ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఆంధ్రప్రదేశ్‌లో అనకాపల్లి జిల్లాలో ఒక ఫ్యాక్టరీలో దుర్ఘటన... ప్రాణ నష్టం... సంతాపం తెలిపిన ప్రధానమంత్రి


* పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని

प्रविष्टि तिथि: 13 APR 2025 6:54PM by PIB Hyderabad

ఆంధ్రప్రదేశ్‌లో అనకాపల్లి జిల్లాలో గల ఒక  ఫ్యాక్టరీలో  ఆదివారం దుర్ఘటన సంభవించిన కారణంగా ప్రాణనష్టం జరిగినందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో మరణించిన వ్యక్తులకు ఒక్కొక్కరికి ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (పీఎంఎన్ఆర్ఎఫ్) నుంచి రూ.2లక్షల వంతున ఎక్స్‌గ్రేషియాను వారి సంబంధికులకు  చెల్లించనున్నట్లు ఆయన ప్రకటించారు. గాయపడిన వారికి రూ.50,000 వంతున ఇవ్వనున్నారు.


ప్రధానమంత్రి కార్యాలయం సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ఒక సందేశాన్ని పొందుపరుస్తూ, ఆ సందేశంలో ఇలా పేర్కొంది:


"ఆంధ్రప్రదేశ్ లోని అనకాపల్లి జిల్లాలో ఓ ఫ్యాక్టరీలో దుర్ఘటన ప్రాణ నష్టానికి దారి తీయడం అత్యంత బాధాకరం. ఈ ప్రమాదంలో తమ ఆత్మీయులను కోల్పోయిన వారికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. ఈ దుర్ఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. దుర్ఘటన బాధితులకు స్థానిక పాలన యంత్రాంగం సహాయక చర్యలు చేపడుతోంది.

 

మరణించిన ప్రతి వ్యక్తికీ పీఎం ఎన్ఆర్ఎఫ్ నుంచి రూ. 2 లక్షల వంతున ఎక్స్‌గ్రేషియాను ఆ వ్యక్తి కుటుంబానికి అందజేస్తాం. గాయపడిన వారికి ఒక్కొక్కరికి రూ. 50,000 చొప్పున అందిస్తాం: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (@narendramodi)"


(रिलीज़ आईडी: 2121694) आगंतुक पटल : 26
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Odia , English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Assamese , Punjabi , Gujarati , Tamil , Kannada , Malayalam