విద్యుత్తు మంత్రిత్వ శాఖ
జాతీయ విద్యుత్ ప్రణాళిక పథకాలు
प्रविष्टि तिथि:
24 MAR 2025 4:50PM by PIB Hyderabad
విద్యుత్తుకి పెరుగుతున్న డిమాండ్, అదనపు ఉత్పాదన సామర్థ్యం ఆధారంగా 2023-2032 మధ్య కాలానికి అవసరమైన పంపిణీ వ్యవస్థను జోడించాలని జాతీయ విద్యుత్ ప్రణాళిక-పంపిణీ వ్యవస్థ ప్రతిపాదిస్తోంది. 388 గిగావాట్ల పతాకస్థాయి డిమాండుకి అనుగుణంగా 2032 కల్లా కేంద్ర, రాష్ట్రాల పంపిణీ వ్యవస్థలకు అదనపు విలువను (220 కిలోవాట్లు, అంతకంటే అధికం) జోడించాలని పథకం తీర్మానిస్తోంది.
సుదూర ప్రాంతాలకు విద్యుత్ సరఫరా చేసేందుకు హై వోల్టేజ్ డైరెక్ట్ కరెంట్ (హెచ్వీడీసీ) లైన్లు అనువైనవి. పునర్వినియోగ ఇంధన ప్రాంతాల వద్ద గల అదనపు విద్యుత్తును, వాడకం అధికంగా గల ప్రాంతాలకు భారీ మొత్తాల్లో బదిలీ చేసేందుకు కొత్త హెచ్వీడీసీ లైన్లు నిర్మించాలని ప్రతిపాదించారు.
దేశంలో విద్యుదుత్పత్తికి సంబంధించిన వనరులు వివిధ ప్రాంతాల్లో సరిసమానంగా కాక, చెదురుమదురుగా ఉన్నాయి. కొన్ని రాష్ట్రాలు పునర్వినియోగ ఇంధన సామర్థ్యంలో అగ్రభాగాన నిలుస్తుండగా, మరికొన్ని జలవిద్యుత్ సామర్థ్యంలో ముందున్నాయి. 2032 నాటికి ప్రాంతాల మధ్య విద్యుత్ బదిలీ సామర్థ్యం 119 గిగావాట్ల నుంచీ 168 గిగావాట్లకు పెరిగితే, అధిక ఉత్పత్తి ప్రాంతాలు, రాష్ట్రాల నుంచీ అధిక వాడకం కలిగిన ప్రాంతాలు, రాష్ట్రాలకు విద్యుత్ బదిలీ సులభమవగలదు. దాంతో లోటు రాష్ట్రాల విద్యుత్ అవసరాలు తీరుతాయి.
పునర్వినియోగ ఇంధన సామర్థ్యం గల ప్రాంతాల నుంచీ విద్యుత్ బదిలీకి అవసరమైన పంపిణీ వ్యవస్థ గురించి జాతీయ విద్యుత్ ప్రణాళిక-పంపిణీ వ్యవస్థ ప్రణాళికలు రచిస్తుంది. దేశంలోని హరిత హైడ్రోజన్, హరిత అమ్మోనియా ఉత్పాదన సామర్థ్యం కలిగిన ప్రాంతాలకు విద్యుత్ సరఫరా చేసేందుకు కూడా పథకాలు సిద్ధమవుతున్నాయి. పునర్వినియోగ ఇంధన విలీనానికి, హరిత హైడ్రోజన్ ఉత్పాదన కేంద్రాలకు సంబంధించిన సరఫరా ప్రాజెక్టులు వివిధ దశల్లో అమల్లో ఉన్నాయి.
విద్యుత్ శాఖ సహాయ మంత్రి శ్రీ శ్రీపాద యశో నాయక్ ఈ రోజు రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ ఈ విషయాలను తెలియజేశారు.
***
(रिलीज़ आईडी: 2114808)
आगंतुक पटल : 56