సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

హార్ట్‌ఫుల్‌నెస్ లార్డ్ బుద్ధ ట్రైనేషన్ ట్రైసర్వీసెస్ మోటార్ సైకిల్ సాహసయాత్ర ద్వారా నేపాల్, భారత్, శ్రీలంకలోని ప్రముఖ బౌద్ధ ప్రదేశాల సందర్శన


మోటార్ సైకిల్ యాత్ర చేపడుతున్న మూడు దేశాలకు చెందిన త్రివిధ దళాల సిబ్బంది

ఫిబ్రవరి 19, 2025న అధికారికంగా బోధ్‌గయలో యాత్ర ప్రారంభం

Posted On: 14 FEB 2025 11:18AM by PIB Hyderabad

నేపాల్, భారత్, శ్రీలంక దేశాల ఉమ్మడి బౌద్ధ వారసత్వాన్ని కలుపుతూ చేపడుతున్న హార్ట్‌ఫుల్‌నెస్ లార్డ్ బుద్ధ ట్రైనేషన్ ట్రై-సర్వీసెస్ మోటార్ సైకిల్ సాహసయాత్ర
 చారిత్రాత్మకమైన  కార్యక్రమంగా నిలవనుంది. కన్వీనర్ శ్రీ రాహుల్ లక్ష్మణ్ పాటిల్ నాయకత్వంలో ఈ సాహసయాత్ర జరుగుతుంది. దీనికి ఇంటర్నేషనల్ బుద్ధిస్ట్ కాన్ఫెడరేషన్ (ఐబీసీ)తో సహా ఇతర సంస్థలు మద్ధతు అందిస్తున్నాయి.

బుద్ధ భగవానుని జన్మస్థలమైన నేపాల్‌లోని లుంబినీలో ఈ నెల 16 న ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. నేపాల్, భారత్, శ్రీలంక మధ్య విస్తరించి ఉన్న బౌద్ధ మతాన్ని, ఈ దేశాల మధ్య ఉన్న సాంస్కృతిక, ఆధ్యాత్మిక సంబంధాలను బలోపేతం చేసేలా ఈ యాత్ర కొనసాగుతుంది. ఈ మూడు దేశాల్లోని ప్రముఖ బౌద్ధ వారసత్వ ప్రదేశాలను కలుపుతూ ఈ యాత్ర కొనసాగుతుంది.

భారత్‌లో సాగే ఈ యాత్రను ల్యాండ్ ఫోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ), నలంద విశ్వవిద్యాలయం, రాజ్‌గిర్ (విదేశీ వ్యవహారాల శాఖ) నిర్వహిస్తున్నాయి. బిమ్స్‌టెక్ వ్యూహాత్మక భాగస్వామిగా వ్యవహరిస్తుండగా, ఐబీసీ దిశానిర్దేశం చేయనుంది. ఈ యాత్రలో సందర్శించనున్న బౌద్ధ ప్రదేశాలు:

సారనాథ్, ఉత్తరప్రదేశ్ - బుద్ధుడు మొదటిసారిగా తన బోధనలు వెలువరించిన ప్రదేశం

బోధగయ – బుద్ధుడికి జ్ఞానోదయం కలిగిన ప్రదేశం

నలంద, బీహార్ - ప్రఖ్యాత ప్రాచీన బౌద్ధ విశ్వవిద్యాలయం

నాగార్జున సాగర్, ఆంధ్రప్రదేశ్ - ప్రసిద్ధ బౌద్ధ విద్యాలయం

ఉదయగిరి, ఒడిశా - ప్రముఖ బౌద్ధారామం

కర్ణాటక – భారత దేశ బౌద్ధ వారసత్వాన్ని తెలిపే వివిధ ప్రదేశాలు.

భారత్‌లో ఈ యాత్రను మాజీ రాష్ట్రపతి శ్రీ రామ్‌నాథ్ కోవింద్ అధికారికంగా ఈ నెల 19న ప్రారంభిస్తారు. ప్రఖ్యాత బౌద్ధ ప్రదేశం బోధగయ దీనికి వేదిక కానుంది. అక్కడి నుంచి ఈ యాత్ర శ్రీలంక వరకు చేరుకుంటుంది. ఈ చారిత్రాత్మక  యాత్ర పూర్తయ్యే సందర్భంలో శ్రీలంకలోని జాఫ్నాలో ముగింపు ఉత్సవం చేస్తారు. శ్రీలంకలో జరిగే ఈ యాత్ర మూడు దేశాల మధ్య ఉన్న సాంస్కృతిక దౌత్యాన్ని మరింత ప్రోత్సహిస్తుంది.

హార్ట్‌ఫుల్‌నెస్ లార్డ్ బుద్ధ ట్రైనేషన్ ట్రై-సర్వీసెస్ మోటార్ సైకిల్ సాహసయాత్ర లక్ష్యం:

బుద్ధుని బోధనల ద్వారా శాంతి, సామరస్యాలను పెంపొందించడం

సాంస్కృతిక, వారసత్వ పర్యాటకాన్ని దక్షిణాసియాలో ప్రోత్సహించడం.

పర్యావరణ పరిరక్షణ, సుస్థిరాభివృద్ధిపై అవగాహన పెంపొందించడం

భారత్, నేపాల్, శ్రీలంక దేశాల ప్రజల మధ్య సంబంధాలను బలోపేతం చేయడం

 

***


(Release ID: 2103314) Visitor Counter : 35