లోక్‌సభ సచివాలయం
azadi ka amrit mahotsav

యోగా ప్రభావాన్ని తేటతెల్లం చేసిన ప్రపంచవ్యాప్త శాస్త్రీయ అధ్యయనాలు, పరిశోధనలు: లోక్‌సభ స్పీకర్


· యోగాను ప్రజలు జీవితాల్లో భాగం చేసుకోవాలి, సానుకూల మార్పులను నలుగురితో పంచుకోవాలి.. అది అందరికీ ప్రేరణనిస్తుంది

· సమర్థతను, ఆత్మవిశ్వాసాన్నీ, లక్ష్యం దిశగా స్పష్టతను అందించే సాధనంగా... యోగాను స్వీకరించాలంటూ యువతకు పిలుపు

· శరీరం, మనస్సు, ఆత్మలను అనుసంధానించే శక్తిమంతమైన సాధనం... యోగా

· మెరుగైన ఆరోగ్యం, మానసిక ప్రశాంతత కోసం అనేక దేశాల్లో ప్రజలు యోగాను తమ జీవితాల్లో భాగం చేసుకున్నారు: స్పీకర్

· పార్లమెంటు ప్రాంగణంలో లోక్‌సభ స్పీకర్ నేతృత్వంలో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం

Posted On: 21 JUN 2025 12:31PM by PIB Hyderabad

లోక్‌సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లా నేతృత్వంలో ఈరోజు 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. పార్లమెంటు ఆవరణలో జరిగిన ఈ కార్యక్రమానికి ఎంపీలూమాజీ సభ్యులులోకసభరాజ్యసభ సచివాలయాల ఉద్యోగులు ఇతరులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా శ్రీ బిర్లా మాట్లాడుతూ శరీరంమనస్సుఆత్మల మధ్య అనుసంధానాన్ని సాధించడానికి యోగా ఓ శక్తిమంతమైన సాధనంగా పనిచేస్తుందని పేర్కొన్నారుమనిషి సమగ్రాభివృద్ధిలో ఇది కీలక పాత్ర పోషిస్తుందన్నారుయోగా కేవలం ఓ వ్యాయామం మాత్రమే కాదనిఇది వ్యక్తులకు బలాన్నిప్రశాంతతనుఆధ్యాత్మిక శక్తితో సాధికారతను అందించే సమగ్ర జీవన విధానమని ఆయన వ్యాఖ్యానించారు.

యోగాను ప్రజలు జీవితాల్లో భాగం చేసుకునిఅది తమలో కలిగించిన సానుకూల మార్పులను అందరితో పంచుకోవాలని శ్రీ బిర్లా కోరారుయోగా సానుకూల శక్తిని తెలుసుకునేలా ఇది ఇతరులకు స్ఫూర్తిగా నిలుస్తుందన్నారుముఖ్యంగా యువత సామర్థ్యంఆత్మవిశ్వాసంలక్ష్యం పట్ల స్పష్టతను పెంపొందించుకునే మార్గంగా యోగాను స్వీకరించాలని ఆయన పిలుపునిచ్చారు.

యోగా దినోత్సవాన్ని భారత్‌లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్నారని శ్రీ బిర్లా పేర్కొన్నారుప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో లక్షలాదిగా ప్రజలు యోగా కార్యక్రమాల్లో భాగస్వాములవుతూఈ పురాతన సంప్రదాయ స్ఫూర్తిని అందిపుచ్చుకుంటున్నారని ఆయన అన్నారు.

భారత పురాతనప్రశస్తమైన ఆచరణల్లో ఒకటైన యోగాకు నేటి ఆధునికశాస్త్రీయ యుగంలోనూ అమితమైన ప్రాధాన్యం ఉందన్నారుమన శారీరకమానసిక ఆరోగ్యంపై యోగా సానుకూల ప్రభావాన్ని చూపుతుందన్న విషయం ప్రపంచవ్యాప్తంగా అనేక శాస్త్రీయ అధ్యయనాలుపరిశోధనల్లో స్పష్టమైందని ఆయన తెలిపారుఒత్తిడిని అధిగమించడానికిఅంతర్గత శక్తిని పెంపొందించుకోవడానికిశక్తిని నిర్మాణాత్మకంగాశాంతియుతంగా వినియోగించుకోవడానికి యోగా దోహదపడుతుందనన్నారుఏకాగ్రతనుపని సామర్థ్యాన్ని పెంచడంతోపాటు ఆరోగ్యకరమైనసమతౌల్యంతో కూడిన జీవనశైలిని యోగా ప్రోత్సహిస్తుందని పేర్కొన్నారు.

మెరుగైన ఆరోగ్యంమానసిక ప్రశాంతత కోసం అనేక దేశాల్లో ప్రజలు యోగాను తమ దినచర్యలో భాగంగా చేసుకోవడం హర్షణీయమన్నారుఆరోగ్యకరమైనమరింత శాంతియుతమైన ప్రపంచం దిశగా అన్ని సంస్కృతుల ప్రజలను యోగా ఇకముందు కూడా ఏకం చేస్తూ ఉంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

బ్రహ్మకుమారీలు భారతీయుల జీవనాన్ని మెరుగుపరచడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా శాంతి సందేశాన్ని అందించారులోక్‌సభ స్పీకర్

11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా లోక్‌సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లా నేతృత్వంలో ఎర్రకోట ప్రాంగణంలో బ్రహ్మకుమారీలు ఈరోజు సామూహిక యోగాభ్యాసాలు చేశారుఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూరాజయోగాజ్ఞానయోగా ద్వారా శాంతినిఆరోగ్యాన్ని పెంపొందించడానికి బ్రహ్మ కుమారీ సంస్థ చేస్తున్న అమూల్యమైన కృషిని అభినందించారుఈ సంస్థ భారతీయుల జీవితాలను ప్రభావితం చేయడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా శాంతి సందేశాన్ని వ్యాప్తి చేసిందని ప్రశంసించారుప్రజలు ఒత్తిడిఆందోళనలను అధిగమించడంతోపాటు అంతర్గత శాంతిని పొందడంలో ఇది సహాయపడుతుందన్నారు.

ఇటీవలి తన బ్రెజిల్‌ పర్యటనను గుర్తుచేసుకుంటూబ్రహ్మ కుమారీల కృషి అంతర్జాతీయ సంబంధాలను బలోపేతం చేసిందనిప్రపంచవ్యాప్తంగా ప్రజల్లో సానుకూల ప్రభావాన్ని వారు కలిగించారని శ్రీ బిర్లా పేర్కొన్నారుభారతీయ విలువలు మూలాలుగా ఉన్న ఓ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు ప్రేరణగా నిలుస్తూఅర్థవంతమైన పరివర్తన దిశగా నడిపిస్తుండటం గర్వకారణమని ఆయన వ్యాఖ్యానించారు.  

 

***


(Release ID: 2138404) Visitor Counter : 3