జాతీయ మానవ హక్కుల కమిషన్
azadi ka amrit mahotsav

ఆంధ్రప్రదేశ్‌‌‌లోని అనకాపల్లి జిల్లాలో ఉన్న ఫార్మా కంపెనీ వ్యర్థాల శుద్ధి కేంద్రంలో విష వాయువు పీల్చి ఇద్దరు మరణించడం, మరొకరికి గాయాలైనట్లు వచ్చిన వార్తా కథనాలను సుమోటోగా తీసుకున్న జాతీయ మానవ హక్కుల కమిషన్


ఈ సంఘటనపై రెండు వారాల్లోగా వివరణాత్మక నివేదిక ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, అనకాపల్లి పోలీసు సూపరింటెండెంట్‌కు నోటీసులు

గాయపడిన వారి ఆరోగ్య పరిస్థితి.. వారితో పాటు మృతుల కుటుంబాలకు పరిహారం ఇచ్చినట్లయితే దాని వివరాలతో సహా నివేదిక ఇవ్వాలని ఆదేశం

प्रविष्टि तिथि: 24 JUN 2025 12:01PM by PIB Hyderabad

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం అనకాపల్లి జిల్లాలోని ఒక ఫార్మా కంపెనీకి చెందిన వ్యర్థాల శుద్ధి కర్మాగారంలో 2025 జూన్ 11న రాత్రిపూట విధులు నిర్వహిస్తున్న సమయంలో విష వాయువు పీల్చి ఇద్దరు ఉద్యోగులు మరణించారనిమరొకరు ఆసుపత్రి పాలయ్యారని మీడియాలో వచ్చిన కథనాలను జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్ఆర్‌సీసుమోటోగా తీసుకుందివ్యర్థాల శుద్ధి ప్రక్రియలో విషవాయువు వెలువడిదానిని పీల్చుకోవటం వల్ల బాధితులు కుప్పకూలి ఉండవచ్చన్న సారంశంతో ఈ కథనాలు వెలువడ్డాయి

ఈ కథనాల్లో తెలిపిన విషయాలు నిజమైతే బాధితులకు సంబంధించి మానవ హక్కుల ఉల్లంఘన లాంటి తీవ్రమైన సమస్యను ఇది లేవనెత్తుతోందని కమిషన్ భావిస్తోందిఈ సంఘటనపై రెండు వారాల్లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిఅనకాపల్లి పోలీసు సూపరింటెండెంట్‌కు కమిషన్ నోటీసులు జారీ చేసింది

వార్తా కథనాల ప్రకారం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి ఆరోగ్య పరిస్థితి.. వారితో పాటు చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు పరహరం ఇచ్చినట్లయితే దాని వివరాలతో పాటు ఇతర సమాచారం ఇవ్వాలంటూ కమిషన్ ఆదేశించింది.

 

***


(रिलीज़ आईडी: 2139329) आगंतुक पटल : 18
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Gujarati , Tamil