సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

అశక్తత, అంగవైకల్యం కారణంగా విధుల నుంచి తొలగించిన.. విధుల్లో ఉన్న కాలంలో మరణించిన ఉద్యోగులకు యూపీఎస్‌పై ఓఎమ్ జారీ చేసిన పింఛన్లు, పింఛనుదారుల సంక్షేమ శాఖ

నాడు పోస్టు చేయడమైనది: 18 JUN 2025 7:09PM by PIB Hyderabad

ఏకీకృత పెన్షన్ పథకాన్ని (యూపీఎస్) ఎంచుకున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు.. అశక్తత, వైకల్యం కారణంగా ప్రభుత్వ విధుల నుంచి తొలగించిన, విధుల్లో ఉన్న కాలంలో మరణించిన సందర్భాల్లో ఓపీఎస్ కింద ప్రయోజనాలను పొందే ఎంపికల కోసం సూచనలు.

ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఆర్థిక సేవల విభాగం జనవరి 24న జారీ చేసిన నోటిఫికేషన్ నెం. FS-1/3/2023-PR ద్వారా.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఎన్‌పీఎస్ కింద ఏకీకృత పెన్షన్ పథకాన్ని (యూపీఎస్) ఎంచుకునే ఒక ఎంపికను అందుబాటులో ఉంచుతున్నట్లు తెలియజేసింది. జాతీయ పెన్షన్ విధానం (ఎన్‌పీఎస్) కింద గల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఏకీకృత పెన్షన్ పథకంలో చేరేందుకు ఒకేసారి అవకాశం కల్పించే ఈ నిర్ణయం ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమలులోకి వచ్చింది.

పైన పేర్కొన్న నిర్ణయాలకు అనుగుణంగా.. విధుల్లో ఉన్న కాలంలో మరణించిన లేదా అశక్తత, అంగవైకల్యం కారణంగా విధుల నుంచి తొలగించిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, సీసీఎస్ (పింఛను) నియమాలు-2021 లేదా సీసీఎస్ (అసాధారణ ఫించను) నియమాలు-2023 నిబంధనల ప్రకారం  పాత పింఛను పథకం ప్రయోజనాలను పొందే అవకాశాన్ని ఏకీకృత పెన్షన్ పథకం (యూపీఎస్) కింద ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు విస్తరిస్తూ పింఛను, పింఛనుదారుల సంక్షేమ శాఖ ఈరోజు ఓఎమ్ నంబరు 57/01/2025-P&PW(B)/UPS/10498 ద్వారా సూచనలు జారీ చేసింది.

యూపీఎస్‌ను ఎంచుకున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పైన పేర్కొన్న సంఘటనల సందర్భంలో, ఓపీఎస్ ప్రయోజనాలను పొందడం కోసం సంబంధిత ఆఫీస్ మెమోరాండం జత చేస్తూ, సూచించిన ఫారమ్‌ ద్వారా వారి మంత్రిత్వ శాఖకు లేదా విభాగానికి దరఖాస్తు చేసుకోవాలి.

 

***


(రిలీజ్ ఐడి: 2137496) సందర్శకుల సూచీ సంఖ్య : : 34
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी