బొగ్గు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఆత్మనిర్భర్ భారత్ సాధనలో బొగ్గు రంగం కీలకంగా మారుతోంది: శ్రీ జి కిషన్ రెడ్డి


· వాణిజ్య బొగ్గు గనుల 12వ విడత వేలాన్ని విజయవంతంగా ప్రారంభించిన బొగ్గు శాఖ

· ఒక బిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తితో బృహత్తర లక్ష్యాన్ని అధిగమించడం ద్వారా బొగ్గు రంగం చారిత్రాత్మక మైలురాయిని చేరుకుంది

· 12వ విడత వేలం ద్వారా మరో ముందడుగు పడుతోంది – 28 బొగ్గు, లిగ్నైట్ గనులను వేలం వేస్తున్నాం

· ఈ వేలాలు బొగ్గు దిగుమతులను తగ్గించి విలువైన విదేశీ మారకాన్ని ఆదా చేయడమే కాక దేశాన్ని నిజమైన ఆత్మ నిర్భర్ గా తీర్చిదిద్దుతున్నాయి

Posted On: 27 MAR 2025 10:20PM by PIB Hyderabad

దేశీయ బొగ్గు ఉత్పత్తిని పెంచి దేశ ఇంధన భద్రతను పెంపొందించాలన్న లక్ష్యంతోవాణిజ్య బొగ్గు గనుల 12వ విడత వేలాన్ని కేంద్ర బొగ్గు శాఖ ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభించిందికార్యక్రమానికి కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి శ్రీ జి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరవగా కేంద్ర సహాయ మంత్రి శ్రీ సతీష్ చంద్ర దూబే గౌరవ అతిథిగా హాజరయ్యారుఈ సందర్భంగా కీలకోపన్యాసం చేసిన శ్రీ కిషన్ రెడ్డి... ఇటీవల భారత్ ఒక బిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తిని అధిగమించి చారిత్రాత్మక ఘనతను సాధించిందని హర్షం వ్యక్తం చేశారుబొగ్గు రంగం నేడు ఆధునికపారదర్శకప్రగతిశీల ధోరణి అలవర్చుకోవడం ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ దార్శనిక నాయకత్వం వల్లే సాధ్యపడిందన్నారు2015 నుంచీ చేపట్టిన పారదర్శక వేలం పద్ధతులుపెరిగిన ప్రైవేటు రంగ భాగస్వామ్యంసాంకేతిక ప్రగతి వంటి కీలక సంస్కరణలు ఈ రంగం ముఖచిత్రాన్ని మార్చివేసిసామర్థ్య పెంపుపోటీతత్వం పెంపొందేందుకు దోహదపడ్డాయి.

 

 

11 విడతల్లో 125 బొగ్గు గనులను విజయవంతంగా వేలం వేయడం ద్వారా సుమారు రూ40,900 కోట్ల పెట్టుబడులను ఆకర్షించగలిగామనిలక్షలకు పైగా ప్రత్యక్షపరోక్ష ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వచ్చాయని మంత్రి తెలిపారు12వ విడతలో మరో 28 బొగ్గులిగ్నైట్ బ్లాకులు వేలం వేస్తున్నారు... దాంతో భారత్ విదేశీ బొగ్గు మీద ఆధారపడటం తగ్గివిదేశీ మారకం ఆదా కానుందిఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాన్ని సాధించడంలో ఇది కీలకమవుతోందిపారదర్శకమైన వేలం ప్రక్రియ ఆరోగ్యకరమైన పోటీని ప్రేరేపించిప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేట్ సంస్థలతో పోటీ పడేలా చేస్తోందిఈ పోటీ సామర్థ్య పెంపుసంస్కరణలుకార్యకలాపాల పద్ధతుల్లో పరివర్తనకు దోహదపడుతోందిఈ మార్పు భారతదేశ బొగ్గు రంగ గ్లోబల్ పోటీతత్వాన్ని గణనీయంగా పెంచింది.

బొగ్గు రంగం ఆత్మనిర్భర్ భారత్‌ సాధనలో కీలకంగా మారుతోందనిపారదర్శకమైనసమ్మిళిత వేలం పద్ధతులు కొత్త కంపెనీలనుచిన్న మైనింగ్ సంస్థలను ఆకర్షిస్తున్నాయనిదరిమిలా వారికి ఈ రంగంలో ప్రవేశించే కొత్త అవకాశాలు అందుతున్నాయని శ్రీ కిషన్ రెడ్డి తెలిపారు12వ విడత వేలంలో పరిశ్రమల వారు సహా భాగస్వాములందరూ ఉత్సాహంగా పాల్గొనాలని పిలుపునిస్తూ ప్రధానమంత్రి దార్శనికతకి అనుగుణంగా ఇంధన భద్రతస్వయం సమృద్ధుల పరంగా బలమైన భారత్ నిర్మాణంలో బాధ్యత వహించాలని విజ్ఞప్తి చేశారు.  

 

భారతదేశం ఒక బిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తిని అధిగమించడం వల్ల12వ విడత వాణిజ్య బొగ్గు గనుల వేలం ప్రారంభం ఇంధన స్వయం సమృద్ధి దిశగా మరో ముఖ్యమైన ముందడుగును సూచిస్తోందని బొగ్గుగనుల శాఖ సహాయ మంత్రి శ్రీ సతీష్ చంద్ర దూబే తమ ప్రసంగంలో పేర్కొన్నారుపారదర్శక వేలం విధానంపరిశ్రమ అనుకూలమైన విధానాలుప్రైవేట్ రంగ భాగస్వామ్యం పెరగడం వల్ల బొగ్గు ఉత్పత్తి పెరగడమే కాక పెట్టుబడుల ఆకర్షణఉపాధి అవకాశాలను సృష్టివేగవంతమైన మౌలిక సదుపాయాల వృద్ధి సాధ్యపడుతున్నాయని మంత్రి చెప్పారు.

బొగ్గు రంగంలో కొత్త ఆలోచనలకుసుస్థిరతకు పెద్దపీట వేయాలన్న ప్రభుత్వ నిబద్ధతను పునరుద్ఘాటించిన శ్రీ దూబేఇది దీర్ఘకాల ఇంధన భద్రతను అందిస్తుందని చెప్పారుసులభ వ్యాపారానికి ప్రాముఖ్యాన్ని కొనసాగిస్తామన్న మంత్రిఇది ఇంధన రంగంలో ఆత్మ నిర్భరత సాధించేందుకు సహాయపడుతుందన్నారు.  

బొగ్గు శాఖ కార్యదర్శి విక్రమ్ దేవ్ దత్త్... అదనపు కార్యదర్శి రూపిందర్ బ్రార్బొగ్గుమైనింగ్ రంగ కీలక భాగస్వాములు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

బొగ్గు మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ విక్రమ్ దేవ్ దత్ ప్రసంగిస్తూ 2020 నుండి వాణిజ్య బొగ్గు గనులు ఈ రంగంలో పరివర్తన సామర్థ్య పెంపు, అమాంతంగా పెరుగుతున్న ఇంధన డిమాండ్‌ను తీర్చడంపరిశ్రమలకు నిష్పక్షపాతమైన సరఫరా నిర్ధారణ  వంటి వాటికి దోహదపడుతున్నాయని  చెప్పారు.  1 బీటీ (బిలియన్ టన్నులు) బొగ్గు ఉత్పత్తి మైలురాయి లక్ష్యాన్ని చేరుకున్నందుకు ప్రశంసిస్తూప్రైవేట్ రంగ భాగస్వామ్యంపారదర్శకతవిధాన సంస్కరణలు ఈ రంగాన్ని మరింత పోటీతత్వంతో భవిష్యదభిముఖంగా తీర్చిదిద్దాయని వ్యాఖ్యానించారుపర్యావరణంఅడవులువాతావరణ మార్పుల మంత్రిత్వశాఖ (ఎంఓఈఎఫ్), రైల్వేలు సహా రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయ ప్రయత్నాల ద్వారా వేగవంతమైన గనుల నిర్వహణక్రమబద్ధీకరించిన అనుమతులుమెరుగైన అనుసంధాన వ్యవస్థలను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారుప్రతి వేలంతో బొగ్గు రంగం కొత్త పెట్టుబడులను ఆకర్షిస్తోందనిఉద్యోగాలను సృష్టిస్తోందనిభారతదేశ ఇంధన భద్రతను పటిష్టం చేస్తోందని చెప్పారువాణిజ్య బొగ్గుగనుల కార్యకలాపాలు ఈ రంగానికి సరికొత్త దిశను చూపాయనిఆర్థిక వృద్ధికి ఊతమిస్తూ, మౌలిక సదుపాయాల వృద్ధికి దోహదపడుతూ బొగ్గు ఉత్పత్తిలో భారతదేశాన్ని ఆత్మనిర్భర్‌గా మార్చేందుకు సహాయపడుతున్నాయని శ్రీ విక్రమ్ దేవ్ దత్ వివరించారు.

వేలం కార్యకలాపాలు త్వరగా ప్రారంభించడానికి అనుమతులను శీఘ్రగతిన అందిస్తామనినియంత్రణలను సరళీకరిస్తామనిఏవైనా అడ్డంకులు ఉంటే తొగిస్తామని హామీ ఇచ్చారుపర్యావరణఅటవీ అనుమతులు త్వరగా ఇచ్చేందుకు ప్రభుత్వం సుముఖంగా ఉందన్నారుదిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించేందుకుదేశీయంగా బొగ్గు ఉత్పత్తిని పెంచేందుకు వివిధ మంత్రిత్వశాఖలునియంత్రణ సంస్థల మధ్య అనుసంధానాన్ని పెంపొందిస్తామని హామీ ఇచ్చారుపర్యావరణ అనుకూలబాధ్యతాయుత గనుల తవ్వకానికి ప్రాధాన్యం కొనసాగుతుందనిఒట్టి పోయిన గనుల పునరుద్ధరణఅడవుల పెంపకంపర్యావరణ చట్టాల అనుసరణ వంటి వాటికి మరింత ప్రాధాన్యాన్నిస్తామని చెప్పారువాణిజ్య బొగ్గు గనులు త్వరితగతిన అభివృద్ధి చెంది కాలుష్య-రహితపరిశుభ్రమైన బొగ్గు రంగాన్ని తయారు చేసేందుకు భాగస్వాములందరికీ సంపూర్ణ సహకారాన్ని అందిస్తామని చెప్పారు.

 

బొగ్గు మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శినామినేటెడ్ అధికారిణి రూపిందర్ బ్రార్ స్వాగత ప్రసంగం చేస్తూ దేశంలో వాణిజ్య బొగ్గు మైనింగ్ పరివార్తనాత్మక ప్రభావాన్ని గురించి తెలియజేశారు. 12వ విడత వాణిజ్య బొగ్గు గనుల వేలం ప్రైవేటు రంగం వారికి  కొత్త అవకాశాలను కల్పిస్తుందనిపోటీని పెంపొందిస్తుందనిపరిశ్రమలకు స్థిరమైన బొగ్గు సరఫరాను ఖరారు చేస్తుందని చెప్పారుభారతదేశం బొగ్గు రంగం మరింత పారదర్శకంగాపెట్టుబడిదారులకు అనుకూలమైనదిగాప్రపంచస్థాయి పోటీ కోసం సంసిద్ధమయ్యేలా రూపొందటంలో విధాన సంస్కరణల పాత్ర ఎంతైనా ఉందని బ్రార్ చెప్పారు.

అనుకూలమైన పద్ధతుల్లో మైనింగ్‌కు ప్రభుత్వం కట్టుబడి ఉందనిబొగ్గు అన్వేషణవెలికితీతల్లో నూతన సాంకేతిక పద్ధతులను అవలంబించవలసిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారువాణిజ్య బొగ్గు తవ్వకం కేవలం అధిక  ఉత్పత్తికి పరిమితం కాదనిసుస్థిరమైన స్వావలంబనతో కూడిన భవిష్యత్తు కోసం భారత్ దార్శనిక ప్రణాళికకు అనుగుణమైన  బాధ్యతాయుతమైన మైనింగ్ పద్ధతులను అనుసరించడం అవసరమని చెప్పారు.

