రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

‘సెకెండ్ బేసిక్ హాక్ కన్వర్షన్’ కోర్సు పూర్తయిన సందర్భంగా వింగింగ్ ఉత్సవం

Posted On: 04 JUL 2025 12:23PM by PIB Hyderabad

విశాఖపట్నం ఐఎన్ఎస్ డేగాలో ‘సెకెండ్ బేసిక్ హాక్ కన్వర్షన్’ పట్టభద్రుల కోర్సుని విజయవంతంగా పూర్తి చేసిన వారి కోసం పట్టా ప్రదానం చేసే వింగింగ్ వేడుక నిర్వహించారుజులై 3న జరిగిన ఈ కార్యక్రమంలో లెఫ్టినెంట్ అతుల్ కుమార్ ధుల్సబ్ లెఫ్టినెంట్ ఆస్థా పూనియాలు ప్రతిష్ఠాత్మక ‘వింగ్స్ ఆఫ్ గోల్డ్’ పురస్కారాన్ని రియర్ అడ్మిరల్ జనక్ బెవ్లీఏసీఎన్ఎస్ (ఎయిర్చేతుల నుంచి అందుకున్నారుసబ్ లెఫ్టినెంట్ ఆస్థా పూనియా నావికాదళ వాయుసేవా విభాగంలోని ఫైటర్ శాఖలో చేరిన తొలి మహిళ కావడం విశేషంయుద్ధ విభాగానికి ఆమె ఎంపికమహిళలు ఎదుర్కొనే అడ్డంకులను ఛేదించిసరకొత్త బాటను నిర్మించే సందర్భమని భావిస్తున్నారు.  

భారత నావికాదళం ఇప్పటికే మహిళా ఆఫీసర్లను పైలెట్లుగానేవల్ ఎయిర్ ఆపరేషన్స్ అధికారిణులుగా నియమించిందివీరు ఎంఆర్ విమానాల్లోహెలికాప్టర్ లలో విధులు నిర్వర్తిస్తున్నారుఇక ఫైటర్ స్ట్రీమ్ ప్రత్యేక విభాగానికి సబ్ లెఫ్టినెంట్ ఆస్థా పూనియా ఎంపిక నారీ శక్తి కార్యక్రమానికి అనుగుణంగానౌకాదళ ఏవియేషన్ రంగంలో మహిళలకు సమానావకాశాల కల్పించే దిశగా పడిన ముందడుగని భావిస్తున్నారు.

 

***


(Release ID: 2142285) Visitor Counter : 2