జాతీయ మానవ హక్కుల కమిషన్
azadi ka amrit mahotsav

తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్‌ పోలీసులు శారీరకంగా చిత్రహింస పెట్టిన కారణంగా


ఒక వ్యక్తి చనిపోయినట్లు వచ్చిన వార్తను పరిశీలనకు స్వీకరించిన ఎన్‌హెచ్‌ఆర్‌సీ

తెలంగాణ డీజీపీకి నోటీసు జారీ... రెండు వారాల్లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలంటూ ఆదేశం

प्रविष्टि तिथि: 05 JUN 2025 3:21PM by PIB Hyderabad

తెలంగాణలోని హైదరాబాదులో గత నెల 13వ తేదీన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్‌లో పోలీసులు పెట్టిన శారీరక చిత్రహింస కారణంగా 35 ఏళ్ల ఆటోరిక్షా డ్రయివరు చనిపోయినట్లు ప్రసార మాధ్యమాల్లో వచ్చిన వార్తా కథనాలను భారత జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్‌హెచ్‌ఆర్‌సీతనంత తానుగా పరిశీలనకు స్వీకరించింది.
మీడియాలో పేర్కొన్న విషయాలు వాస్తవమే అయితేబాధిత వ్యక్తికి సంబంధించి మానవ మానవ హక్కుల అంశంలో తీవ్ర ఉల్లంఘన జరిగినట్లుగా భావించాలని కమిషన్ అభిప్రాయపడింది.
ఈ కారణంగాతెలంగాణ పోలీస్ డైరెక్టర్ జనరల్‌కు నోటీసును కమిషన్ జారీ చేసిరెండు వారాల లోపు ఒక సమగ్ర నివేదికను ఇవ్వాలని అడిగింది.

ప్రసార మాధ్యమాల్లో కిందటి నెల 14న వచ్చిన కథనం ప్రకారం... బాధితునికి భార్యతో ఉన్న కొన్ని సమస్యలు కారణంగా అతన్ని ఠాణాకు తీసుకుపోయారుదంపతులకు కౌన్సెలింగ్ ఇచ్చిన అనంతరంబాధితుడిని పోలీసులు ఒక గదిలోకి తీసుకెళ్లిరబ్బరు బెల్టులతో చాలా సేపు కొట్టి గాయపరిచారుఒక గంట తరువాతపోలీస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చివాంతి చేసుకుని అక్కడే కుప్పకూలాడుఆసుపత్రికి తీసుకుపోగాఅప్పటికే అతను చనిపోయినట్లు ప్రకటించారు.  ‌

 

***


(रिलीज़ आईडी: 2134421) आगंतुक पटल : 28
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Tamil