భారత ఎన్నికల సంఘం
azadi ka amrit mahotsav

బీహార్: ఎలక్షన్ కమిషన్ వెబ్ సైట్ లో సవరించిన 2003 ఓటర్ల జాబితా


ఎటువంటి పత్రాలు సమర్పించనవసరం లేని ఓటర్ల సంఖ్య 4.96 కోట్లు
ఈ 4.96 కోట్ల ఓటర్ల సంతానం, తమ తల్లిదండ్రులకు సంబంధించి ఎటువంటి పత్రాలను సమర్పించనవసరం లేదు

Posted On: 30 JUN 2025 2:10PM by PIB Hyderabad

1. బీహార్ రాష్ట్రానికి చెందిన 4.96 కోట్ల ఓటర్ల తాజా 2003 బీహార్ ఓటర్ల జాబితాను ఎన్నికల కమిషన్ https://voters.eci.gov.in వెబ్ సైట్ లో ఉంచింది.

2.         జూన్ 24, 2025 నాటి ఎన్నికల కమిషన్ సూచనల్లోని పేరా 5లో...  సీఈఓడీఈఓఈఆర్ఓలు 01.01.2003 అర్హత తేదీతో కూడిన ఓటర్ల జాబితాను అన్ని బూత్ స్థాయి అధికారులకు (బీఎల్ఓ లకుహార్డ్ కాపీ తరహాలో ఉచితంగా అందుబాటులో ఉంచాలని.. అదే విధంగా ఎవరైనా తమ ఎన్యూమరేషన్ ఫారాన్ని సమర్పించేటప్పుడు సాక్ష్యంగా ఈ పత్రాన్ని డౌన్‌లోడ్ చేసుకుని ఉపయోగించుకునే వీలు కల్పిస్తూవెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచాలని తెలియజేస్తోంది.

3.         2003 ఓటర్ల జాబితా అందుబాటులో ఉండటం వల్లబీహార్‌లో కొనసాగుతున్న ప్రత్యేక జాబితా సవరణ కార్యక్రమం (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్-ఎస్ఐఆర్సులభతరం కానుందిమొత్తం ఓటర్లలో దాదాపు 60 శాతం మంది ఎటువంటి పత్రాలను సమర్పించాల్సిన అవసరం లేదువారు 2003 ఈఆర్ఓటర్ల జాబితాలో గల తమ వివరాలను ధ్రువీకరించుకునిపూర్తి చేసిన ఎన్యూమరేషన్ ఫారాన్ని సమర్పిస్తే సరిపోతుందిఓటర్లుబీఎల్ఓలు.. ఇద్దరూ ఈ వివరాలను సులభంగా పొందగలుగుతారు.

4.        ఇక సూచనల మేర, 2003 బీహార్ ఓటర్ల జాబితాలో పేరు లేని ఎవరైనా వారి తల్లి లేదా తండ్రికి సంబంధించిన ఇతర పత్రాలను సమర్పించే బదులు 2003 ఓటర్ల జాబితాలోని సంబంధిత భాగాన్ని ఉటంకించవచ్చుఇటువంటి  సందర్భాల్లో వారి తల్లి లేదా తండ్రికి సంబంధించి ఏ ఇతర కాగితాలనీ సమర్పించనక్కరలేదు. 2003 ఈఆర్ లోని  సంబంధిత వివరాలు సరిపోతాయివీరు పూర్తి చేసిన ఎన్యూమరేషన్  ఫారంతో పాటు తమకు సంబంధించిన పత్రాలను మాత్రమే సమర్పిస్తే సరిపోతుంది.

5.         ప్రతి ఎన్నికలకు ముందు, 1950 ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 21(2) (), 1960 ఓటర్ల నమోదు నియమాలలోని 25వ నిబంధన ప్రకారం ఓటర్ల జాబితాను సవరించడం తప్పనిసరిఎన్నికల కమిషన్ గత 75 ఏళ్ళుగా లోతైనసమగ్ర సవరణలనుసంక్షిప్త సవరణలనువార్షిక ప్రాతిపదికన నిర్వహిస్తోంది.

6.         మరణాలు... వృత్తివిద్యవివాహ కారణాల రీత్యా జరిగే వలసలు... 18 ఏళ్లు నిండిన కొత్త ఓటర్ల చేరిక వంటి వివిధ కారణాల వల్ల ఓటర్ల జాబితా ఎప్పటికప్పుడు మారుతూ ఉండటం వల్ల ఇటువంటి సవరణలు అవసరమవుతాయి.

7.         18 ఏళ్ళకు పైబడ్డ భారతీయ పౌరులుఆయా నియోజకవర్గాల్లో నివసించే ఇతర సాధారణ నివాసితులు మాత్రమే ఓటరుగా నమోదు చేసుకోవడానికి అర్హులని రాజ్యాంగంలోని ఆర్టికల్ 326 స్పష్టంగా తెలియజేస్తోంది

 

***


(Release ID: 2140850)