ప్రధాన మంత్రి కార్యాలయం
భగవాన్ బిర్సా ముండాకు ప్రధానమంత్రి నివాళి
प्रविष्टि तिथि:
09 JUN 2025 1:29PM by PIB Hyderabad
స్వాతంత్య్ర సంగ్రామంలో మహానాయకుడు భగవాన్ బిర్సా ముండా జీ అమరుడైన రోజు ఈ రోజు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు నివాళులు అర్పించారు.
భగవాన్ బిర్సా ముండా తన జీవనాన్ని గిరిజన సోదరులు, సోదరీమణుల సంక్షేమం కోసం, వారి హక్కుల రక్షణ కోసం అంకితం చేశారని ప్రధానమంత్రి అన్నారు. ఆయన త్యాగం, భక్తి దేశ ప్రజలకు సదా ప్రేరణనిస్తూ ఉంటాయని కూడా ప్రధానమంత్రి అన్నారు.
ప్రధానమంత్రి ఎక్స్‌లో ఒక సందేశాన్ని ఇలా పోస్టు చేశారు:
‘‘ స్వాతంత్య్ర సంగ్రామంలో మహానాయకుడు భగవాన్ బిర్సా ముండా జీకి ఆయన బలిదాన దినోత్సవం సందర్భంగా గౌరవపూర్వక శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. ఆదివాసీ సోదరులు, సోదరీమణుల సంక్షేమం కోసం, వారి హక్కుల రక్షణ కోసం ఆయన తన జీవనాన్ని అంకితం చేశారు. ఆయన త్యాగం, భక్తి దేశ ప్రజలకు సదా ప్రేరణనిస్తూ ఉంటాయి.’’
(रिलीज़ आईडी: 2135110)
आगंतुक पटल : 9
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam