బొగ్గు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్‌స్‌ రెండు రోజుల పర్యటనను ప్రారంభించిన కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి

నాడు పోస్టు చేయడమైనది: 20 JUN 2025 4:35PM by PIB Hyderabad

కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి శ్రీ జికిషన్ రెడ్డి ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్‌స్ లిమిటెడ్ (ఈసీఎల్)ను రెండు రోజలపాటు సందర్శిస్తారుఈ నెల 20, 21 తేదీల్లో మంత్రి తన పర్యటన కాలంలో ఝాంఝ్‌రా భూగర్భ గనితో పాటు సోనేపుర్ బాజారీ ఓసీపీలో కార్యకలాపాలను సమీక్షించనున్నారుఇటీవల విజయవంతంగా ముగిసిన ‘ఆపరేషన్ సిందూర్’కు గుర్తుగా ‘సిందూర్ పార్కు’ అని పేరు పెట్టిన ఝాంఝ్‌రాలోని ఇకో పార్కును ప్రారంభిస్తారుఇకో పార్కులో ఘనంగా నిర్వహించనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవం- 2025లో మంత్రి పాల్గొంటారుకొత్తగా నిర్మించిన మహుదాంగా పునరావాస నిలయాన్ని కూడా మంత్రి ప్రారంభించనున్నారు.

 

దీనికి అదనంగాస్థానిక ప్రజలకు మద్దతు తెలుపుతూ ఎన్‌సీడబ్ల్యూ మార్గదర్శకాలకు అనుగుణంగా చేపట్టే కారుణ్య నియామకాలలో భాగంగా అభ్యర్థులకు నియామక పత్రాలను శ్రీ కిషన్ రెడ్డి పంపిణీ చేయనున్నారుఈసీఎల్‌లో సోనేపుర్ బాజారీ ఏరియాలోని ఆర్ఎన్ కాలనీలో నిర్వహించే ఒక కార్యక్రమంలో దివ్యాంగజనులకు మూడు చక్రాల సైకిళ్లను అందజేస్తారు.

కార్యక్రమాల్లో భాగంగాశ్రీ కిషన్ రెడ్డి గనుల తవ్వకం అనుబంధ విస్తారిత వ్యవస్థలో వివిధ ఆసక్తిదారులందరితో ముఖాముఖి సమావేశాలు నిర్వహిస్తారుసంస్థకు ముఖ్య విజయాలను సాధించిపెట్టడంలో కీలక పాత్రను పోషించిన బొగ్గు గని కార్మికులతో కూడా ఆయన మాట్లాడతారుప్రాజెక్టు వల్ల ప్రభావితులైన వారి (పీఏపీస్)ని కలుసుకోవడానికి పునరావాసంపునఃపరిష్కార (ఆర్ అండ్ ఆర్స్థలాలను కూడా ఆయన సందర్శించనున్నారువిశేష పనితీరును కనబరచిన ఉద్యోగులను ఆయన సత్కరిస్తారు.

 

***


(రిలీజ్ ఐడి: 2138203) సందర్శకుల సూచీ సంఖ్య : : 12
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Bengali , Tamil