రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కొత్తగా ఆరు వరుసల యాక్సెస్ కంట్రోల్డ్ ఆగ్రా- గ్వాలియర్ ఎక్స్‌ప్రెస్ రహదారిని బీవోటీ (టోల్) విధానంలో నిర్మించనున్న ఎన్‌హెచ్ఏఐ

प्रविष्टि तिथि: 30 APR 2025 7:46PM by PIB Hyderabad

ఆగ్రాగ్వాలియర్‌లలోని పర్యాటక నిలయాలకు రవాణా సదుపాయాలను మెరుగుపరిచేలా.. అంతరాయం లేకుండా అత్యంత వేగంగా వాహనాల రాకపోకలకు అవకాశం కల్పించేలా (యాక్సెస్ కంట్రోల్డ్కొత్తగా 88 కి.మీ పొడవైన వరుసల ఆగ్రా గ్వాలియర్ ఎక్స్‌ప్రెస్ రహదారిని (జాతీయ రహదారి 719 డీజాతీయ రహదారుల ఆధీకృత సంస్థ (ఎన్ హెచ్ఏఐనిర్మించనుందిఎన్‌హెచ్ఏఐ చైర్మన్ శ్రీ సంతోష్ కుమార్ యాదవ్సంస్థ సీనియర్ అధికారులురాయితీదారుల సమక్షంలో మెసర్స్ జీఆర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లిమిటెడ్‌తో ఎన్‌హెచ్ఏఐ ఈ ప్రాజెక్టు అమలు కోసం ఈరోజు అంగీకార ఒప్పందాన్ని కుదుర్చుకుందిఈ ఎక్స్‌ప్రెస్ రహదారి ఆగ్రాలోని డియోరి గ్రామం నుంచి మొదలై గ్వాలియర్‌లోని సుసేరా గ్రామంలో ముగుస్తుందిబిల్డ్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ (టోల్విధానంలో మొత్తం రూ. 4613 కోట్ల మూలధన వ్యయం (ఎల్ఏ వ్యయం సహా)తో ఈ ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తారు.

ఈ కాంట్రాక్టు నిర్దేశిత వ్యవధి (కన్సెషన్ పిరియడ్) 20 సంవత్సరాలునిర్మాణ కాలం 30 నెలలు కూడా ఇందులో భాగంగా ఉంటుందినిర్మాణ సమయంలో రాయితీదారుకు ఎన్‌హెచ్ఏఐ రూ820 కోట్ల నిర్మాణ సాయాన్ని అందిస్తుందిప్రాజెక్టు పురోగతికి అనుగుణంగా దీనిని అందిస్తారుఇప్పుడున్న జాతీయ రహదారి-44కు కప్పు వేయడం/నాణ్యతను పెంపొందించడంరోడ్డు భద్రతమెరుగులు దిద్దే చర్యలను కూడా ఆగ్రా గ్వాలియర్ ప్రాజెక్టు ఒప్పందంలో చేర్చారు.

ఈ ప్రాజెక్టు ప్రీమియాన్ని 2.42%గా అంచనా వేశారుఅయితేరెవెన్యూ షేర్ల రూపంలో కోట్ చేసిన 17.170% ప్రీమియం వద్ద ప్రాజెక్టును కేటాయించారువాటిని రుసుము (ఫీ)గా మార్చవచ్చుప్రాజెక్టు పూర్తయిన రెండో ఏడాది నుంచి ప్రీమియం చెల్లించాల్సి ఉంటుందిమిగతా ఒప్పంద కాలానికితర్వాతి సంవత్సరాల్లో ఉచితంగా పొందగలిగే మొత్తంలో అది ఏటా 1% పెరుగుతుంది.

ఈ రహదారి ఉత్తరప్రదేశ్రాజస్థాన్మధ్యప్రదేశ్ రాష్ట్రాల గుండా వెళ్తుందిఇది ఆగ్రాగ్వాలియర్ మధ్య అత్యంత వేగవంతమైన రవాణా సదుపాయాన్ని అందించడం మాత్రమే కాకుండాజాతీయ రహదారి -44 లో ఆగ్రా-గ్వాలియర్ సెక్షన్‌లోని వివిధ నగరాలుపారిశ్రామిక ప్రాంతాల్లో రద్దీని తగ్గించడానికి కూడా సహాయపడుతుందిఈ ఎక్స్‌ప్రెస్ రహదారి ప్రయాణ సమయాన్నికర్బనోద్గారాలను తగ్గిస్తుందిఅంతేకాకుండా వాణిజ్యపరమైన రవాణా సామర్థ్యాన్నిఆగ్రాధోల్‌పూర్మొరెనాగ్వాలియర్ మధ్య సరుకు రవాణా సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది.

ఈ ఎక్స్‌ప్రెస్ రహదారిలో ఎనిమిది ప్రధాన వంతెనలు, 23 చిన్న వంతెనలుఆరు ఫ్లైఓవర్లుఒక రైల్ ఓవర్ బ్రిడ్జి192 కల్వర్టులు ఉంటాయిఈ ప్రాజెక్టు జాతీయ చంబల్ వన్యప్రాణుల అభయారణ్యం గుండా కూడా వెళ్తుందివన్యప్రాణుల రక్షణ చర్యల్లో భాగంగా నదీ జలాల్లోని కుండ మూతి మొసళ్ల సంరక్షణ కోసం చంబల్ నదిపై కేబుల్ స్టేడ్ బ్రిడ్జిని నిర్మించడానికి కూడా ప్రణాళికలు రూపొందించారుదీనితోపాటువంతెనపై ధ్వని నిరోధకాలలైట్ కట్టర్ల వంటి ఇతర వన్యప్రాణి సంరక్షణ చర్యలు కూడా చేపడతారు.

బిల్డ్-ఆపరేట్-ట్రాన్స్‌ఫర్ (టోల్ప్రాజెక్టుల కోసం ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యాన్ని భారత ప్రభుత్వం ప్రోత్సహిస్తోందిఇటీవల 121 కి.మీపొడవైన గౌహతి రింగ్ రోడ్డును బిల్డ్ ఆపరేట్ ట్రాన్స్‌ఫర్ (టోల్విధానంలో అభివృద్ధి చేయడానికి ఓ అంగీకార ఒప్పందం (కన్సెషన్ అగ్రిమెంట్)పై ఎన్‌హెచ్ఏఐ సంతకం చేసిందిరహదారి రంగంలో బలమైన ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం అభివృద్ధికి దోహదం చేయడంతోపాటు దేశంలోని జాతీయ రహదారి వ్యవస్థ కార్యకలాపాల్లోప్రపంచస్థాయి ప్రమాణాలతో దానిని నిర్వహించడంలో విశేషంగా ఉపయోగపడుతుంది

 

A screenshot of a computer screenAI-generated content may be incorrect.

***


(रिलीज़ आईडी: 2125674) आगंतुक पटल : 17
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी