గనుల మంత్రిత్వ శాఖ
సముద్ర ఇసుక తవ్వకానికి టెండరు
Posted On:
26 MAR 2025 3:28PM by PIB Hyderabad
కేంద్ర ప్రభుత్వం ఆఫ్‌షోర్ ఏరియాస్ మినరల్స్ (డెవలప్‌మెంట్ అండ్ రెగ్యులేషన్) యాక్టు, 2002 కు అనుగుణంగా కాంపోజిట్ లైసెన్సును.. అంటే అన్వేషణ లైసెన్సుతోపాటు ఉత్పత్తి సంబంధిత అనుమతిని కూడా మంజూరు చేయడానికి, సముద్ర తీరంలోని 13 బ్లాకుల తొలి విడత వేలాన్ని 2024 నవంబరు 28న మొదలుపెట్టింది.
ఆఫ్‌షోర్ ఏరియాలలో పైన ప్రస్తావించిన తరహా బ్లాకులను నోటిఫై చేయడానికన్నా ముందు పర్యావరణం, అడవులు, వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ (ఎంఓఈఎఫ్‌సీసీ), మత్స్యపరిశ్రమ, పశుసంవర్ధకం, పాడిపరిశ్రమ మంత్రిత్వ శాఖలో భాగంగా ఉన్న ఫిషరీస్ విభాగం సహా అనేక ముఖ్య మంత్రిత్వశాఖలను కేంద్ర ప్రభుత్వం సంప్రదించింది. ఈ సంప్రదింపులు తప్పక చేయాలని ఆఫ్‌షోర్ ఏరియాస్ ఆపరేటింగ్ రైట్ రూల్స్ (ఓఏఓఆర్ఆర్), 2024 లోని 5వ నియమం చెబుతోంది.
దీనికి అదనంగా, వేలం (లేదా టెండరు) ప్రక్రియలో ఎంపిక చేసిన మేలైన వేలందారు చట్టప్రకారం రూపొందించిన నియమాలకు అనుగుణంగా వేర్వేరు షరతులను నెరవేర్చే దానిని బట్టి కాంపోజిట్ లైసెన్సు మంజూరుకు హక్కును కలిగి ఉంటారు. ఆఫ్‌షోర్ ఏరియాస్ మినరల్స్ (డెవలప్‌మెంట్ అండ్ రెగ్యులేషన్) యాక్టు-2002 నిబంధనల మేరకు, నిర్వహణాధికారాన్ని ఆచరణలోపెట్టే కన్నా ముందు (అంటే ఇక్కడ అన్వేషణ లైసెన్సు, ఉత్పత్తి అనుమతి వగైరా..) బిడ్డర్లు అన్వేషణ కార్యకలాపాలను లేదా ఉత్పాదన కార్యకలాపాలను ప్రారంభించడానికి వర్తించే చట్టపరమైన అన్ని సమ్మతులనూ, ఆమోదాలనూ, అనుమతి పత్రాలనూ, నిరభ్యంతర పత్రాల (నో అబ్జెక్షన్స్) వంటివి పొందాల్సి ఉంటుంది. అన్వేషణ ప్రణాళిక, ఉత్పాదన ప్రణాళిక.. వీటికి ఆమోదముద్రను సంపాదించుకోవడం అవసరమయ్యే క్లియరెన్సుల్లో భాగమే. ఈ ప్రకారంగా చూసినప్పుడు, వేలం ఒక్క తొలి అడుగు మాత్రమే అవుతుంది. అవసరమైన ఆమోదాలను, లైసెన్సును లేదా లీజును పొందడాని కన్నా ముందు అన్వేషణను లేదా ఉత్పాదనను టెండరుదారు ఆరంభించలేరు.
జీవావరణం (ఎకాలజీ), జీవ వైవిధ్యం, మత్స్యకారుల ప్రయోజనాలు.. వీటిని రక్షించడానికి చట్టంలో, నియమాల్లో చాలినన్ని నిబంధనల్ని చేర్చారు. ఆఫ్‌షోర్ ఏరియాస్ మినరల్ కన్జర్వేషన్ అండ్ డెవలప్‌మెంట్ రూల్స్, 2024 నిబంధనల ప్రకారం, ఎలాంటి ఉత్పాదన కార్యకలాపాలనైనా ఉత్పాదన ప్రణాళికలో తెలిపినట్లు చేపట్టాల్సిఉంటుంది. ఉత్పాదన ప్రణాళికలో ఇతర అంశాలతోపాటు ఆధారంగా పరిగణించే సమాచారం (బేస్‌లైన్ ఇన్ఫర్మేషన్), పర్యావరణ ప్రభావ మదింపు (ఈఐఏ), ఇతర ఉపశమన చర్యల్ని సూచించే పర్యావరణ నిర్వహణ ప్రణాళిక.. ఇవి కూడా భాగంగా ఉంటాయి. పర్యావరణాన్నీ, జీవవైవిధ్యాన్నీ, మత్స్యకార సముదాయ ప్రయోజనాల్నీ కాపాడడానికి ఉత్పాదనను మొదలుపెట్టే కన్నా ముందే ఈఐఏ ప్రక్రియను ఆచరణలోకి తీసుకురావడానికి చట్టంలో, నియమావళిలో సమగ్ర నిబంధనల్ని పొందుపరిచారు. ఉత్పాదన లీజును మంజూరు చేసే ముందు ఉత్పాదన ప్రణాళికకు ఆమోదాన్ని పొందాల్సి ఉంటుంది.
సముద్ర తీర ప్రాంత ఖనిజ బ్లాకు వేలం వ్యవహారంలో కూడా, ప్రాజెక్టును ప్రతిపాదించిన వారే (అంటే ఇక్కడ ప్రిఫర్డ్ బిడ్డరు) పర్యావరణ పరిరక్షణ చట్టం-1986లో భాగంగా పర్యావరణ ప్రభావ మదింపు (ఈఐఏ)ను చేపడతారు. ఎందుకంటే ఈఐఏ, ఉపశమన చర్యలనేవి గనుల తవ్వకానికి ప్రస్తావించిన పద్ధతి, భూవిజ్ఞానం, బ్లాకులో ఖనిజాల ఉనికి, బ్లాకులో ఉపయోగిస్తామని ప్రస్తావించిన యంత్రాలు, మౌలిక సదుపాయాలు తదితర వివిధ కారకాలపై ఆధారపడి ఉంటాయి కాబట్టి. ఈ తరహా నిబంధనలనే ఆఫ్‌షోర్ ఏరియా (డెవలప్‌మెంట్ అండ్ రెగ్యులేషన్) యాక్టు, 2002లోనూ, నియమాల్లోనూ పేర్కొన్నారు. పర్యావరణ ప్రభావ మదింపు (ఈఐఏ)ను చేపట్టేటప్పుడు ప్రాజెక్టును ప్రస్తావించిన వారు ఎలాంటి అక్రమానికీ ఒడిగట్టకుండా తగినన్ని రక్షణ చర్యల్ని పొందుపరిచారు.
***
(Release ID: 2115719)
Visitor Counter : 13