ప్రపంచ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవిస్తుందిదేశం సాధిస్తున్న ప్రగతి ఫలాలు నిరుపేదలను చేరి వారికి మేలు చేస్తున్నాయి.  

నిరుపేదలను సాధికారులను చేయడం ద్వారాపేదరికాన్ని జయించవచ్చని భారత్ నిరూపించిందిదేశం పేదరికం నుంచి విముక్తి పొందగలదనితొలిసారి కోట్ల ప్రజలకు విశ్వాసం కలిగింది!

గత దశాబ్ద కాలంలో భారత్ 250 మిలియన్ నిరుపేదలకు పేదరికం నుంచి విముక్తి కల్పించిందని ప్రపంచ బ్యాంక్ గుర్తించిందిమా యువత సృజనాత్మకతఉత్సాహాలే మా అభివృద్ధికి కారణాలు..

ఈనాడు అంకుర సంస్థల కేంద్రంగా భారత్ ప్రపంచంలోనే మూడో స్థానంలో ఉందిఈ అంకుర పరిశ్రమల్లో దాదాపు సగం సంస్థలని మహిళా డైరెక్టర్లే నిర్వహిస్తున్నారుఇందులో సుమారు 120 యూనికార్న్ హోదాను పొందాయిఏఐసెమీకండక్టర్క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి పథకాలు ప్రగతి చోదకాలుగా ఉన్నాయినిజానికి సృజనాత్మకత పెద్ద ప్రజా ఉద్యమంగా రూపుదాల్చుతోంది!

భారత్ లో ప్రవేశపెట్టిన యూపీఐ – ‘యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేజ్’ వ్యవస్థడిజిటల్ చెల్లింపులను సమూలంగా మార్చివేసిందిప్రపంచ ప్రత్యక్ష డిజిటల్ లావాదేవీల్లో దాదాపు సగం లావాదేవీలు మా దేశంలోనే జరుగుతున్నాయిఈ ప్రాంతంలో యూపీఐను ఆమోదించి అమలు చేస్తున్న తొలి దేశమైన ట్రినిడాడ్ అండ్ టొబాగోకి అభినందనలు తెలియజేస్తున్నానుఇప్పుడు డబ్బు పంపడంశుభోదయం మెసేజ్ పంపినంత సులభంవెస్ట్ ఇండీస్ బౌలింగ్ కంటే మెరుపు వేగంతో లావాదేవీ పూర్తవుతుందని హామీ ఇస్తున్నాను!


మిత్రులారా!

దేశాన్ని తయారీ కేంద్రంగా తీర్చిదిద్దాలని మిషన్ మ్యానుఫ్యాక్చరింగ్ భావిస్తోంది.. ప్రపంచ రెండో అతిపెద్ద మొబైల్ ఉత్పత్తిదారులం మేమేప్రపంచానికి రైల్వే ఇంజన్లను కూడా మేం అందిస్తున్నాం!


 

గత దశాబ్దంలో మా రక్షణ ఎగుమతులు 20 రెట్లు పెరిగాయిమాకోసం మేం తయారు చేసుకోవడానికే పరిమితమవకప్రపంచం కోసం మేం ఉత్పత్తి చేస్తున్నాం. మేం వృద్ధి చెందుతూప్రపంచానికి కూడా మా పని ద్వారా మేలు జరగేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం!

మిత్రులారా!

నేటి భారతం పుష్కలమైన అవకాశాలకు ఆలవాలంవ్యాపారంపర్యాటకంవిద్యఆరోగ్య సంరక్షణ – అవసరం ఏదైనాభారత్ అన్నీ అందించగలదు!

మీ పెద్దలు ఎంతో శ్రమకోర్చి... 100 రోజులపాటు సప్త సముద్రాలను దాటి ఇక్కడికి వచ్చారుసాత్ సముందర్ పార్ఈ రోజున ప్రయాణ సమయం కొన్ని గంటలకు తగ్గిపోయిందిదేశాన్ని సోషల్ మీడియా ద్వారానే కాకప్రత్యక్షంగా సందర్శించమని మిమ్మల్ని కోరుతున్నాను!

మీ పూర్వీకుల గ్రామాలను సందర్శించండి.. వారు నడిచిన నేలపై పాదం మోపండిమీ పిల్లలుఇరుగుపొరుగులను మీతో తీసుకుని రావడం మరువకండిచిక్కని చాయ్చక్కని కథలను ఆస్వాదించే ఎవరినైనా మీ వెంట రమ్మనవచ్చుమీ అందరినీ చేతులు చాచి ఆత్మీయంగా ఆహ్వానిస్తున్నాం.. జీలేబీలు సిద్ధం!

నాపై కురిపించిన ఆత్మీయతప్రేమకు మరొక్కమారు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

ఈ దేశ అత్యున్నత పురస్కారంతో నన్ను సన్మానించినందుకు ప్రధానమంత్రి కమ్లా ప్రెసాద్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు!
అనేకానేక ధన్యవాదాలునమస్కారంసీతా రామ్జై శ్రీరామ్!

 

***


(Release ID: 2142770)