బొగ్గు మంత్రిత్వ శాఖ
సీఎంపీఎఫ్ఓ సీ కేర్స్ వెర్షన్ 2.0ను ప్రారంభించిన కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి
Posted On:
03 JUN 2025 6:04PM by PIB Hyderabad
సెంటర్ ఫర్ డెవలప్ మెంట్ ఆఫ్ అడ్వాన్స్ డ్ కంప్యూటింగ్ (సి-డాక్) అభివృద్ధి చేసి రూపొందించిన సీఎంపీఎఫ్ఓ సీ కేర్స్ వెర్షన్ 2.0 వెబ్ పోర్టల్ ను కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి ఈ రోజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బొగ్గు మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ విక్రమ్ దేవ్ దత్, బొగ్గు మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులు, సీఎంపీఎఫ్ఓ కమిషనర్ పాల్గొన్నారు. బొగ్గు గనుల భవిష్య నిధి సంస్థ (సీఎంపీఎఫ్ఓ) ను బొగ్గు రంగ కార్మికులకు సామాజిక భద్రత కల్పించే ఉద్దేశ్యంతో ప్రావిడెంట్ ఫండ్, పెన్షన్ పథకాలను నిర్వహించడానికి 1948 లో బొగ్గు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థ.గా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం 3.3 లక్షల మంది ప్రావిడెంట్ ఫండ్ చందాదారులకు, 6.3 లక్షల మంది పెన్షనర్లకు ఈ సంస్థ సేవలు అందిస్తోంది.
బొగ్గు కార్మికులను, యాజమాన్యాన్ని, సీఎంపీఎఫ్ఓలను ఒకే డిజిటల్ వేదికపైకి ప్తీసుకురావడం ద్వారా పీఎఫ్ / పెన్షన్ పంపిణీని క్రమబద్ధీకరించే లక్ష్యంతో పోర్టల్ ప్రస్తుత వెర్షన్ ను అభివృద్ధి చేశారు.. ఈ వినియోగదారుని స్నేహపూర్వకమైన వ్యవస్థ పారదర్శకతను పెంచుతుంది, బాధ్యతను నిర్ధారిస్తుంది క్లెయిమ్ ప్రారంభం నుంచి బొగ్గు కార్మికుని ఖాతాకు బకాయిల చెల్లింపు వరకు మద్దతును అందిస్తుంది. ఈ మాడ్యూల్ క్లెయిమ్ లను సరైన సమయంలో ట్రాక్ చేయడానికి అనుమతిస్తుంది, తద్వారా బొగ్గు రంగంలోని కార్మికులకు మరింత సులభంగా, పారదర్శకత, సమర్థతతో సామాజిక భద్రతను అందించాలనే లక్ష్యాన్ని సాధించడంలో దోహదపడుతుంది.
ఈ సందర్భంగా మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి మాట్లాడుతూ, డిజిటల్ ఇండియా ద్వారా 'కనీస ప్రభుత్వం, గరిష్ట పాలన' అనే ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికత దిశగా ఈ పోర్టల్ ఒక ముందడుగు అని అన్నారు. ఈ పోర్టల్ పారదర్శకత, లభ్యత, సౌలభ్యాన్ని పెంపొందిస్తుందని మంత్రి అన్నారు. కార్మికుల నుంచి సూచనలు స్వీకరిస్తూ పోర్టల్ ను అప్ డేట్ గా ఉంచాలని బొగ్గు మంత్రిత్వ శాఖను మంత్రి కోరారు.
బొగ్గు మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ విక్రమ్ దేవ్ దత్ మాట్లాడుతూ, ఈ చొరవ బొగ్గు రంగ కార్మికుల సంక్షేమం పట్ల మంత్రిత్వ శాఖ నిబద్ధతను ప్రతిబింబిస్తుందని అన్నారు. తక్కువ సమయంలో ప్రాజెక్టును పూర్తి చేసినందుకు పోర్టల్ కోసం పనిచేసిన బృందాన్ని బొగ్గు మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి శ్రీమతి రూపిందర్ బ్రార్ అభినందించారు.
