సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

బ్రెజిల్‌లోని బ్రసీలియాలో జరగనున్న బ్రిక్స్ సాంస్కృతిక మంత్రుల సమావేశం- 2025లో పాల్గొననున్న భారత్


మన దేశం తరఫున హాజరుకానున్న కేంద్ర మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్

Posted On: 24 MAY 2025 9:20PM by PIB Hyderabad

2025 మే 26న బ్రెజిల్‌లోని బ్రసీలియాలో జరగనున్న బ్రిక్స్ సాంస్కృతిక మంత్రుల సమావేశంలో భారత్ పాల్గొననుందికేంద్ర సాంస్కృతికపర్యాటక శాఖ మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ భారత బృందానికి నాయకత్వం వహిస్తూ ఈ ఉన్నత స్థాయి మంత్రుల సమావేశంలో దేశానికి ప్రాతినిధ్యం వహించనున్నారు.

బ్రిక్స్ సాంస్కృతిక మంత్రుల సమావేశం.. సభ్య దేశాలైన బ్రెజిల్రష్యాభారత్చైనాదక్షిణాఫ్రికాల మధ్య పరస్పర అవగాహనసాంస్కృతిక మార్పిడిసహకార కార్యక్రమాలను ప్రోత్సహించేందుకు ముఖ్యమైన వేదికగా ఉందిఈ ఏడాది సమావేశం సాంస్కృతిక సహకారాన్ని పెంపొందించడంసంస్ధల మధ్య భాగస్వామ్యాలను పెంచడం.. బ్రిక్స్ దేశాల గొప్ప సాంస్కృతిత వైవిధ్యాన్ని రక్షించటంప్రోత్సహించే లక్ష్యంతో సంయుక్త సాంస్కృతిక ప్రాజెక్టులను చేపట్టటంపై దృష్టి సారించనుంది.

చర్చల సందర్భంగా భారత సాంస్కృతిక దౌత్యం, వారసత్వ సంపద రక్షణప్రజల మధ్య సాంస్కృతిక మార్పిడికి సంబంధించి భారత్‌కు ఉన్న చిత్తశుద్ధిని మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ప్రధానంగా తెలియజేయనున్నారుఇటీవల చేపట్టిన కార్యక్రమాలతో సహా ప్రపంచ సాంస్కృతిక వైభోగానికి భారత్ ‌చేస్తున్న కృషిని ఆయన ప్రదర్శించనున్నారు. 

ప్రదర్శన కళలుదృశ్య కళలుసాహిత్యంవారసత్వ సంరక్షణసృజనాత్మక పరిశ్రమలు వంటి రంగాల్లో నూతన భాగస్వామ్యాలు ఏర్పాటు చేసుకునేందుకు ఈ సమావేశం అవకాశం అందిస్తుందిబ్రిక్స్ ఫ్రేమ్‌వర్క్ ద్వారా బహుళపక్ష సహాకారంసమ్మిళితత్వంతో కూడిన సాంస్కృతిక వృద్ధికి పాటుపడాలని భారత్ తెలియజేయనుంది

అధికారిక మంత్రిత్వ స్థాయి చర్చలతో పాటు భారత్ ‌బ్రిక్స్ దేశాలతో ద్వైపాక్షిక సమావేశాల్లో పాల్గొననుందిసాంస్కృతిక భాగస్వామ్యాలుమార్పిడి కార్యక్రమాలుభాగస్వామ్యంతో కూడిన వేడుకల గురించి ఈ సందర్భంగా చర్చించనుంది

దృఢమైన సాంస్కృతిక ఫ్రేమ్‌వర్క్సాంస్కృతికపరమైన చర్చలను ప్రోత్సహించేందుకు.. మరింత సమ్మిళితత్వంసామరస్యంతో కూడిన ప్రపంచం కోసం బ్రిక్స్ దేశాలతో కలిసి దగ్గరగా పనిచేసేందుకు భారత్‌ నిబద్ధతతో ఉంది.

 

***


(Release ID: 2131170)
Read this release in: Hindi , English , Marathi , Malayalam