రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

దేశీయ కేటగిరీ (ఐడీడీఎం) కింద దాదాపు రూ.1.05 లక్షల కోట్ల విలువైన 10 కీలక కొనుగోళ్ల ప్రతిపాదనలకు ‘డీఏసీ’ ఆమోదం

Posted On: 03 JUL 2025 5:07PM by PIB Hyderabad

రక్షణశాఖ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన ఇవాళ (జూలై  3న) రక్షణ కొనుగోళ్ల మండలి (డీఏసీ) సమావేశమైంది. ఈ సందర్భంగా స్వదేశీ వనరుల ద్వారా సైనిక అవసరాలకు ఆమోదం (ఏఓఎన్‌) కింద దాదాపు రూ.1.05 లక్షల కోట్ల విలువైన 10 కీలక కొనుగోళ్ల ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. ఈ మేరకు “ఆర్మర్డ్ రికవరీ వాహనాలు, ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ సిస్టమ్, త్రివిధ దళాల కోసం ఇంటిగ్రేటెడ్ కామన్ ఇన్వెంటరీ మేనేజ్‌మెంట్ సిస్టమ్, సర్ఫేస్-టు-ఎయిర్ క్షిపణుల” కొనుగోళ్లకు ‘ఏఓఎన్‌’లకు ‘డీఏసీ’ అంగీకారం తెలిపింది. ఈ కొనుగోళ్లతో సాయుధ దళాలకు అధిక చలనశీలత, సమర్థ గగనతల రక్షణ, మెరుగైన సరఫరా వ్యవస్థల నిర్వహణ, సిబ్బంది కార్యాచరణ సంసిద్ధత మరింత మెరుగుపడతాయి.

ఇవే కాకుండా “మూర్డ్ మైన్స్, మైన్ కౌంటర్ మెజర్ వెసల్స్, సూపర్ రాపిడ్ గన్ మౌంట్, సబ్‌ మెర్సిబుల్ అటానమస్ వెసల్స్” కొనుగోళ్లకూ ఆమోదముద్ర పడింది. ఈ కొనుగోళ్లతో నావికాదళ, వ్యాపార నౌకలకు ఎదురయ్యే ముప్పులను తగ్గించే వీలు కలుగుతుంది. స్వదేశీ డిజైన్, అభివృద్ధిని మరింత ప్రోత్సహించడంలో భాగంగా (భారతీయ-స్వదేశీ ప్రణాళిక, రూపకల్పన, తయారీ ద్వారా) ఆయుధ పరికరాలు రూపొందించే కేటగిరీ కింద ‘ఏఓఎన్‌’లకు మండలి ఆమోదం తెలిపింది.

 

****


(Release ID: 2141945) Visitor Counter : 3
Read this release in: English , Urdu , Hindi , Marathi