సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

అభిలేఖ్ పటల్ నుంచి ప్రతులను తీసుకునేందుకు వినియోగ రుసుములను తగ్గించిన నేషనల్ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియా (ఎన్ఏఐ)

Posted On: 11 MAR 2025 2:51PM by PIB Hyderabad

135వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అభిలేఖ్ పటల్ (https://www.abhilekh-patal.in/jspui/నుంచి ప్రాచీన పత్రాలను తీసుకునేందుకు చెల్లించాల్సిన రుసుముల్ని నేషనల్ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియా (ఎన్ఏఐతగ్గించిందిరికార్డులను సులభంగా ఉపయోగించుకోవడానికి వీలుగా ఈ నిర్ణయం తీసుకుందిడిజిటల్ చిత్రాలను (డిజిటలైజ్ చేయడంతో సహా) అందించేందుకు విధించిన ఛార్జీలు దిగువ విధంగా ఉన్నాయి:

భారతీయ పరిశోధకులు మొదటి 20 పేజీలను వెబ్ సైటు నుంచి ఉచితంగా తీసుకోవచ్చుదీనికి సంబంధించిన పూర్తి వివరాలు:

  1. 0-20 చిత్రాలు ఉచితం.

  2. 20-50 చిత్రాలు చిత్రానికి రూరెండు.

  3. 50-100 చిత్రాలు చిత్రానికి రూమూడు.

  4. 100 కంటే ఎక్కువ – చిత్రానికి రూఅయిదు.

విదేశీ పరిశోధకులు మొదటి 20 పేజీలను ఉచితంగా తీసుకోవచ్చుపూర్తి వివరాలు:

  1. 0-20 పేజీలు ఉచితం.

  2. 20-50 పేజీలు -పేజీకి రూఅయిదు.

  3. 50- 100 పేజీలు పేజీకి రూ.10.

  4. 100కు పైగా పేజీకి రూ. 15.

మొత్తం ఎంపిక చేసుకున్న చిత్రాల సంఖ్యకి అనుగుణంగా మొత్తం పేజీలకు ఛార్జీ వసూలు చేస్తారుఏ నుంచి సైజు వరకు భారీదీర్ఘ పరిమాణంలోని మ్యాపులుడాక్యుమెంట్లకు సంబంధించి స్కాన్ చిత్రాల ధరలను ఒక చిత్రానికి (300డీపీఐరూ. 20 నుంచి రూ. 15కు తగ్గించారుభారతీయవిదేశీ పరిశోధకులు ఇద్దరికీ ఇవే ధరలు వర్తిస్తాయివీటిపై కనీస ధరలను తొలగించారు.

భారతీయ విద్యార్థులకు రెప్రోగ్రఫీ సేవా రుసుము (అంటే ప్రింటవుట్లు)ను పేజీకి రూ. 5 నుంచి రూ. 2కు తగ్గించగావిదేశీయులకు రూ. 10 నుంచి రూ. 4కు తగ్గించారుఅదే విధంగా కలర్ పేజీలను ఫొటోకాపీ తీసుకొనేందుకుగాను భారతీయ విద్యార్థులకు పేజీకి రూ. 20 నుంచి రూ. 8కువిదేశీయులకు పేజీకి రూ. 40 నుంచి రూ. 16కు తగ్గించారు.

మన చారిత్రక వారసత్వాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఎన్ఏఐ నిబద్ధతతో పనిచేస్తోందిఅలాగే భవిష్యత్తులో ఫారాలను నింపే ప్రక్రియను పూర్తిగా తొలగించనుందిఅన్ని రికార్డులను డిజిటలైజ్ చేసే లక్ష్యంతో ప్రతిష్ఠాత్మక కార్యక్రమాన్ని ప్రారంభించిందిఫలితంగా ఇప్పటి వరకు అభిలేఖ్ పటల్ లో 8.81 కోట్ల పేజీలు పొందుపరిచారురానున్న రెండేళ్లలో అన్ని రికార్డులను డిజిటలైజ్ చేయాలని ఎన్ఏఐ లక్ష్యంగా నిర్దేశించుకుందితద్వారా ఎక్కడి నుంచైనాఏ సమయంలోనైనా ఈ పత్రాలను సులభంగా ఉపయోగించుకొనే వీలు కల్పించేందుకు ప్రయత్నిస్తోంది.

ప్రస్తుతం భారత ప్రభుత్వం ఉపయోగించని రికార్డులకు నేషనల్ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియా సంరక్షకురాలిగా వ్యవహరిస్తుందివాటిని రికార్డుల తయారీదారులువినియోగదారులు ఉపయోగించుకొనేలా ట్రస్టులో ఉంచుతుందితన ఆధీనంలో ఉన్న రికార్డులను సులభంగా ఉపయోగించుకొనేందుకు వీలుగా ఎన్ఏఐ నిరంతరం శ్రమిస్తోందిఅంతర్జాతీయంగా అనుసరిస్తున్న ఉత్తమ పద్ధతులను దృష్టిలో ఉంచుకొని రికార్డులను ఉపయోగించుకొనేందుకు వీలుగా ప్రస్తుత విధానాన్ని సరళీకరించేందుకు సమీక్ష చేపట్టిందిప్రస్తుతం కొనసాగుతున్న రికార్డుల డిజిటలైజేషన్.. అంతర్జాతీయంగా ఉన్న ప్రధాన భాండాగారాల ఆధీనంలోని పురాతన ప్రతులను ప్రజలు పొందే విధానాన్ని మార్చిందని గమనించారుఎన్ఏఐ నిర్వహిస్తోన్న ఆన్ లైన్ పోర్టల్ అభిలేక్ పటల్‌ను మార్చి 11, 2015న లాంఛనంగా ప్రారంభించారుఅప్పటి నుంచి ప్రాచీన రాత ప్రతులను వినియోగించేవారిలో ఇది బాగా ప్రాచుర్యం పొందిందిఇప్పటి వరకు 200 దేశాలకు చెందిన 30 వేల మంది వినియోగదారులు ఈ పోర్టల్లో నమోదు చేసుకున్నారుఇప్పటి వరకు లక్షల మంది సందర్శించారు.

 

***


(Release ID: 2110341) Visitor Counter : 10


Read this release in: English , Urdu , Hindi , Marathi