వ్యవసాయ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

నూతన వ్యవసాయ సాంకేతికతలు, విత్తన రకాలు

Posted On: 25 MAR 2025 5:07PM by PIB Hyderabad

ఈ ఏడాది ఫిబ్రవరి 22 నుంచి 24 వరకు జరిగిన పూసా కృషి విజ్ఞాన మేళాలో ఏడు ప్రధాన వ్యవసాయ పంటలకు సంబంధించిన అధిక దిగుబడినిచ్చే 79 రకాలు, 11 రకాల పండ్లు, 31 రకాల కూరగాయలను ప్రదర్శించారు. వీటితో పాటుగా 18 జీవఎరువులు, బయోఫార్ములేషన్లకు సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానాలు, భూసారాన్ని పరీక్షించి ఎరువులను సిఫారసు చేసే పరికరం, జింక్‌తో కూడిన నానో క్లే పాలిమర్ మిశ్రమం , ట్రేడ్ మార్క్ పొందిన స్పీడీ సీడ్ వయబిలిటీ కిట్, కీటకాల నియంత్రణ కోసం పాలీమర్ మిశ్రమంతో విత్తన శుద్ధి తదితరమైన వాటిని ప్రదర్శించారు. అలాగే నిమ్మజాతికి చెందిన పుమెలో తొక్కలు, వరిపొట్టు నుంచి తీసిన నానో సెల్యులోజ్, ఇన్స్టెంట్ నూడుల్స్ కోసం బఠానీ పొడి, బాగా ముగ్గిన అరటి పొడితో తయారు చేసిన పఫ్‌లు, ఉప ఉత్పత్తులతో తయారు చేసిన మఫిన్లను కూడా ఈ ప్రదర్శనలో ఉంచారు. ఈ కార్యక్రమంలో ఎనిమిది నూతన వ్యవసాయ పరికరాలను కూడా ప్రదర్శించారు.  

సాంకేతిక, రైతులు-శాస్త్రవేత్తల ముఖాముఖి కార్యక్రమాలకు సంబంధించిన ప్రధాన వివరాలు సెషన్ల వారీగా:

సెషన్ 1: వాతావరణ మార్పులను తట్టుకొనే వ్యవసాయానికి సాంకేతికతలు
సెషన్ 2: పంటల వైవిధ్యాన్ని అనుసరించడం,
సెషన్ 3: డిజిటల్ వ్యవసాయం,
సెషన్ 4: వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్, ఎగుమతులు,
సెషన్ 5: ఎఫ్‌పీవో-స్టార్టప్ లింకేజి,
సెషన్ 6: యువత, మహిళల్లో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం,
సెషన్ 7: వ్యవసాయంలో ఆవిష్కరణలు చేసిన రైతుల సమావేశం

ప్రత్యేక ప్రదర్శనల ద్వారా ఐసీఏఆర్-ఐఏఆర్ఐ అభివృద్ధి చేసిన ప్రధాన వంగడాలు, సాంకేతికతలపై రైతులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, యువత, మహిళలకు అవగాహన కల్పించారు. ఐసీఏఆర్-ఐఏఆర్ఐతో సహా ఐసీఏఆర్ సంస్థలు, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, కృషి విజ్ఞాన కేంద్రాలు, ఎఫ్‌పీవోలు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, అంకుర సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు అభివృద్ధి చేసిన ముఖ్యమైన టెక్నాలజీలు, ఉత్పత్తులు, సేవలపై ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. ఉన్నత కృషి – వికసిత భారత్ అంశంపై ఏర్పాటు చేసిన సాంకేతిక సెషన్లలో రైతులు-శాస్త్రవేత్తల ముఖాముఖి నిర్వహించారు.

• ఐసీఏఆర్ సంస్థలు, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, వ్యవసాయ రంగంలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో 245 స్టాళ్లు ఏర్పాటు చేశారు.

• వరి, పెసర, కందులు, సజ్జలు, కూరగాయలు తదితర పంటకు చెందిన 1800 క్వింటాళ్లకు పైగా విత్తనాలను సరసమైన ధరలకే రైతులకు అందించారు. రైతులకు అవసరమైన సలహాలను సైతం తక్షణమే అందించారు.

• టెక్నాలజీలకు సంబంధించిన విస్తృత రచనలను కూడా రైతులకు అందించారు.

‘కృషి చౌపాల్ – విజ్ఞాన్ సే కిసాన్ తక్‌’పై పర్యవేక్షణ, ఐఏఆర్ఐ పురస్కార గ్రహీతలు/ఆవిష్కరణలు చేసే రైతుల సమావేశం తదితరమైనవి ఈ కార్యక్రమంలో చేసిన ముఖ్యమైన ప్రకటనల్లో కొన్ని.

లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు బదులుగా ఈ సమాచారాన్ని వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి శ్రీ భాగీరథ్ చౌదరి లిఖితపూర్వకంగా అందించారు.

 

***


(Release ID: 2115098) Visitor Counter : 30


Read this release in: English , Urdu , Hindi , Tamil