రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

తెలంగాణలో మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్కులు

Posted On: 02 APR 2025 2:23PM by PIB Hyderabad

a. దేశవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు వాటి సాధ్యాసాధ్యాలను బేరీజు వేసుకుని అన్ని రకాల రవాణా వ్యవస్థలను ఏకీకృతం చేసేలా సంబంధిత మౌలిక సదుపాయాలను ఒకేచోట (మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్కులను - ఎంఎంఎల్పీ) అభివృద్ధి చేస్తున్నాయి. రవాణా సంబంధిత సామర్థ్యాలను మెరుగుపరచడం కోసం దేశవ్యాప్తంగా 35 ప్రదేశాల్లో మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కుల అభివృద్ధికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రవాణా వ్యయాన్ని తగ్గించడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది.

ఆమోదం పొందిన ప్రదేశాల్లో జోగిఘోపా, చెన్నై, బెంగళూరు, నాగపూర్, ఇండోర్ వద్ద గల 5 ఎంఎంఎల్పీల పనులు జరుగుతున్నాయి. 2025-26, 2026-27 నాటికి అందుబాటులోకి వస్తాయని భావిస్తున్నారు.

b. మంజూరైన 5 ఎంఎంఎల్పీలకు కేటాయించిన మొత్తాన్ని అనుబంధం-1లో పొందుపరచడమైనది.

c. మంజూరైన 5 ఎంఎంఎల్పీలకు సంబంధించి రవాణా పరిమాణ అంచనాలు అనుబంధం-2లో పొందుపరచడమైనది.

 

సమాధానంలోని పార్ట్-బి లో పేర్కొన్న అనుబంధం

image.png

 

సమాధానంలోని పార్ట్-సి లో పేర్కొన్న అనుబంధం

image.png

రాజ్యసభలో అడిగిన నక్షత్రపు గుర్తు లేని ప్రశ్న (3619)కు సమాధానంగా ఇచ్చిన ఓ లిఖితపూర్వక ప్రకటనలో కేంద్ర రోడ్డు రవాణా, హైవేల శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ ఈ సమాచారాన్ని అందించారు.   

 

***


(Release ID: 2117926)
Read this release in: English , Urdu , Hindi