సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

న్యూఢిల్లీలో ఏర్పాటు కానున్న యుగే యుగీన్ భారత్ జాతీయ వస్తు ప్రదర్శనశాల

Posted On: 24 MAR 2025 4:01PM by PIB Hyderabad

న్యూఢిల్లీలోని నార్త్ బ్లాకుసౌత్ బ్లాకు ఒక కొత్త జాతీయ వస్తు ప్రదర్శనశాలకు నిలయంగా మారిపోనున్నాయిఈ మ్యూజియానికి యుగే యుగీన్ భారత్ నేషనల్ మ్యూజియం అని పేరు పెట్టారుఈ కార్యక్రమం సెంట్రల్ విస్టా పునరాభివృద్ధి పథకంలో ఓ భాగందీనిలో వేల సంవత్సరాల కిందటి నాగరికతసాంస్కృతిక వారసత్వాలను కళ్లకు కట్టే సరికొత్త జాతీయ వస్తు ప్రదర్శనశాలను కొలువుదీర్చడానికి సమ రూపాన్ని కలిగి ఉండే భవనాలతో రెండు బ్లాకులను వస్తు ప్రదర్శనశాలగా మారుస్తారుత్వరలో రూపుదాల్చే ఈ మ్యూజియాన్ని తీర్చిదిద్దడానికి అవసరమైన సాంకేతిక సహకారాన్ని దృష్టిలో పెట్టుకొని జాతీయ వస్తుప్రదర్శనశాలఫ్రాన్స్ మ్యూజియమ్స్ డెవలప్‌మెంట్.. ఈ రెండూ గతేడాది డిసెంబరు 19న ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి.

ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఏయే నిర్దిష్ట కాలాలకు ఏయే పనులను పూర్తి చేయాలోబడ్జెటును ఏ క్రమంలో కేటాయించాలో అనే విషయాలు సాధ్యతకు సంబంధిత అధ్యయనాలలో తేలే అంశాలతోపాటు ఆ తరువాత పూర్తి చేయాల్సిన లాంఛనాలపైన కూడా ఆధారపడి ఉంటాయి.

ఈ ప్రాజెక్టు భారత సాంస్క‌తిక వారసత్వాన్ని చాటిచెప్పడానికి ఉద్దేశించిందిఇది కలకాలం నిలిచి ఉండే భారతదేశ ఘనతను పండుగ చేసుకొనే సందర్భందీనివల్ల మన ఘనమైన గత వైభవాన్ని అన్వేషించడంవర్తమానాన్ని ప్రకాశవంతం చేసుకోవడంతోపాటు ఉజ్వల భవిష్యత్తును ఊహించుకోవడం కూడా సాధ్యపడుతుంది.  

ఈ సమాచారాన్ని కేంద్ర సాంస్కృతికపర్యాటక శాఖ మంత్రి శ్రీ గజేంద్ర షెఖావత్ ఈ రోజు లోక్‌ సభలో ఒక లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.


 

***


(Release ID: 2114809) Visitor Counter : 13


Read this release in: English , Urdu , Hindi , Tamil