యు పి ఎస్ సి
azadi ka amrit mahotsav

సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష 2025 ఫలితాలను ప్రకటించిన యూపీఎస్సీ

Posted On: 11 JUN 2025 7:18PM by PIB Hyderabad

25/05/2025 న నిర్వహించిన సివిల్ సర్వీసెస్ (ప్రిలిమినరీపరీక్ష, 2025 ఫలితాల ఆధారంగాఈ క్రింది రోల్ నంబర్లు ఉన్న అభ్యర్థులు సివిల్ సర్వీసెస్ (మెయిన్పరీక్ష-2025 కు అర్హత సాధించారు.

ఈ అభ్యర్థుల అభ్యర్థిత్వం తాత్కాలికంపరీక్ష నిబంధనలకు అనుగుణంగాఅర్హత సాధించిన అభ్యర్థులందరూ ఈ కింద పేర్కొన్న వివరాలను అందించడానికి నవీకరించడానికి వెబ్ సైటులో ఒక విండోను ఉంచుతున్నారు.

(సివిల్ సర్వీసెస్ (మెయిన్పరీక్ష, 2025 కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు రూ.200 ఫీజు చెల్లించాలిఅయితేఈ ఫీజు నుంచి మహిళా అభ్యర్థులుదివ్యాంగులుఎస్సీఎస్టీ అభ్యర్థులను మినహాయించారు

(బిమెయిన్ పరీక్ష కోసం స్క్రయిబ్ వివరాలుసహాయక పరికరాలుపెద్ద అక్షరాల్లో ప్రశ్నాపత్రం  కోరేవారు తమ వివరాలను సమర్పించాలి లేదా నవీకరించాలి.

(సిమెట్రిక్యులేషన్ (10వ తరగతితర్వాత పేరు మార్చుకున్న అభ్యర్థులు లేదా మెట్రిక్యులేషన్ లేదా పై విద్యా ప్రమాణ పత్రాలలో ఉన్న పేరుకుసిఎస్ఇ - 2025 ఆన్ లైన్ దరఖాస్తులో ఇచ్చిన పేరుకూ మధ్య తేడా ఉన్న అభ్యర్థులు గెజెట్ నోటిఫికేషన్ ను సమర్పించాలి.

ఈ వివరాలను నింపడానికిసమర్పించడానికి 2025 జూన్ 16 నుంచి 25 వరకు కమిషన్ వెబ్ సైటులో విండో అందుబాటులో ఉంటుంది.

7004555, 6305469, 6413314, 6610122 రోల్ నంబర్లతో కూడిన నలుగురు అభ్యర్థుల ఫలితాలను ప్రస్తుత కోర్టు కేసుల్లో తుది తీర్పు వచ్చే వరకు నిలుపుదల చేశారు.

సీఎస్ (పిఎగ్జామినేషన్, 2025 మార్కులుకటాఫ్ మార్కులు,  ఆన్సర్ కీలను సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్, 2025,  ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామినేషన్, 2025 ప్రక్రియ ముగిసిన తర్వాత అంటే తుది ఫలితాల ప్రకటన తర్వాత మాత్రమే కమిషన్ వెబ్ సైట్లో  https://upsc.gov.in లో అప్ లోడ్ చేస్తారు

న్యూఢిల్లీ షాజహాన్ రోడ్ లోని ధోల్ పూర్ హౌస్ ఆవరణలో ఉన్న యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామినేషన్ హాల్ బిల్డింగ్ సమీపంలో ఫెసిలిటేషన్ కౌంటర్ ఉందిఅభ్యర్థులు పైన పేర్కొన్న పరీక్ష ఫలితాలకు సంబంధించి ఏదైనా సమాచారం/వివరణ కోసం ఉదయం 10.00 గంటల నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు వ్యక్తిగతంగా లేదా ఫోన్ నంబర్ 011-23385271, 011-23098543 లేదా 011-23381125 ద్వారా ఫెసిలిటేషన్ కౌంటర్ ను సంప్రదించవచ్చు

Click here for pdf file.

 

***


(Release ID: 2135850) Visitor Counter : 2