బొగ్గు మంత్రిత్వ శాఖ
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటిన కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి
Posted On:
05 JUN 2025 2:46PM by PIB Hyderabad
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి అశోకా రోడ్, 6 లోని తన అధికారిక నివాసం వద్ద మొక్కలు నాటారు. తెలంగాణలోని వివిధ ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వీరంతా ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన పదో తరగతి పరీక్షా ఫలితాల్లో ఉత్తమ ర్యాంకులు సాధించారు. వారి కృషిని గుర్తించిన శ్రీ జి. కిషన్ రెడ్డి ఆధునిక పర్యావరణ యోధులుగా మారాలన్నారు.
పర్యావరణాన్ని మరింత పచ్చగా, మెరుగ్గా తయారు చేసేందుకు క్షేత్ర స్థాయిలో కృషి చేస్తున్న వారిని మంత్రి అభినందించారు. ప్లాస్టిక్ కాలుష్య ప్రభావంపై పెరుగుతున్న శాస్త్రీయ ఆధారాలను తెలియజేయడమే ఈ ఏడాది ప్రపంచ పర్యావరణ దినోత్సవ లక్ష్యం. అలాగే స్వచ్ఛమైన, సుస్థిరమైన భవిష్యత్తును నిర్మించేందుకు ప్లాస్టిక్ వినియోగాన్ని తిరస్కరించడం, తగ్గించడం, పునర్వినియోగం, రీసైకిల్ చేయడం వంటి చర్యలను ప్రోత్సహిస్తుంది. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు బొగ్గు, గనుల మంత్రిత్వ శాఖలు సమష్టి ప్రయత్నాలు చేయాలని మంత్రి సూచించారు.
***
(Release ID: 2134422)