కొత్త పెట్టుబడి అవకాశాల కల్పనబాధ్యతాయుతమైన మైనింగ్ పద్ధతులుదేశ బొగ్గు రంగంలో అధిక భాగస్వామ్యాన్ని పెంపొందించే దిశగా నేటి ప్రారంభం మరో ప్రధాన అడుగును సూచిస్తోందిబొగ్గు గనుల తవ్వకంలో పారదర్శకతసామర్థ్యంప్రైవేటు రంగ భాగస్వామ్యాన్ని పెంపొందించాలనే ప్రభుత్వ నిబద్ధతను తేటతెల్లంచేస్తూవేలాన్ని దక్కించుకున్న బిడ్డర్‌లతో మునుపటి విడత ఒప్పంద పత్రాలను అందరి ముందూ ఉంచారుచారిత్రాత్మక బిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తిని సాధించడంలో భారత్ కీలక మైలురాయిని దాటినట్లయిందికేంద్రరాష్ట్ర ప్రభుత్వాలుబొగ్గు కంపెనీలుగని కార్మికులుపరిశోధకులుప్రైవేట్ రంగ భాగస్వాముల సమష్టి కృషిని ఈ విజయం  ప్రతిబింబిస్తోంది.

12వ విడత వాణిజ్య బొగ్గు గనుల వేలంలో భాగంగాబొగ్గు గనుల (ప్రత్యేక నిబంధనలుచట్టం-2015 (సీఎంఎస్పీకింద 25 కొత్త బొగ్గు గనులు...  గనులుఖనిజాల (అభివృద్ధినియంత్రణచట్టం-1957 (ఎంఎండీఆర్కింద 18 గనులును వేలం వేస్తున్నారువైవిధ్యమైన ఇంధన అవసరాలకు తగినట్లు వేలంలో రెండు లిగ్నైట్ గనులు కూడా ఉన్నాయి.  

మొత్తం గనుల్లో 13 గనులు అన్వేషణ పూర్తి చేసుకుని తక్షణ వృద్ధికి సిద్ధంగా ఉండగామరో 12 గనుల్లో అన్వేషణ పాక్షికంగానే జరిగిందిదరిమిలా ఇవి దీర్ఘకాలిక పెట్టుబడి అవకాశాలను కలిగిదేశ బొగ్గు రంగం వృద్ధికి దోహదం చేస్తాయిగతసారి వాణిజ్య బొగ్గు గనుల వేలానికి చెందిన మూడు గనులను కూడా ఈసారి కేటాయిస్తారుజార్ఖండ్ఛత్తీస్‌గఢ్ఒడిశామధ్యప్రదేశ్మహారాష్ట్రపశ్చిమ బెంగాల్రాజస్థాన్ వంటి బొగ్గులిగ్నైట్ నిల్వలు కలిగిన రాష్ట్రాల్లో  వేలం వేయబడుతున్న గనులు విస్తరించి ఉన్నాయి.

 

 

బొగ్గు ఉత్పత్తిఈ రంగంలో పరిశ్రమల వృద్ధి కోసం గణనీయమైన కృషి చేసిన బొగ్గు బ్లాక్ కేటాయింపుదారులకు ఈ సందర్భంగా ప్రశంసా పత్రాలను ప్రదానం చేశారు. రికార్డు స్థాయి బీటీ  బొగ్గు ఉత్పత్తిని సాధించడంలో  అత్యుత్తమ పనితీరును కనపర్చినిబద్ధత చూపిన కోల్ ఇండియా లిమిటెడ్ (సీఐఎల్అనుబంధ సంస్థల ప్రతినిధులను సత్కరించారు.

వాణిజ్య బొగ్గు గనుల12వ విడత వేలం కొత్త పెట్టుబడి అవకాశాలకు తెరతీసిదేశీయ బొగ్గు సరఫరా మెరుగుదలదేశ ఇంధన భద్రతలకు దన్నుగా నిలవగలదని భావిస్తున్నారుపర్యావరణ పరిరక్షణసమాజ సంక్షేమానికి ప్రాధాన్యాన్నిస్తూనేస్వయం-సమృద్ధ బొగ్గు ఆర్థిక వ్యవస్థ సాధనకు అవసరమైన వృద్ధిసుస్థిరతభద్రతలను పెంపొందించడానికి బొగ్గు మంత్రిత్వ శాఖ కట్టుబడి ఉంది.

 

 

***


(Release ID: 2116193) Visitor Counter : 42