సీ కేర్స్ వెర్షన్ 2.0 ప్రారంభం సీఎంపీఎఫ్ఓ డిజిటలైజేషన్ ప్రయాణంలో గణనీయమైన పురోగతిని సూచిస్తుంది, ఇక్కడ కొత్తగా ప్రారంభించిన మాడ్యూల్ ప్రావిడెంట్ ఫండ్ డబ్బు ను, పెన్షన్ సొమ్మును నేరుగా సీఎంపీఎఫ్ఓ సభ్యుల ఖాతాలో జమ చేయడానికి సహాయపడుతుంది. ప్రత్యక్ష ప్రయోజనాల బదిలీ మాడ్యూల్ ను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహకారంతో సీడీఏసీ అభివృద్ధి చేసింది. బొగ్గు కంపెనీ సమర్పించిన డేటా ఆధారంగా సభ్యుడి పీఎఫ్, పెన్షన్ లెడ్జర్లను ఆటోమేటిక్ గా అప్డేట్ చేసే విధంగా ఫైనాన్షియల్ మాడ్యూల్ ను అభివృద్ధి చేశారు. ప్రస్తుతం గోదావరిఖని, కొత్తగూడెం (ఎస్సీసీఎల్) ప్రాంతీయ కార్యాలయం, అసన్సోల్-1 (ఈసీఎల్), ప్రాంతీయ కార్యాలయం బిలాస్పూర్ (ఎస్ఈసీఎల్), ప్రాంతీయ కార్యాలయం నాగ్పూర్ (డబ్ల్యూసీఎల్)లకు ఈ మాడ్యూల్ అందుబాటులో ఉంది. జూలై ఒకటో తేదీ నుంచి మిగిలిన సీఎంపీఎఫ్ఓ ప్రాంతీయ కార్యాలయాలకు విస్తరిస్తారు.
సీ కేర్స్ వెర్షన్ 2.0లో సభ్యుడి కోసం ఒక మొబైల్ అప్లికేషన్ కూడా ఉంది, ఇక్కడ సభ్యుడు తన స్వంత ప్రొఫైల్, ఉద్యోగ ప్రొఫైల్ చూడవచ్చు, క్లెయిమ్ లను ట్రాక్ చేయవచ్చు, ఫిర్యాదులను లేవనెత్తవచ్చు. అతని నవీకరించిన తన పిఎఫ్ బ్యాలెన్స్ ను కూడా వీక్షించవచ్చు. ఈ మొబైల్ యాప్ చాట్-బాట్ సహాయంతో ఉంటుంది. ఇది సభ్యుడు కోరుకున్న సమాచారాన్ని పొందడంలో సహాయపడుతుంది. ఈ మొబైల్ యాప్ సీఎంపీఎఫ్ సభ్యులందరికీ అందుబాటులో ఉంటుంది.
ప్రస్తుత మాడ్యూల్ లో కోల్ కంపెనీ కోసం, సీఎంపీఎఫ్ఓ కోసం ఒక ప్రత్యేక (ప్రిస్క్రిప్టివ్) డ్యాష్ బోర్డ్ కూడా ఉంది, ఇది నిర్దిష్ట ఫార్మాట్ లో కస్టమ్ రిపోర్ట్ లను సృష్టించగలదు. ఇది పిఎఫ్ / పెన్షన్ క్లెయిమ్ సెటిల్మెంట్ ధోరణులను నిర్వచించగలదు. క్లెయిమ్ సెటిల్మెంట్ గణాంకాలను కూడా అందించగలదు, దీని ఆధారంగా పని ప్రక్రియలను మెరుగుపరచడానికి, వేగవంతమైన సేవలందించేందుకు అవసరమైన అంచనాలను రూపొందించవచ్చు.
ఈ ప్రగతిశీల చర్యతో, మంత్రిత్వ శాఖ పారదర్శకత, సామర్థ్య మూలాలను బలోపేతం చేయడమే కాకుండా, దేశవ్యాప్తంగా ప్రతి బొగ్గు కార్మికుని సంక్షేమం, సాధికారత పట్ల తన నిబద్ధతను మరింతగా నిరూపించుకుంది.
***
(Release ID: 2133665)