పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ
పార్లమెంటులో ప్రశ్న: ఆసియా సింహాల ప్రాజెక్టు
Posted On:
13 FEB 2025 3:01PM by PIB Hyderabad
గుజరాత్ లోని గిర్ ప్రాంతంలో ‘ప్రాజెక్ట్ లయన్’ను అమలు చేస్తున్నారు. ఈ ప్రాజెక్టులో సంరక్షణను, జీవావరణం అభివృద్ధి ప్రక్రియను కలబోసి గుజరాత్‌లో ఆసియా సింహాల సంతతిని కాపాడుతున్నారు.
‘లయన్ @ 47: అమృత్‌కాల్ విజన్’ పేరుతో రూపొందించిన ప్రాజెక్ట్ లయన్ దస్తావేజులో ఈ కింది లక్ష్యాలను పేర్కొన్నారు:
i. సింహాల సంతతి పెరుగుతూ ఉండడంతో వాటిపై శ్రద్ధ తీసుకోవడానికిగాను అభయారణ్యాలను సురక్షితంగా ఉంచి, సంరక్షించడం
ii. స్థానిక సముదాయాలకు జీవనోపాధి మార్గాల్నీ, వారి ప్రాతినిధ్యాన్నీ పెంచడం
iii. సింహాల రోగాల్ని నయం చేయడానికీ, చికిత్స చేయడానికీ సంబంధించిన జ్ఞానంలో ప్రపంచ కూడలి (హబ్)గా మారడం.
iv. ప్రాజెక్ట్ లయన్ కార్యక్రమ మాధ్యమం ద్వారా సమ్మిళిత జీవవైవిధ్య సంరక్షణ
ఆసియా సింహాల సంఖ్య పెరుగుతూ ఉండడాన్ని గమనించవచ్చు. గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సమాచారం మేరకు, గత కొన్ని సంవత్సరాల్లో ఆసియా సింహాల సంఖ్య వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి:
సంవత్సరం
|
సంఖ్యపై అంచనా
|
2010
|
411
|
2015
|
523
|
2020
|
674
|
సింహాల ‘అంతరించే ప్రమాదం పొంచి ఉన్నవి’గా ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్సర్వేషన్ ఆఫ్ నేచర్.. రెడ్ లిస్ట్ కేటగిరీలో పేర్కొంది. 2008లో అయితే ఇవి గంభీర ప్రమాదం పొంచిఉన్న శ్రేణిలో ఉండేవి. ఆసియా సింహాల్ని సంరక్షించడం కోసం, వాటి సురక్ష దిశగా చేస్తున్న కృషి ఫలితంగా గడచిన కొన్ని సంవత్సరాల్లో వాటి సంఖ్య పెరుగుతూ వచ్చింది.
గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సమాచారాన్ని బట్టి చూస్తే, గత మూడు సంవత్సరాల కాలంలో ఆసియా సింహాల సంరక్షణకు కేటాయించిన నిధులు ఈ కింది విధంగా ఉంది:
సంవత్సరం
|
కేటాయించిన నిధులు (కోట్ల రూపాయల్లో)
|
2021-22
|
91.03
|
2022-23
|
129.16
|
2023-24
|
155.53
|
పర్యావరణం, అడవులు, వాతావరణ మార్పు శాఖ సహాయ మంత్రి శ్రీ కీర్తి వర్ధన్ సింగ్ రాజ్యసభలో ఈరోజు ఒక ప్రశ్నకు లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాచారంలో ఈ విషయాల్ని తెలియజేశారు.
***
(Release ID: 2102817)
Visitor Counter : 30